ఏపీలో అంబులెన్స్ లకు ట్రాకింగ్ విధానం: త్వరలో అందుబాటులోకి తెస్తున్న జగన్ సర్కార్!!
ఏపీలో అంబులెన్స్ లకు ట్రాకింగ్ విధానం త్వరలో అందుబాటులోకి తీసుకు రానుంది జగన్ ప్రభుత్వం. ఈ విషయాన్ని ఇటీవల మంత్రి విడదల రజినీ కూడా చెప్పారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆసుపత్రులలో వైద్య సౌకర్యాల కల్పనపై ప్రభుత్వం పెద్ద ఎత్తున దృష్టి సారిస్తుంది. అంతేకాదు అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో, ఆధునిక వైద్య వసతులను కల్పించడం కోసం జగన్ ప్రభుత్వం కృషి చేస్తుంది. ఏపీ మంత్రి విడదల రజిని ఈ నేపథ్యంలో అధికారులతో ఎప్పటికప్పుడు సమీక్షలు నిర్వహించి వారికి తగిన సూచనలు ఇస్తున్నారు. వైద్య శాఖను పరుగులు పెట్టిస్తున్నారు. ఈ క్రమంలో తాజాగా ఏపీలో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో రాష్ట్ర ప్రజలకు 108 అంబులెన్స్ ట్రాకింగ్ విధానాన్ని అందుబాటులోకి తెస్తుంది జగన్ సర్కార్.

108 అంబులెన్స్ ట్రాకింగ్ విధానాన్ని ఏపీలో తెస్తున్న వైసీపీ ప్రభుత్వం
ఎక్కడైనా ఏదైనా ఎమర్జెన్సీ ఉంటే 108 కి కాల్ చేసిన తర్వాత అది ఏ సమయానికి సంఘటన స్థలానికి వస్తుందో తెలియదు. అంబులెన్స్ కోసం ఎదురు చూడాల్సిన పరిస్థితి బాధితులకు ఉంటుంది. ఇక ఈ సమస్యకు స్వస్తి చెబుతూ 108 అంబులెన్స్ ట్రాకింగ్ విధానాన్ని ఏపీలో ప్రజల కోసం అందుబాటులోకి తెస్తుంది వైసిపి ప్రభుత్వం. ఓలా, ఊబర్, రాపిడో వంటి వాహనాలను ట్రాక్ చేసే తరహాలోనే, 108 వాహనాలను కూడా ట్రాక్ చేసే విధానాన్ని వైద్య శాఖ ప్రవేశపెడుతుంది.

ట్రయల్ రన్ విజయవంతం .. త్వరలో అంబులెన్స్ ల ట్రాకింగ్ అందుబాటులో
దీనివల్ల బాధితులు 108 కి కాల్ చేసిన తర్వాత వాహనం ఎక్కడ వరకు వచ్చింది? ఎంతసేపట్లో తమ వద్దకు వస్తుంది? ఎక్కడ ఉంది? వంటి అనేక అంశాలను ట్రాక్ చేసుకునే వీలుంటుంది. ఏ సమయానికి అంబులెన్స్ తమ వద్దకు వస్తుందో తెలుసుకునే అవకాశం ఉంటుంది. ఇప్పటికే దీని ట్రయల్ రన్ విజయవంతంగా పూర్తి కావడంతో అంబులెన్స్ ల ట్రాకింగ్ సదుపాయాన్ని త్వరలో అందుబాటులోకి తీసుకురానున్నారు. ఇటీవల వైద్య ఆరోగ్య శాఖ మంత్రి విడదల రజిని ఆరోగ్యశ్రీ పైన నిర్వహించిన సమీక్ష సమావేశంలో కూడా అంబులెన్స్ వాహనాల ట్రాకింగ్ సిస్టమ్ గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు.

అంబులెన్స్ ల ట్రాకింగ్ పై మంత్రి విడదల రజిని
గిరిజన ప్రాంతాలలో అంబులెన్స్ ల సంఖ్యను పెంచాలని సూచించారు. 108అంబులెన్స్ లు ఘటన స్థలానికి చేరుకునే సమయంలో ఫోన్ చేసిన వారికి ఆ వాహనం ఎక్కడుందో తెలియడం కోసంమొబైల్ ఫోన్ కురూట్ మ్యాప్ లింకు పంపేందుకు ప్రయోగాత్మకంగా చర్యలు తీసుకుంటున్నామని, త్వరలో అమలు చేస్తామని మంత్రి విడదల రజిని వెల్లడించారు.ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్నిఆరోగ్య ఆంధ్ర ప్రదేశ్ గా చేయడానికి ప్రభుత్వం తీసుకుంటున్న అనేక చర్యలపై మంత్రి విడదల రజని దృష్టి సారిస్తున్నారు.












Click it and Unblock the Notifications