వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పవన్ కళ్యాణ్ కొత్త టీవీ ఛానల్ పెట్టబోతున్నారు?: కసరత్తు షురూ!

వచ్చే(2019) అసెంబ్లీ ఎన్నికల బరిలోకి దిగుతామని జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే పవన్ తన గళాన్ని ప్రజలకు వినిపించేందుకు కొత్త టీవీ ఛానెల్ పెట్టేందుకు సిద్ధమవు

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్/అమరావతి: వచ్చే(2019) అసెంబ్లీ ఎన్నికల బరిలోకి దిగుతామని జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే పవన్ తన గళాన్ని ప్రజలకు వినిపించేందుకు కొత్త టీవీ ఛానెల్ పెట్టేందుకు సిద్ధమవుతున్నట్లు సమాచారం.

ప్రముఖ తెలుగు న్యూస్ ఛానెళ్లకు చెందిన ఇద్దరు అధినేతలతో కలిసి ఈ ఛానల్‌ను ఆయన ఏర్పాటు చేయనున్నట్టు తెలుస్తోంది. ఇటీవల నిర్వహించిన కాటమరాయుడు ప్రీ-రిలీజ్ ఫంక్షన్‌కు ఈ రెండు ఛానెళ్ల అధినేతలు హాజరయ్యారు.

ఈ ఫంక్షన్ కు మీడియా భాగస్వాములుగా మాత్రమే వారు హాజరయ్యారని కొంత మంది చెబుతున్నప్పటికీ.. అంతకుముందు, ఈ ఇద్దరు అధినేతలు పవన్‌తో ప్రత్యేకంగా భేటీ అయినట్టు తెలుస్తోంది. కొత్త టీవీ ఛానెల్ ఏర్పాటు విషయమై పవన్‌ని వారు కలిశారనే ప్రచారం జరుగుతుండటం గమనార్హం. త్వరలోనే దీనిపై స్పష్టత వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

ఎన్నికల బరిలోకి..

ఎన్నికల బరిలోకి..

తాను సినిమాలకు దూరంగా జరిగి, వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తానని పవన్ కళ్యాణ్ ఇప్పటికే స్పష్టం చేశారు. తద్వారా పూర్తి సమయం రాజకీయాలకు అంకితం కానున్నట్లు తెలిపారు. 2019 ఎన్నికల్లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో జనసేన పోటీ చేస్తుందని చెప్పారు.

ప్రచారానికి టీవీ ఛానల్ అవసరమే..

ప్రచారానికి టీవీ ఛానల్ అవసరమే..

రాజకీయ పార్టీలకు పబ్లిసిటీ కచ్చితంగా కావాలి. టీవీ ఛానల్స్, న్యూస్ పేపర్ల ద్వారా నాయకులకు బాగా ప్రచారం వస్తుంది. ప్రముఖుల విషయంలో ఏం జరిగినా మీడియా హైలెట్ చేస్తుంది. పవన్ కళ్యాణ్ టాప్ హీరో. కాబట్టి ఆయన విషయంలోను మీడియా ఎప్పుడు బాగా స్పందిస్తున్న విషయం తెలిసిందే.

పొత్తు పెట్టుకుంటారా..

పొత్తు పెట్టుకుంటారా..

పవన్ కళ్యాణ్ రాజకీయ పార్టీ పెట్టినందున వచ్చే ఎన్నికల్లో ఏ పార్టీతో పొత్తు ఉంటుంది, ఒంటరిగా పోటీ చేస్తారా? అనే విషయం స్పష్టం కాలేదు. ఒంటరిగా పోటీ చేస్తే వ్యతిరేక పార్టీలకు అనుకూలంగా ఉన్న మీడియాతో ఇబ్బందికర పరిస్థితులు తలెత్తే అవకాశాలను కొట్టిపారేయలేం. ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా ప్రతి పార్టీకి మీడియా ఉండటం లేదా ఇతర మీడియా ఛానళ్లు వారికి మద్దతుగా నిలవడం తెలిసిన విషయమే.

సొంత మీడియా ఉంటే మేలు..

సొంత మీడియా ఉంటే మేలు..

ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ వచ్చే ఎన్నికల్లో బరిలోకి దిగితే.. వ్యతిరేక పార్టీకి చెందిన మీడియా ఆయనను టార్గెట్‌గా చేసుకునే అవకాశాలు లేకపోలేదు. ఇప్పుడు పొగుడుతున్న వారే అప్పుడు తిట్టవచ్చు. ఇది జనసేనకు నెగిటివ్ అయ్యే అవకాశాలు ఉంటాయి. ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్‌కు సొంత మీడియా ఉంటే బాగుండేదనే వాదనలు కూడా వినిపిస్తున్నాయి. ఈ క్రమంలోనే పవన్ కళ్యాణ్ తన కొత్త టీవీ ఛానల్‌పై దృష్టి సారిస్తున్నట్లు తెలుస్తోంది.

English summary
For Pawan Kalyan, who is an active participant of both cinema and politics, the journey in politics is definitely going to be quite challenging and just his own image doesn't help to make him closer to people. So, what's more important is media attention and projection.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X