మదనపల్లె మార్కెట్ లో టమాటాల మంట

కూరగాయల ధరలు రోజురోజుకు మండిపోతున్నాయి. కొన్ని రోజులుగా టమాటాల ధర భారీగా పెరుగుతున్న సంగతి తెలిసిందే. అన్నమయ్య జిల్లా మదనపల్లె వ్యవసాయ మార్కెట్‌లో టమాటా ధర రికార్డు స్థాయికి చేరింది. ఎన్నడూ లేనివిధంగా కిలో రూ.124 అయింది. మదనపల్లె మార్కెట్‌కు సాధారణంగా 1500 టన్నుల టమాటా వచ్చేంది. గురువారం మాత్రం 750 టన్నులే వచ్చింది.

దీనివల్ల వ్యాపారుల మధ్య పోటీ పెరిగి ఏ గ్రేడ్‌ టమాటా కిలో రూ.106 నుంచి రూ.124, బీ గ్రేడ్‌ రూ.86 నుంచి రూ.105 కు చేరింది. సగటున రూ.100 నుంచి 110 వరకు పలుకుతోంది. ఈ మార్కెట్ నుంచి టమాటాలను ఉత్తరాది రాష్ట్రాలకు ఎగుమతి చేస్తారు.

tomato price in madanapalle agriculture market

నిత్యావసర సరకుల్లో ఒకటైన టమాటా ధరలు దేశవ్యాప్తంగా రోజురోజుకు పెరుగుతూనే ఉన్నాయి. ఇప్పటికే పలు రాష్ట్రాల్లో కిలో టమాటా ధర సెంచరీ కొట్టింది. అన్ని రాష్ట్రాల్లోను ఇదేతీరు కనిపిస్తోంది. సరఫరాలో అంతరాయం కలగడం, టమాటాను ఎక్కువగా సాగుచేసే ప్రాంతాల్లో ప్రతికూల వాతావరణం ఏర్పడటమే దీనికి కారణమని మదనపల్లె వ్యవసాయ మార్కెట్ కమిటీ అధికారులు తెలిపారు. దేశవ్యాప్తంగా అన్ని ప్రధాన నగరాల్లో టమాటాలు సెంచరీని దాటేశాయి.

మధ్యప్రదేశ్‌, ఏపీ, కర్ణాటకతోపాటు తమిళనాడు, ఒడిశా, గుజరాత్‌లలో టామాటా ఎక్కువగా సాగవుతుంటుంది. తీవ్ర వడగాడ్పులతో ప్రతికూల వాతావరణం నెలకొన్నప్పటికీ వర్షాభావ పరిస్థితులు కనిపించడంతో రైతులు సంతోషించారు. అయితే భారీ వర్షాలవల్ల కొన్నిచోట్ల పంట దెబ్బతింటోంది.
ఈ ప్రాంతాల్లో ఇటీవల ప్రతికూల వాతావరణం కనిపించింది. మొన్నటివరకు తీవ్ర వడగాల్పులతో ఉక్కిరిబిక్కిరవగా తర్వాత వర్షాభావ పరిస్థితులు కనిపించాయి. రుతుపవనాల రాకతో పరిస్థితులు మారినప్పటికీ.. పలు ప్రాంతాల్లో భారీ వర్షాల వల్ల పంట దెబ్బ తింటోంది. కర్ణాటకలోని బెంగళూరు రూరల్‌, చిత్రదుర్గ, చిక్కబళ్లాపుర్‌, కోలార్‌, రామనగర జిల్లాల్లో పంట దెబ్బతింది. దాదాపు తెలంగాణలోను ఇదే పరిస్థితి నెలకొంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+