ఇకనుంచి... రైళ్లలో జనరల్ టికెట్ తో స్లీపర్ క్లాస్ లో ప్రయాణం

స్లీపర్ కోచ్ ల్లో 80 శాతం కంటే తక్కు ఆక్యుపెన్సీతో నడుస్తుండే రైళ్ల వివరాలను రైల్వేశాఖ ఉన్నతాధికారులు సేకరించారు.

రైల్వే ప్రయాణికుల కోసం భారతీయ రైల్వే ఒక శుభవార్తను వినిపించింది. జనరల్ టికెట్ తీసుకొని జనరల్ బోగీల్లో ప్రయాణించేవారు అదే టికెట్ పై రిజర్వేషన్ బోగీల్లో ప్రయాణించవచ్చు. అయితే కొన్ని ప్రత్యేక సందర్భాల్లోనే రైల్వే ఈ సదుపాయాన్ని కల్పిస్తోంది.

కిటకిటలాడుతుండే జనర్ బోగీలు

కిటకిటలాడుతుండే జనర్ బోగీలు


సాధారణంగా మన రైళ్లల్లో జనరల్ బోగీలన్నీ కిటకిటలాడుతుంటాయి. పండగ సమయాల్లో ఈ రద్దీ ఇంకా దారుణంగా ఉంటుంది. కూర్చోవడానికి కూడా సీటు ఉండదు. వాష్ రూమ్స్ పక్కన కూడా కూర్చొని ప్రయాణించాల్సి వస్తుంది. అదే సమయానికి స్లీపర్ కోచ్ ల్లో బెర్తులు ఖాళీగా కనిపిస్తుంటాయి. తాజాగా ఇలా ఖాళీగా ఉన్నవాటిని ఉపయోగించుకోవాలని రైల్వేశాఖ భావిస్తోంది. మాములుగా అయితే స్లీపర్ కోచ్ లో బెర్తులు ఖాళీగా ఉంటే జనరల్ బోగీ నుంచి అందులోకి మార్చవచ్చుకదా అనే ఆలోచన చాలామంది ప్రయాణికులకు కదులుతుంది. ఇప్పటివరకు ఉన్న నిబంధనల ప్రకారం ఇది సాధ్యం కాదు. కానీ భారతీయ రైల్వే ఈ నిబంధనలను సవరిస్తోంది. స్లీపర్ కోచ్ లో మిగిలిన బెర్తులను జనరల్ కేటగిరి ప్రయాణికులకు కేటాయించాలని భావిస్తోంది.

80 శాతం కంటే తక్కువ ఆక్యుపెన్సీతో నడిచే రైళ్ల వివరాలు..

80 శాతం కంటే తక్కువ ఆక్యుపెన్సీతో నడిచే రైళ్ల వివరాలు..


స్లీపర్ కోచ్ ల్లో 80 శాతం కంటే తక్కు ఆక్యుపెన్సీతో నడుస్తుండే రైళ్ల వివరాలను రైల్వేశాఖ ఉన్నతాధికారులు సేకరించారు. రద్దీ ఎక్కువగా ఉండటంతో జనరల్ బోగీల్లోని కొందరు ప్రయాణికులను ఖాళీగా ఉన్న బెర్తుల్లోకి మారుస్తారు. జనరల్ టికెట్ తీసుకున్న ప్రయాణికులు ఇప్పటివరకు ఉన్న రూల్స్ ప్రకారం స్లీపర్ కోచుల్లో ప్రయాణించడానికి వీలు లేదు. స్లీపర్ కోచుల్లో ఖాళీ బెర్తులు ఉన్నా వాటిని ఉపయోగించుకోకూడదు. ఒకవేళ అలా ప్రయాణం చేస్తే రైల్వేశాఖ జరిమానా విధిస్తోంది.

 బీహార్ లోని అన్ని ప్రధాన రైళ్లలో..

బీహార్ లోని అన్ని ప్రధాన రైళ్లలో..


ఇక నుంచి ఆ సమస్య ఉండదు. రైల్వే శాఖనే జనరల్ టికెట్ ప్రయాణికులను స్లీపర్ కోచుల్లోకి అనుమతిస్తోంది. వేసవికాలం, శీతాకాలంలో రైల్వే ప్రయాణికులు స్లీపర్ కోచ్ లకు బదులుగా ఏసీ టికెట్లు బుక్ చేసుకుంటుంటారు. దీంతో సీప్లర్ లో ఖాళీలుంటున్నాయి. అలా రిజర్వు కాని బెర్తుల్ని జనరల్ వారికి కేటాయించబోతోంది. టికెట్ ఉన్న ప్రయాణికులు టీటీఈ అనుమతితో ప్రయాణించాల్సి ఉంటుంది. ఈ చిన్న మార్పు చేయడంద్వారా ప్రయాణికులకు సౌకర్యవంతంగా ఉండటంతోపాటు రైల్వేకు ఆక్యుపెన్సీ సమస్య తీరుతుంది. భారతీయ రైల్వే ప్రయోగాత్మకంగా కొన్ని రైల్వే జోన్లలో మాత్రమే ఈ వెసులుబాటు కల్పిస్తోంది. బీహార్ లోని అన్ని ప్రధాన రైళ్లల్లో ఈ వెసులుబాటు కల్పించినట్ల ఈస్టర్న్ సెంట్రల్ రైల్వే వెల్లడించింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+