ఏపీలో భారీగా ఐఏఎస్ అధికారుల బదిలీలు, సీఆర్డీఏ కమిషనర్‌గా కన్నబాబు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఐపీఎస్ అధికారులతోపాటు భారీ సంఖ్యలో ఐఏఎస్ అధికారుల బదిలీలు కూడా జరిగాయి. కొందరికి పోస్టింగ్ ఇచ్చారు. రాష్ట్రంలో 25 మంది ఐఏఎస్‌లకు పోస్టింగ్‌లు, బదిలీలు చేస్తూ ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. సీఆర్డీఏ కమిషనర్‌గా కన్నబాబును నియమించారు.
సీఎం ఎక్స్ అఫీషియో ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా సాయిప్రసాద్ నియమితులయ్యారు. జలవనరులశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా సాయి ప్రసాద్ బాధ్యతలు నిర్వర్తించనున్నారు. హౌసింగ్‌శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా అజయ్ జైన్ నియమితులయ్యారు. పర్యాటక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా ఆయనకు అదనపు బాధ్యతలు అప్పగించారు.
పశు సంవర్ధక, పాడి పరిశ్రమ అభివృద్ధి ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా బి. రాజశేఖర్, ప్రభుత్వరంగ సంస్థల ముఖ్యకార్యదర్శిగా కె. సునీత బాధ్యతలు స్వీకరించనున్నారు. పురపాలకశాఖ ముఖ్యకార్యదర్శిగా ఎస్.సురేశ్ కుమార్ నియమితులయ్యారు. పౌరసరఫరాలశాఖ కమిషనర్‌గా సౌరభ్ గౌర్, సెర్ప్ సీఈఓగా వాకాటి కరుణను నియమించారు.

వైద్యారోగ్యం కుటుంబ సంక్షేమశాఖ కమిషనర్‌గా వీరపాండియన్, స్టాంపులు రిజిస్ట్రేషన్ల శాఖ ఐజీగా హరినారాయణ్, ఎన్టీఆర్ వైద్యసేవ ట్రస్ట్ సీఈఓగా పట్టన్‌షెట్టి రవిసుభాష్, పట్టణాభివృద్ధి, పురపాలక శాఖ కమిషనర్ డైరెక్టర్‌గా పి.సంపత్‌కుమార్, పోలవరం ప్రాజెక్టు అడ్మినిస్ట్రేటర్‌గా వి. అభిషేక్ నియమితులయ్యారు.
ఆర్కియాలజీ, మ్యూజియంల శాఖ కమిషనర్‌గా వాణిమోహన్, కార్మికశాఖ కమిషనర్‌గా ఎంవీ శేషగిరి బాబు, ఆర్థికశాఖ ముఖ్యకార్యదర్శిగా పీయూష్ కుమార్, ఐటీశాఖ కార్యదర్శిగా కాటమనేని భాస్కర్, కోన శశిధర్‌కు ఉన్నత విద్యాశాఖ కార్యదర్శిగా అదనపు బాధ్యతలు అప్పగించారు.
మరోవైపు, ఏలో 27 మంది ఐపీఎస్ అధికారులను ప్రభుత్వం బదిలీ చేసింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్ ఉత్తర్వులు జారీ చేశారు. రాజీవ్ కుమార్ మీనాను ఏపీ పోలీస్ రెక్రూట్‌మెంట్ బోర్డు ఛైర్మన్‌గా నియమించారు. శాంతిభద్రతల అదనపు డీజీగా ఎన్ మధుసూదన్ రెడ్డి నియమితులయ్యారు.
ఐజీపీ (ఆపరేషన్స్)గా సీహెచ్ శ్రీకాంత్ బదిలీ అయ్యారు. టెక్నికల్ సర్వీసెస్ ఐజీపీగానూ ఆయనకు అదనపు బాధ్యతలు అప్పగించారు. ఏపీఎస్పీ బెటాలియన్ ఐజీపీగా బీ రాజకుమారి, ఏపీ ఫోరెన్సిక్ ల్యాబ్ డైరెక్టర్‌గా జి. పాలరాజు, బాధ్యతలు స్వీకరించనున్నారు. కాకినాడ ఎస్పీ విక్రాంత్ పాటిల్ కర్నూలు ఎస్పీగా బదిలీ అయ్యారు.
తిరుపతి ఎస్పీగా హర్షవర్ధన్ రాజు, ఏసీబీ డైరెక్టర్‌గా ఆర్ జయలక్ష్మి,
తిరుపతి ఎస్పీగా హర్షవర్ధన్ రాజు, తిరుపతి జిల్లా ఎర్రచందనం యాంటీ స్మగ్లింగ్ టాస్క్‌ఫోర్స్ ఎస్పీగా ఎల్ సుబ్బరాయుడు, ఏపీఎస్పీ కర్నూల్ సెకెండ్ బెటాలియన్ కమాండెంట్‌గా ఎం దీపిక, కో-ఆర్డినేషన్, హ్యూమన్ రైట్స్ అండ్ లీగల్ ఎస్పీగా కేఎస్‌ఎస్‌వీ సుబ్బారెడ్డిబదిలీ అయ్యారు.
కాకినాడ ఎస్పీగా బిందు మాధవ్, కడప ఎస్పీగా ఈజీ అశోక్ కుమార్,
ఇంటెలిజెన్స్ ఎస్పీగా ఎ. రమాదేవి, విజయవాడ డీసీపీ (అడ్మినిస్ట్రేషన్)గా సరిత, ఎస్‌సీఆర్‌బీ, సీఐడీ ఎస్పీగా పి. పరమేశ్వరరెడ్డి సీఐడీ ఎస్పీగా ఎస్. శ్రీధర్, విశాఖపట్నం డీసీపీ (అడ్మినిస్ట్రేషన్)గా కృష్ణకాంత్ పటేల్ నియమితులయ్యారు.
అల్లూరి సీతారామరాజు జిల్లా అదనపు ఎస్పీ (అడ్మినిస్ట్రేషన్)గా ధీరజ్ కునుబిల్లి, అల్లూరి సీతారామరాజు జిల్లా అదనపు ఎస్పీ (ఆపరేషన్స్)గా జగదీశ్, ఇంటెలిజెన్స్ ఎస్పీగా జె. రామ మోహన్‌రావు, సీఐడీ ఎస్పీగా ఎన్. శ్రీదేవి రావు, పీటీవో డీఐజీగా- సత్య యేసుబాబు, వెల్ఫేర్ అండ్ స్పోర్ట్స్ డీఐజీగా అన్బురాజన్, గ్రేహౌండ్స్ డీఐజీగా బాబూజీ అట్టాడ,
ఏపీఎస్పీ డీఐజీగా ఫక్కీరప్ప, సీఐడీ ఎస్పీగా కె. చక్రవర్తి బదిలీ అయ్యారు.
-
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం -
‘దీదీ’ రాజీనామా.. ఎన్నికల వేళ మమత సంచలన నిర్ణయం! -
ఏపీలో తెలంగాణ సీఎం.. లోకేష్ బంపర్ ఆఫర్ -
అంతా అయిపోయింది- డొనాల్డ్ ట్రంప్ -
Red Alert: వడగళ్ల వాన, రాబోయే రెండు గంటల్లో భారీ వర్షం












Click it and Unblock the Notifications