ప్రమాదంపై రైలు డ్రైవర్..., ఏపీ స్కూళ్లలో నివాళులు
హైదరాబాద్: మెదక్ జిల్లాలోని మాసాయిపేట వద్ద జరిగిన ఘోర రైలు ప్రమాదంలో ముక్కుపచ్చలారని చిన్నారులు మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ ఘటన పైన రైలు డ్రైవర్ ఓ టీవీ ఛానల్‌తో స్పందించారు. తాము లెవల్ క్రాసింగ్‌కు అర కిలోమీటర్ దూరం నుండే హారన్ ఇచ్చుకుంటూ వస్తున్నామన్నారు.
పట్టాల పైన బస్సును చూడగానే ఎమర్జెన్సీ బ్రేక్ వేసినట్లు చెప్పారు. ఒక్కసారిగా బస్సు ట్రాక్ పైకి వచ్చిందన్నారు. బస్సు డ్రైవర్ నిర్లక్ష్యం వల్లే ప్రమాదం జరిగిందన్నారు. సడన్ బ్రేక్ వేయడంతో రైలు వేగం తగ్గిపోయిందని, అదే వేగంతో ఉంటే కనుక బస్సు చెల్లాచెదురు అయి ఉండేదన్నారు.

తాము ఎలాంటి పొరపాటు చేయలేదని చెప్పారు. ప్రమాదం జరిగిన వెంటనే తాను రైలును ఆపేసి 108కి కాల్ చేశామని చెప్పారు. అలాగే ఉన్నతాధికారులకు సమాచారం అందించామన్నారు. తమ పైన కొందరు దాడి చేశారని చెప్పారు. ఈ ప్రమాదంతో తాను అప్ సెట్ అయ్యానని, ఏడ్చుకుంటూ కూర్చున్నానని చెప్పారు.
ఏపీ పాఠశాలల్లో మౌనం
మాసాయిపేట ఘటనలో ప్రాణాలు కోల్పోయిన చిన్నారులకు నివాళులు అర్పించాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రి గంటా శ్రీనివాస రావు ఆదేశించారు. మధ్యాహ్నం మూడు గంటలకు అన్ని పాఠశాలల్లో రెండు నిమిషాలు మౌనం పాటించి సంతాపం ప్రకటించాలన్నారు.












Click it and Unblock the Notifications