ఆల్ టైమ్ రికార్డ్ సృష్టించిన టమాటా
గత 40 రోజులగా వంటింట్లో ఉపయోగించుకునే టమాటా ధరలకు దేశవ్యాప్తంగా రెక్కలొచ్చిన సంగతి తెలిసిందే. దేశంలోని అన్ని రాష్ట్రాల్లోను ధరలు రోజురోజుకు పైకెగబాకుతూనే ఉన్నాయి. మార్కెట్ లో కేజీ టమాటా రూ.150 నుంచి రూ.200 మధ్యలో పలుకుతోంది. వీటిని కొనుగోలు చేయాలంటే ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. దేశవ్యాప్తంగా వర్షాలు కురుస్తుండటం కూడా ఈ ధరలకు రెక్కలు రావడానికి కారణమైంది.
ఈ తరుణంలోనే ఏపీలోని మదనపల్లె టమాటా మార్కెట్ లో ధరలు రికార్డుస్థాయికి చేరుకున్నాయి. కేజీ టమాటా రూ.168 పలికింది. అన్నదాతలు కేవలం 361 టన్నులు మాత్రమే తీసుకొచ్చారు. వీటిల్లో ఏ గ్రేడ్ టమాటా రూ.118 నుంచి రూ.138 వరకు, బి గ్రేడ్ టమాటా రూ.140 నుంచి రూ.168 వరకు పలికింది. సగటున కేజీ టమాటా రూ.132 నుంచి రూ.156 మధ్యలో ఉన్నట్లు మదనపల్లె మార్కెట్ యార్డు కార్యదర్శి అభిలాష్ చెప్పారు.

24 గంటల క్రితం రూ. 140 పలికిన కిలో టమాటా ధర.. నేడు రూ. 168కి చేరింది. ఒక రోజులోనే దాదాపుగా రూ. 30 పెరిగింది. దీంతో కొనుగోలు దారుల్లో గుబులు మొదలైంది. సామాన్య ప్రజలు అయితే టమాటా వైపు చూడ్డమే మానేశారు. నిత్యం టమాటాలతో కళకళలాడే వంట గది.. ప్రస్తుతం అవి లేక వెలవెలబోతోంది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా వర్షాలు కురుస్తుండటంతోపాటు టమాటా దిగుబడి కూడా బాగా తగ్గింది. మరికొద్ది రోజులు ఇదే పరిస్థితి కొనసాగుతుందని అంచనా వేస్తున్నారు. ఒకప్పుడు ధరలు లేక రైతులు రోడ్లమీద పారబోసి వెళ్లిపోయేవారు. అటువంటి టమాటా ప్రస్తుతం సిరులు కురిపిస్తోంది. మహారాష్ట్రలో పలువురు టమాటా సాగుచేసే రైతులు వీటి విక్రయాలద్వారా లక్షాధికారులుగా, కోటీశ్వరులుగా మారుతున్నారు.












Click it and Unblock the Notifications