నూతన సంవత్సర వేడుకల్లో విషాదం: పవన్ కళ్యాణ్, మహేష్ ఫ్లెక్సీలు కడుతూ 5గురు మృతి

రాజమండ్రి: నూతన సంవత్సర వేడుకల్లో విషాదం చోటు చేసుకుంది. ఫ్లెక్సీలు కడుతుండగా విద్యుత్ షాక్‌తో ఐదుగురు మృతి చెందారు. మండపేట మండలం మారేడుబాక దగ్గర ముగ్గురు యువకులు, రంగపేట మండలం పడిసలేరు దగ్గర ఇద్దరు యువకులు మృతి చెందారు.

మృతుల్లో ఇద్దరిని సతీష్, వరప్రసాద్‌లుగా గుర్తించారు. కొత్త సంవత్సర వేడుకలు ఆయా కుటుంబాల్లో విషాదాన్ని నింపాయి. రెండు చోట్ల కూడా యువకులు తమ తమ అభిమాన హీరోల ఫ్లెక్సీలు కడుతుండగా ఈ విషాదం చోటు చేసుకున్నట్లుగా తెలుస్తోంది. ఈ ఘటనల్లో ఏడుగురికి గాయాలు అయ్యాయి.

Tragedy in New Year Celebrations: five dead

రెండుచోట్ల ఆ యువకులు తమ అభిమాన హీరోలు మహేష్ బాబు, పవన్ కళ్యాణ్ ఫ్లెక్సీలు కడుతుండగా ప్రమాదం జరిగిందని తెలుస్తోంది.

పవన్ కల్యాణ్, మహేశ్ బాబుల ఫ్లెక్సీలు కడుతున్న సమయంలో జరిగిన ఈ ప్రమాదాల్లో ఈ ఐదుగురు మృతి చెందారని తెలుస్తోంది. వడిసలేరులో పవన్ కల్యాణ్ ఫ్లెక్సీ కడుతున్న సమయంలో ఇద్దరు మృతి చెందగా, అయిదుగురు గాయపడ్డారు. గాయపడ్డ వారిని ఆసుపత్రికి తరలించారు.

మారేడుపాకలో మహేశ్ బాబుకు చెందిన ఇరవై అడుగుల భారీ ఫ్లెక్సీని ఏర్పాటు చేసే క్రమంలో రాత్రి ప్రమాదం సంభవించింది. విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగానే జరిగిన ఈ ప్రమాదంలో ముగ్గురు అక్కడికక్కడే చనిపోయారు. ఈ ప్రమాదంలో ఇద్దరు ముగ్గురుకి గాయాలయ్యాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+