టాలీవుడ్ ప్రముఖుల ఓట్లు, ఎవరెక్కడ - మద్దతెవరికి..!!
మరి కొద్ది గంటల్లో తెలుగు రాష్ట్రాల్లో పోలింగ్ ప్రారంభం కానుంది. ఈ సారి ఎన్నికల పోరు రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ హోరా హోరీగా మారుతోంది. ఏపీలో పార్లమెంట్ తో పాటుగా అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. తెలంగాణలో 17 ఎంపీ స్థానాలకు పోలింగ్ జరగనుంది. రాజకీయ ప్రముఖులు...టాలీవుడ్ సెలబ్రెటీలు ఓటు హక్కు వినియోగించుకోవటం కోసం సిద్దమయ్యారు. ఈ సారి సినీ ముఖ్యులు పోలింగ్ ప్రారంభం అయిన సమయంలోనే ఓటింగ్ కేంద్రాలకు చేరుకోన్నారు.
ఓటు కోసం సినీ ప్రముఖులు
టాలీవుడ్ ప్రముఖులు హైదరాబాద్ లోనే తమ ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. ఏపీ మూలాలు ఉన్న సినీ సెలబ్రెటీలు సైతం హైదరాబాద్ లోనే ఓటు కొనసాగిస్తున్నారు. తెలంగాణలో జరుగుతున్న ఎంపీ ఎన్నికల్లో భాగంగా టాలీవుడ్ ముఖ్యులు ఓటు వేసేందుకు సిద్దమయ్యారు. హైదరాబాద్ లోని జూబ్లీహిల్స్ పబ్లిక్ స్కూల్ లో టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్‌బాబు ఆయన సతీమణి నమ్రత ఓటు వేయనున్నారు. అదే విధంగా..మంచు మోహన్‌బాబు, విష్ణు, లక్ష్మి, మనోజ్ తమ ఓట్లను వేయనున్నారు. పోలింగ్ బూత్ 164 లో విజయ్ దేవరకొండ, ఆనంద్ దేవరకొండ ,శ్రీకాంత్ తమ ఓటును వినియోగించుకోనున్నారు.

ఎవరి ఓటు ఎక్కడ
ఫిలీంనగర్ కల్చరల్ సెంటర్ లో రాఘవేంద్రరావు, జీవిత, రాజశేఖర్ ఓటు వేయనున్నారు. పోలింగ్ బూత్ 160 లో విశ్వక్‌సేన్, పోలింగ్ బూత్ 166లో దగ్గుబాటి రాణా, సురేశ్ బాబు ఓటు వేయనున్నారు. జూబ్లీహిల్స్ క్లబ్ (పోలింగ్ బూత్ 149)లో చిరంజీవి, సురేఖ, రాంచరణ్, ఉపాసన , నితిన్ తమ ఓటును వినియోగించుకోనున్నారు. ఎంపీ, ఎమ్మెల్యే కాలనీ(పోలింగ్ బూత్ 157)లో రవితేజ ఓటు వేయనున్నారు. ఓబుల్ రెడ్డి స్కూల్(పోలింగ్ బూత్ 150)లో జూనియర్ ఎన్టీఆర్, ప్రణతి, బీఎస్‌ఎన్‌ఎల్ సెంటర్ (పోలింగ్ బూత్ 153)లో అల్లు అర్జున్, స్నేహారెడ్డి , అల్లు అరవింద్, అల్లు శిరీష్ ఓటు వేయనున్నారు.
మద్దతెవరికి
అలాగే వర్కింగ్ ఉమెన్స్ హాస్టల్(పోలింగ్ బూత్ 151)లో నాగార్జున, అమల, నాగచైతన్య, అఖిల్ ఓటు వేస్తారు. మణికొండలోని హైస్కూల్ లో ప్రభాస్, అనుష్క, వెంకటేశ్, బ్రహ్మానందం తమ ఓటును వినియోగించుకోనున్నారు. షేక్ పేట్ ఇంటర్నేషనల్ స్కూల్ లో రాజమౌళి, రమారాజమౌళి ఓటు వేయనున్నారు. రోడ్ నెం.45, జూబ్లీహిల్స్ ఆర్థిక సహకార సంస్థ వద్ద గల పోలింగ్ బూత్ లో అల్లరి నరేశ్ ఓటు వేయనున్నారు. అదేవిధంగా యూసఫ్‌గూడ చెక్‌పోస్టు ప్రభుత్వ పాఠశాలలో గల పోలింగ్ బూత్ లో తనికెళ్ల భరణి ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఇదే సమయంలో టాలీవుడ్ ప్రముఖులు ఎవరికి మద్దతుగా నిలుస్తారనేది ఆసక్తి కరంగా మారుతోంది.












Click it and Unblock the Notifications