రోజుకు ఒక టమోటా తింటే ఎన్ని ప్రయోజనాలో తెలుసా?
టమోటా లేకుండా కూరను వండలేం. కూరల్లోనే కాకుండా ప్రతిరోజు ఒక టమోటాను తీసుకుంటే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. మన రోజువారీ ఆహారంలో భాగంగా చేసుకుంటే ఎసిడిటీ నుంచి ఉపశమనం లభిస్తుంది. ఇందులో ఉండే పీచు, విటమిన్ సి, విటమిన్ కే, పొటాషియం, బీటా కెరోటిన్, ఫోలెట్, ఫాస్పరస్ పుష్కలంగా ఉంటాయి. టామోటాలతో తయారుచేసిన వంటకాలను తింటుంటే ఎసిడిటీతో బాధపడేవారు మంచి ఫలితాలు అందుకుంటారు.
* నీటిలో నానబెట్టి తింటే మలబద్ధకం నుంచి సులువుగా బయటపడవచ్చు.
* షుగరు వ్యాధిగ్రస్తులకు ఎంతో ఉపయోగం. మూత్రంలో చక్కెర శాతాన్ని నియంత్రిస్తుంది.
* జీర్ణశక్తిని మెరుగుపరుస్తుంది.
* బరువును తగ్గించడంలో ఉపయోగపడతాయి.

* టమాటాపై ఉండే ఎరుపు రంగు పొరల్లో లైకోపిన్ ఉండే యాంటీ ఆక్సిడెంట్‌లు ఆరోగ్యానికి మేలు చేస్తాయి.
* పురుషుల్లో ప్రొస్టేట్ క్యాన్సర్ దూరమవుతుంది.
* వారానికి కిలోన్నర టమోటా తినే పురుషులకు ప్రొస్టేట్ క్యాన్సర్ సోకే అవకాశం తక్కువ.
* జీర్ణ సమస్యలున్నవారు తక్కువగా తినాలి.
* అలెర్జీ ఉన్నవారు సాధ్యమైనంత తక్కువగా తినాలి.
* ఎక్కువ బరువున్నవారు, షుగరు వ్యాధిగ్రస్తులు, హైబీపీ ఉన్నవారు వైద్యుల సలహా మేరకు తీసుకోవాలి.
* కీళ్లనొప్పులు, కండరాల నొప్పులు ఉన్నవారు టమోటాకు దూరంగా ఉండాలి.












Click it and Unblock the Notifications