టవర్ డిజైన్ కే మెజారిటీ ఓటు.. అమరావతిలో నిర్మించనున్న అసెంబ్లీ బిల్డింగ్ మోడల్ ఇదే....
Recommended Video

అమరావతి: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ భవనానికి డిజైన్ ను ఫైనల్ చేశారు. మెజారిటీ ప్రజల నిర్ణయం మేరకే ఆ మోడల్ ను ఖరారు చేశారు. ఆ డిజైన్ ఏమిటంటే...టవర్ ఆకృతి
ఎపి రాజధాని అమరావతిలో నిర్మించనున్న అసెంబ్లీ భవనానికి టవర్ ఆకృతి ఫైనల్ అయిపోయింది. నార్మన్ ఫోస్టర్ సంస్థ సూచించిన రెండు డిజైన్ల లో ఈ టవర్ మోడల్ కే మెజారిటీ ప్రజలు మొగ్గుచూపారట. ఈరోజు జరిగే కేబినెట్ మీటింగ్ లో ఈ టవర్ డిజైన్ పై చర్చించిన అనంతరం దీని నిర్మాణానికి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇవ్వనుంది.

సిఎం డిజైన్ల పరిశీలన...
ఆంధ్ర ప్రదేశ్ శాసనసభ భవనానికి నార్మన్ ఫోస్టర్ సంస్థ ఇచ్చిన వివిధ డిజైన్లలో మెజారిటి ప్రజలు ఈ టవర్ డిజైన్ కే ఓటేసినట్లు ప్రభుత్వం తెలిపింది. శుక్రవారం విజయవాడలోని ఓ హోటల్‌లో జరిగిన డీప్ డైవ్ కార్యక్రమంలో ఎపి సిఎం చంద్రబాబు శాసనసభ తోపాటు , హైకోర్టు, అడ్మినిస్ట్రేషన్ బిల్డింగ్ ల డిజైన్లను పరిశీలించారు. ఈ సందర్భంగా గతంలో ప్రభుత్వం సూచించిన మార్పుచేర్పుల గురించి నార్మన్ ఫోస్టర్ ప్రతినిధులు చంద్రబాబుకు వివరించారు.

మార్పులు చేర్పులు...
1350 ఎకరాల్లో నిర్మించే సచివాలయం,పరిపాలనా నగర ప్రణాళికల డిజైన్లను ప్రభుత్వం ఇప్పటికే ఖరారు చేసిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా అందులో పార్కులు, రహదారుల ప్రణాళికలో కొన్ని మార్పులు చేశారు. శాసనసభ, సచివాలయం, ప్రభుత్వాధికారుల కార్యాలయాలన్నీ ఈ బ్లాక్‌లోకే వస్తాయి. గతంలో శాసనసభ భవనం ఈ బ్లాక్ చివరగా ఉండేట్లుగా సపరేటుగా డిజైన్ చేశారు. కానీ ఇప్పుడు దానిని బ్లాక్ మధ్యలోకి మార్చారు.

కొత్త అసెంబ్లీ ఇలా ఉంటుంది...
నగర ప్రణాళిక బ్లాక్ మొత్తం 250 ఎకరాలు కాగా, అందులో 120 ఎకరాల్లో ఓ తటాకంలా ఏర్పాటు చేసి, దాని మధ్యలో అసెంబ్లీ భవనాన్నిటవర్ ఆకృతిలో నిర్మించనున్నారు. ఆ తటాకంలో భవనం ప్రతిబింబం కనిపించేలా నిర్మాణం జరుపుతారు. ఈ భవనం ఎత్తు 250 మీటర్లు కాగా, సందర్శకులు 40 మీటర్ల వరకు పైకి వెళ్లి నగరాన్ని వీక్షించవచ్చు. ఇది మొత్తం నాలుగు విభాగాలుగా ఉంటుంది. శాసనసభ, శాసనమండలి సమావేశ మందిరాలు, సెంట్రల్ హాల్, పరిపాలనా భవనం తదితర విభాగాలుంటాయి. మధ్యలో మ్యూజియం ఉంటుంది.

మెజారిటీ ఓటు...
అసెంబ్లీ డిజైన్ పై సోషల్ మీడియాలో జనాభిప్రాయం కోరగా, 68 శాతం మంది దీనికి ఓకే చెప్పినట్లు తెలిసింది. శుక్రవారం నాటికి మొత్తం 24,905 మంది స్పందించగా, వారిలో 17,088 మందిఈ టవర్ డిజైన్ కే ఓటేశారు. 7,817 మంది మాత్రం చతురస్రాకారపు డిజైన్ కు మొగ్గు చూపినట్లు మంత్రి నారాయణ వెల్లడించారు.
-
IPL 2026: కొంపముంచిన బుడ్డోడు.. రాజస్థాన్‌ను చిత్తు చేసిన SRH! -
నిర్మాతలకు స్టార్ హీరోయిన్ బంపరాఫర్! -
West Bengal Survey: బీజేపీ అంతర్గత సర్వేలో షాకింగ్- ఎన్ని సీట్లో తెలుసా ? -
మూడు పండుగలకు రెగ్యులర్ గా మూడు ఉచిత సిలిండర్ల పంపిణీ + రూ.2,000 -
Tamil Nadu Polls: సర్వేల షాక్ తో విజయ్ బిగ్ టర్న్..! తుది దశలో తాజా ప్లాన్..! -
ఎన్నికల వేళ విజయ్ సమర్థతను తేల్చేసిన పవన్..!! -
ఇలా చేస్తే అమరావతి గొడవ క్లోజ్..! మావిగన్ వేళ చంద్రబాబుకు సాయిరెడ్డి ఐడియా..! -
Amaravati: సాయిరెడ్డి సలహాపై స్పందించిన టీడీపీ..! బహిరంగ లేఖ..! -
ఆర్టీసీ బస్సు ఛార్జీల్లో మార్పులు, కొత్త రేట్లు ఇలా..!! -
అలిపిరి నుంచిప్రత్యేకంగా 11 లేన్ల రహదారి- టోల్ గేట్ సమూల పునరుద్ధరణ? -
పసిడికి భారీ డిమాండ్: కుప్పలు తెప్పలుగా -
రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్, పథకాలు ఇక నుంచి..!!












Click it and Unblock the Notifications