భారత్‌లో మెరుపు వేగంతో దూసుకుపోయే టాప్-5 రైళ్లు
భారతీయ రైల్వే గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. దాదాపు 145 కోట్ల జనాభాతో ప్రపంచంలోనే రెండోస్థానంలో ఉన్న భారత్ అంతమందికి అవసరమైన రవాణా వ్యవస్థను అతి తక్కువ ధరకు తీసుకురావడం అనేది ఎక్కడా జరగలేదు. రైల్వే నెట్ వర్క్ పరంగా ప్రపంచంలో నాలుగో స్థానంలో నిలిచింది. దేశవ్యాప్తంగా 13వేల రైళ్లు రోజుకు కోటిమంది ప్రయాణికులను తమ గమ్యస్థానాలకు చేరవేస్తున్నాయి. ఈ క్రమంలో సూపర్ ఫాస్ట్, ఎక్స్ ప్రెస్, శతాబ్ది, రాజధాని, వందేభారత్ లాంటి వేగవంతమైన రైళ్లను భారతీయ రైల్వే అందుబాటులోకి తెచ్చింది.
గంటకు 160 కిలోమీటర్ల వేగంతో
వందేభారత్ రైళ్లు పట్టాలెక్కనంతవరకు ఆ స్థానాన్ని శతాబ్ది, రాజధాని రైళ్లు ఆక్రమించేవి. సెమీ హైస్పీడ్ రైళ్లయిన వందేభారత్ తో అవి పోటీపడలేకపోతున్నాయి. త్వరలోనే వందేభారత్ స్లీపర్ రైళ్లు రాబోతున్నాయి. ఢిల్లీ నుంచి భోపాల్ మధ్య నడుస్తున్న వందేభారత్ రైలు మనదేశంలో అత్యధిక వేగంతో ప్రయాణించే మొదటి రైలుగా నిలిచింది. గంటకు 180 కిలోమీటర్ల వేగంతో నడిచే అవకాశం ఉన్నప్పటికీ ట్రాక్ దెబ్బతినకుండా ఉండేందుకు, భద్రత కోసం గంటకు 160 కిలోమీటర్ల వేగంతో దీన్ని నడుపుతున్నారు.

నిజాముద్దీన్ నుంచి ఆగ్రా వరకు
హజ్రత్ నిజాముద్దీన్ నుంచి ఆగ్రా మార్గంలో నడుస్తుంది. ఈ రెండు నగరాల మధ్య కేవలం రెండు గంటల సమయమే పడుతోంది. బోగీలన్నీ ఏసీతోపాటు వైఫై ఉచితంగా ఇస్తారు. దీనితర్వాత న్యూఢిల్లీ నుంచి భోపాల్ వరకు ఇది నడుస్తున్న శతాబ్ది ఎక్స్ ప్రెస్ మూడోస్థానంలో నిలిచింది. గంటకు 150 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుంది. ఈ రైలులో ప్రయాణికులకు ఉచితంగా ఆహారం ఇస్తారు. నాలుగో స్థానంలో ఢిల్లీ నుంచి ముంబయి మధ్య నడుస్తున్న రాజధాని ఎక్స్ ప్రెస్ నిలిచింది.
గంటకు 140 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుంది. ఈ రైలులో ప్రయాణికులకు కాఫీ, టీ, స్నాక్స్, మంచినీళ్ల సీసాలు, ఐస్ క్రీం అందిస్తారు. ఐదో స్థానంలో న్యూఢిల్లీ నుంచి బెంగాల్ లోని సీల్దా వరకు నడుస్తున్న రైలు నిలిచింది. ఇది గంటకు 135 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుంది. ఇందులో కూడా ప్రయాణికులకు ఉచితంగా టీ, కాఫీ, స్నాక్స్ అందజేస్తారు.












Click it and Unblock the Notifications