గుంటూరు, హైదరాబాద్, నిజామాబాద్, మార్కాపురం వారికి ముఖ్య గమనిక
ఏపీ, తెలంగాణలో నడుస్తున్న కొన్ని రైళ్లను దక్షిణ మధ్య రైల్వే రద్దు చేసింది. వివిధ అభివృద్ధి పనుల నిమిత్తం రద్దు చేయాల్సి వస్తోందని, ప్రయాణికులు అవగాహన చేసుకొని రైల్వేకు సహకరించాలని అధికారులు కోరారు. కొన్ని రైళ్లను పూర్తిగా, మరికొన్ని రైళ్లను పాక్షికంగా రద్దు చేశారు. హైదరాబాద్, సికింద్రాబాద్, గుంటూరు డివిజన్ల పరిధిలో రద్దయిన రైళ్ల వివరాలు తెలుసుకుందాం.
25వ తేదీన కర్నూలు సిటీ-సికింద్రాబాద్ (17024) 90 నిముషాల రీషెడ్యూల్
26, 27, 30 తేదీల్లో గుంతకల్లు-బోధన్ (07671) 120 నిముషాల రీషెడ్యూల్
24 నుంచి 30వ తేదీ వరకు దండి-నిజామాబాద్ (11409) రైలును ముద్ఖేడ్-నిజామాబాద్,
25 నుంచి 31వ తేదీ వరకు నిజామాబాద్-పందర్‌పూర్ (01413) రైలు నిజామాబాద్-ముద్ఖేడ్ మధ్య రద్దయ్యాయి.
24 నుంచి 30వ తేదీ వరకు కాచిగూడ-నిజామాబాద్ (07596), నిజామాబాద్-కాచిగూడ (07593),
24 నుంచి 30వ తేదీ వరకు నాందేడ్-నిజామాబాద్ (07854)
24 నుంచి 30వ తేదీ వరకు నిజామాబాద్-నాందేడ్ (07853) రైళ్లను రద్దుచేశారు.

కడగలపాలెం-శావల్యాపురం మధ్య ఇంటర్ లింకింగ్ పనులవల్ల ఈ నెల 31వ తేదీ నుంచి ఆగస్టు 3వ తేదీ వరకు గుంటూరు-తిరుపతి (17261) రైలును మార్కాపురం-గుంటూరు మధ్య రద్దు చేశారు. మార్కాపురం-తిరుపతి మధ్య మాత్రమే నడుస్తుందని అధికారులు ప్రకటించారు.
రైల్వేబోర్డు సూచనల మేరకు జనరల్ బోగీల్లో ప్రయాణించేవారికి, సామాన్యులకు నాణ్యమైన భోజనం తక్కువ ధరకు అందుబాటులోకి తెచ్చేందుకు రైల్వే ప్రయత్నిస్తోంది. రూ.20, రూ.50 ఖరీదులో భోజన ప్యాకెట్లను తెస్తోంది.
మారుతున్న కాలానికి అనుగుణంగా ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాల కల్పనకు రైల్వే మొగ్గుచూపుతోంది. ఇందులో భాగంగానే వందే భారత్ రైళ్లను తీసుకువచ్చింది. దేశంలోని ప్రధాన నగరాల మధ్య దూరాన్ని తక్కువ సమయంలో చేరుకునేలా సెమీ హైస్పీడ్ రైళ్లలా రూపొందించారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రస్తుతం సికింద్రాబాద్-తిరుపతి, సికింద్రాబాద్-విశాఖపట్నం నగరాల మధ్య వందే భారత్ నడుస్తున్నాయి. ఈ నెలాఖరున విజయవాడ నుంచి చెన్నై మధ్య మరో వందేభారత్ ప్రారంభం కాబోతోంది. అలాగే సికింద్రాబాద్-నాగపూర్, కాచిగూడ-బెంగళూరు మధ్య కూడా వందే భారత్ తిప్పడానికి అధికారులు రైల్వేబోర్డుకు ప్రతిపాదనలు పంపించారు.












Click it and Unblock the Notifications