పనిమీద ఢిల్లీ వెళుతున్నారా? అయితే.. ఒక్క నిముషం ఆగండి!
మారుతున్న కాలానికి అనుగుణంగా ప్రయాణికులకు మెరుగైన ప్రయాణ సౌకర్యాన్ని కల్పించేందుకు భారతీయ రైల్వే నిరంతరం ప్రయత్నిస్తూనే ఉంటుంది. ఇందులో భాగంగా సెమీ హైస్పీడ్ రైళ్లయిన వందే భారత్ ను ప్రవేశపెట్టింది. దేశంలోని ప్రధాన నగరాల మధ్య దూరాన్ని తక్కువ సమయంలో చేరుకోవాలనే లక్ష్యం ఇమిడి ఉంది. ప్రయాణికుల నుంచి కూడా వీటికి రోజురోజుకు ఆదరణ లభిస్తుండటంతో త్వరలోనే వందే సాధారణ్ రైళ్లను ప్రవేశపెట్టేందుకు అధికారులు సమయాత్తమవుతున్నారు.
ఒడిసాలోని బాలసోర్ వద్ద కోరమాండల్ ఎక్స్ ప్రెస్ ప్రమాదానికి గురైన నేపథ్యంలో దాదాపు 300కు పైగా ప్రయాణికులు మరణించిన సంగతి తెలిసిందే. తిరిగి అటువంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉండేందుకు దేశవ్యాప్తంగా అన్ని డివిజన్ల పరిధిలో సిగ్నలింగ్ వ్యవస్థను ఆధునికీకరిస్తున్నారు. దీనిలో భాగంగా నార్త్ సెంట్రల్ రైల్వే ఆగ్రా డివిజన్‌లో ఆధునికీకరణ పనుల వల్ల కొన్ని రైళ్లు రద్దు చేశారు.

జనవరి 8,14,15,19,29, ఫిబ్రవరి 2 తేదీల్లో విశాఖ-హజ్రత్ నిజాముద్దీన్(12803) స్వర్ణజయంతి ఎక్స్‌ప్రెస్ రద్దైంది.
జనవరి 10,14,17,21,31, ఫిబ్రవరి 4 తేదీల్లో హజ్రత్ నిజాముద్దీన్-విశాఖ(12804) రద్దు చేశారు.
జనవరి 9,10,11,13,14,16,17,18, 20,21,23,24,25,27, 28,30,31, ఫిబ్రవరి 1,2,3,4 తేదీల్లో విశాఖ-హజ్రత్ నిజాముద్దీన్(12807) సమతా ఎక్స్‌ప్రెస్ రద్దయింది.
జనవరి 11,12,13,15, 16,18,19,20,22,23,25,26,27,29,30, ఫిబ్రవరి 1,2,3,5,6 తేదీల్లో హజ్రత్ నిజాముద్దీన్-విశాఖ(12808)ను రద్దు చేశారు.
జనవరి 19,20,23,26,27,30, ఫిబ్రవరి 2,3 తేదీల్లో విశాఖ-అమృత్‌సర్(20807) హిరాకుడ్ ఎక్స్‌ప్రెస్
జనవరి 21,24,27,28,31, ఫిబ్రవరి 3,4,7 తేదీల్లో అమృత్‌సర్-విశాఖ(20808) ఎక్స్‌ప్రెస్‌ను రద్దు చేసినట్లు అధికారులు తెలిపారు.












Click it and Unblock the Notifications