కన్నీరు పెట్టిస్తోన్న టమాటా, ఉల్లిపాయ
టమాటా ధరలు రోజురోజుకు పెరుగుతున్నాయి. నిత్యావసరాలు కూడా పెరుగుతున్నప్పటికీ వాటిని మించిన వేగంతో టమాటా దూసుకుపోతోంది. వేసవి కాలంలో కాస్తంత పర్వాలేదు అనిపించినప్పటికీ వర్షాకాలం వచ్చేసరికి మాత్రం కూరగాయల ధరలు రోజురోజుకు పెరుగుతున్నాయి. గతేడాది టమాటా ధర ఎలా పెరిగిందో మనందరం చూశాం. ధరలు కూడా భయపెట్టాయి. కేజీ రూ.150 నుంచి రూ.200 వరకు అమ్మకాలు జరిగాయి. ఆ తర్వాత ఉల్లిపాయలు కూడా టమాటా బాటలోనే నడిచాయి. అవి ఒకానొక దశలో కేజీ రూ.100 నుంచి రూ.120 వరకు పలికాయి.
రిటైల్ మార్కెట్ లో కేజీ రూ.100
మళ్లీ సంవత్సరం తిరగకుండానే టమాటా, ఉల్లిపాయ మరోసారి భయపెడుతున్నాయి. కేవలం రెండు నెలల క్రితమే సరైన ధర లేదంటూ రైతులంతా టమాటాలను రోడ్డుమీద పారపోశారు. ప్రస్తుతం అదే టమాటా రూ.100కు చేరువలో ఉంది. ఏపీ, తెలంగాణలో కేజీ టమాటా రూ.80 నుంచి రూ.90 మధ్యలో ఉంది. రానున్న వారం రోజుల్లో రూ.100 నుంచి రూ.110 వరకు పలుకుతుందని అంచనా వేస్తున్నారు. అలాగే రెండోరకం టమాటా ధర కేజీ రూ.60 నుంచి రూ.80 మధ్యలో పలుకుతోంది. రిటైల్ దుకాణాల్లో వీటి ధర రోజురోజుకు పెరుగుతోంది. కేజీ రూ.100కు విక్రయిస్తున్నారు.

కొనుగోలు చేయాలన్నా కన్నీరే
కోస్తే కన్నీరు వస్తాయని ఉల్లిపాయను అంటారు. అయితే కొనుగోలు చేసినా కన్నీరు తెప్పిస్తానని ఉల్లిపాయ కూడా టమాటా బాటలో పయనిస్తోంది. ప్రస్తుతం మార్కెట్ లో కేజీ ఉల్లిపాయ ధర రూ.50 నుంచి రూ.60 మధ్యలో ఉంది. రెండోరకం ఉల్లిపాయను మూడుకిలోలు రూ.100కు అమ్ముతున్నారు. ఇందులోనే చిన్న పాయ ధర మరోరకంగా ఉంది. చికెన్, మటన్ కాకుండా టమాటా, ఉల్లిపాయ కూడా ధరలు పెరగడం సామాన్యుపై మోయలేని భారం అవుతోంది. గతంలో రూ.100 పట్టుకొని రైతుబజారుకు వెళితే సంచి నిండా కూరగాయలు వచ్చేవి. ఇప్పుడు మాత్రం రూ.500 తీసుకువెళ్లాల్సి వస్తోందంటూ వినియోగదారులు వాపోతున్నారు. బంగారం పెరిగినా బాధపడని మహిళలు టమాటా, ఉల్లిపాయ ధరలు పెరిగితే మాత్రం తీవ్ర ఆందోళన చెందుతారు. ధరలు తగ్గితేనే వారికి ఊరట.
-
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
త్వరలో తిరుపతి, హైదరాబాద్కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి -
తిరుమలలో సీఎం చంద్రబాబుకు భక్తుల స్పెషల్ రిక్వెస్ట్, అక్కడే ఆదేశాలు..!! -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
ఇరాన్ కు ట్రంప్ డెడ్ లైన్- కౌంట్ డౌన్ బిగిన్స్ -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
ఎట్టకేలకు జీవన్ రెడ్డి చేరే పార్టీ ఖరారు, అదే బాటలో..!!












Click it and Unblock the Notifications