Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

ఆ మంత్రుల సీటులో వైసీపీకి పెను సవాల్..!

ఏపీలో త్వరలో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో అనకాపల్లి లోక్ సభ నియోజకవర్గం పరిధిలోని అనకాపల్లి అసెంబ్లీ సీటులో జరగబోయే పోరు ఆసక్తి రేపుతోంది. దీనికి కారణం టీడీపీకి గట్టి పట్టున్న ఈ నియోజకవర్గంలో తొలిసారి గెలిచిన వైసీపీ ఈ సీటును నిలబెట్టుకుంటుందా లేదా అన్న చర్చే. ఈ సీటులో ప్రతికూల పవనాల్ని గమనించిన వైసీపీ ఇప్పటికే మంత్రి గుడివాడ అమర్నాథ్ ను తప్పించి కొత్త మొహం మలసాల భరత్ కు సీటిచ్చింది. అయినా గట్టి పోటీ తప్పేలా లేదు.

అనకాపల్లి అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలో అనకాపల్లి, కసింకోట మండలాలు ఉన్నాయి. దాదాపు 2 లక్షలకు పైగా ఓటర్లు ఉన్నారు. కులాల పరంగా చూస్తే కాపులదే ఇక్కడ హవా. వీరి తర్వాత స్ధానంలో గవరలు, కొప్పుల వెలమలు ఉన్నారు. రాజకీయంగా మాత్రం గవరలు వర్సెస్ కాపుల పోరు సాగుతుంటుంది. టీడీపీ ఆవిర్భావానికి ముందు జరిగిన ఆరు ఎన్నికల్లో కమ్యూనిస్టులు 4 సార్లు ( 1952, 1962, 1967, 1978) గెలిచారు. ఈ నాలుగు సార్లూ ఒకే అభ్యర్ధి కొడుగంటి గోవిందరావు గారే గెలిచారు. 1955లో కృషికార్ పార్టీ, 1972లో కాంగ్రెస్ ఇక్కడ గెలిచాయి.

tough challenge for ysrcp to retain anakapalle constituency amid tdp-janasena tie-up this time

టీడీపీ ఆవిర్భావం తర్వాత 9 సార్లు ఎన్నికలు జరిగితే ఇందులో టీడీపీ ఆరుసార్లు (1983, 1985, 1989, 1994, 1999, 2014) గెలిచింది. ఇందులో నాలుగుసార్లు దాడి వీరభద్రరావే గెలిచి మంత్రి అయ్యారు. ఆ తర్వాత 2004లో గెలిచిన కాంగ్రెస్ అభ్యర్ధి కొణతాల రామకష్ణ, 2009లో ప్రజారాజ్యం అభ్యర్ధిగా గెలిచిన గంటా శ్రీనివాసరావు, 2019లో వైసీపీ నుంచి గెలిచిన గుడివాడ అమర్నాథ్ మంత్రులుగా పనిచేశారు. మధ్యలో 2014లో గెలిచిన పీలా గోవింద్ కు మాత్రమే ఈ అవకాశం దక్కలేదు.

2019 ఎన్నికల్లో టీడీపీ, జనసేన విడివిడిగా పోటీ చేసి 65 వేలు, 12 వేలు ఓట్లు సాధించాయి. దీంతో 73 వేల ఓట్లు తెచ్చుకున్న వైసీపీ అభ్యర్ధి గుడివాడ అమర్ నాథ్ గెలిచి మంత్రి అయ్యారు. ఈసారి టీడీపీ-జనసేన పొత్తుతో పాటు నియోజకవర్గంలో ప్రతికూల పరిస్దితులతో అమర్ కు మరోసారి సీటు దక్కలేదు. దీంతో విపక్షాల ఉమ్మడి అభ్యర్ధి కొణతాల రామకృష్ణపై వైసీపీ కొత్త అభ్యర్ధి భరత్ గెలుపు అంత సులువు కాదనే అంచనాలున్నాయి.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+