బైక్ దంపతులపై ట్రాఫిక్ పోలీస్ ఓవరాక్షన్: అవమానకరంగా తిట్టాడు, ఫిర్యాదు
హైదరాబాద్: హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు ఓవర్ యాక్షన్ తెలిపే ఓ సంఘటన మంగళవారం ఉదయం అమీర్‌పేట పరిధిలోని బల్కంపేటలో చోటు చేసుకుంది. బైక్‌పై వెళుతున్న ఓ జంట, ముందుగా వెళుతున్న ఇన్నోవా కారును స్వల్పంగా ఢీకొట్టింది. దీంతో నేమ్ ప్లేట్ కాస్త వంగిపోయింది.
దీంతో సదరు కారు యజమానితో మాట్లాడిన బైక్ దంపతులు, నష్టాన్ని తాను భరిస్తానని చెప్పడంతో పాటు తన మొబైల్ నెంబర్‌ను ఇచ్చాడు. ఈ విషయాన్ని దూరంగా ఉండి గమనిస్తున్న సనత్ నగర్ ట్రాఫిక్ ఇన్ స్పెక్టర్, అక్కడికొచ్చి ఈ వివాదంలో తలదూర్చారు.
అసలేమైందని ప్రశ్నిస్తూనే, కారు యజమానికి డబ్బిచ్చావా? అంటూ బైక్ దంపతులను అడిగారు. డబ్బు అవసరం లేకుండా వివాదం పరిష్కారమైందని చెప్పడంతో వాగ్వాదానికి దిగిన ఇన్ స్పెక్టర్, కారు యజమాని పిలిచి మరీ అతనితో పాటు వాగ్వాదానికి దిగాడు.

అప్పడికప్పడే కారు యజమానికి డబ్బు ఇవ్వాల్సిందేనని బైక్ దంపతులను గద్దించాడు. డబ్బు లేకపోతే కారు యజమాని కాళ్లు పట్టుకోండంటూ బైక్ యజమాని భార్యకు హుకుం జారీ చేశాడు. ఈ క్రమంలో ఆ దంపతులిద్దరినీ, ఎడాపెడా భూతలు తిట్టడంతో పాటు, నోటి చెప్పలేని
భూతులు తిట్టాడు.
ఇదేం పద్ధతంటూ ఆ దంపతులు నిలదీయడంతో, అదంతేనంటూ వారిపై కొప్పడ్డాడు. ఇదే సమయంలో మీడియా రంగప్రవేశం చేయడంతో చిన్నగా అక్కడ నుంచి తప్పుకున్నాడు. ఇన్ స్పెక్టర్ అవమానకరంగా మాట్లాడటంతో ఆవేదనకు గురైన దంపతులు సనత్ నగర్ పోలీస్ స్టేషన్‌లో సదరు
ట్రాఫిక్ ఇన్ స్పెక్టర్‌పై ఫిర్యాదు చేశారు.












Click it and Unblock the Notifications