చిలీలో ట్రెక్కింగ్‌కు వెళ్లి గిన్నిస్ రికార్డ్ విజేత మల్లి మిస్సింగ్, ఏపీ వ్యక్తి
హైదరాబాద్: ఏడు ఖండాల్లోని ఎత్తయిన పర్వతాలను 172 రోజుల్లో అధిరోహించి గిన్నిస్ రికార్డులో పేరు నమోదు చేసుకున్న శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా సంగెం మండలం గాంధీజనసంఘం గ్రామవాసి మల్లి మస్తాన్ బాబు అదృశ్యమయ్యాడు. ఇది గ్రామంలో విషాదఛాయలు నింపింది.
మస్తాన్ బాబు చిలీ, అర్జెంటీనా దేశాల మధ్య ఉన్న ఎత్తైన కొండలను ఎక్కేందుకు వెళ్లాడు. అయితే, గత రెండు రోజులుగా ఆయన ఆచూకీ లభించడం లేదు. అతను ఇటీవల కొంతమందితో కలిసి చిలీ దేశంలో పర్వతారోహణం చేసేందుకు వెళ్లారు. అక్కడ ప్రతికూల వాతావరణం ఉండడంతో మస్తాన్ సహచరులందరూ వెనుతిరిగారు.

కానీ మస్తాన్ మాత్రం పర్వతారోహణానికి వెళ్లారు. ఆ తర్వాత అదృశ్యమయ్యారు. చిలీ దేశంలోని పర్వతం అధిరోహించడానికి వెళ్లిన ఆయన అదృశ్యమైనట్టు ఆయన సహచరులు చిలీలోని భారత రాయబార కార్యాలయంలో ఫిర్యాదు చేశారు.
కోరుకొండ సైనిక స్కూల్లో చదువుకున్న మస్తాన్ ఖరగ్‌పూర్ ఐఐటీలో ఎంటెక్ పూర్తి చేశారు. సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా పని చేసిన ఆయన పర్వతారోహణం మీద ఆసక్తితో ఉద్యోగానికి రాజీనామా చేశారు. చిలీలో మస్తాన్ అదృశ్యం కావడంతో అతని కుటుంబ సభ్యులు, బంధువులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. మల్లి మస్తాన్ బాబు 2006 జనవరి 19 నుంచి జూలై 10 వరకు ఏడు ఖండాల్లోని పర్వతాలను అధిరోహించారు.
-
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం -
‘దీదీ’ రాజీనామా.. ఎన్నికల వేళ మమత సంచలన నిర్ణయం! -
ఏపీలో తెలంగాణ సీఎం.. లోకేష్ బంపర్ ఆఫర్ -
అంతా అయిపోయింది- డొనాల్డ్ ట్రంప్ -
Red Alert: వడగళ్ల వాన, రాబోయే రెండు గంటల్లో భారీ వర్షం












Click it and Unblock the Notifications