బెంగళూరు ప్రయణికులకు APSRTC గుడ్ న్యూస్
తిరుమలలో వైకుంఠ ఏకాదశి ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయి. ఈ నెల 30వ తేదీన వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకుని ప్రారంభం అయ్యే వైకుంఠ ద్వార దర్శనాలు జనవరి 8వ తేదీ వరకు కొనసాగనున్నాయి. ఈ సందర్భంగా లక్షలాదిమంది భక్తులు శ్రీవారిని దర్శించుకునే అవకాశం ఉందని టీటీడీ అంచనా వేస్తోంది. దీనికి అనుగుణంగా చర్యలు చేపట్టింది. ఇప్పటికే తొలి మూడు రోజుల కోసం మొత్తం 1,76,000 మంది భక్తులను ఎలక్ట్రానిక్ డిప్ ద్వారా ఎంపిక చేశారు.
వైకుంఠ ఏకాదశి సమీపిస్తోండటంతో వివిధ నగరాలు, జిల్లా కేంద్రాలు, పట్టణాలు నుంచి తిరుమలకు ప్రత్యేక బస్సులను నడిపించడానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (APSRTC) ప్రత్యేక చర్యలు తీసుకుంటోంది. రెండు తెలుగు రాష్ట్రాల ఆర్టీసీ అధికారులు ఈ దిశగా ప్రణాళికలను రూపొందించుకుంటోన్నారు. బెంగళూరు, చెన్నై వంటి నగరాల నుంచీ పెద్ద సంఖ్యలో అదనపు, ప్రత్యేక బస్సులు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది.

ఈ క్రమంలో బెంగళూరు నుంచి తిరుమలకు రాకపోకలు సాగిస్తోన్న సప్తగిరి ఎక్స్ ప్రెస్ బస్సు సర్వీసుల వివరాలను ఏపీఎస్ఆర్టీసీ విడుదల చేసింది. తిరుమల, బెంగళూరు మధ్య మొత్తం 13 బస్సు సర్వీసులు అందుబాటులో ఉన్నాయి. అలిపిరి డిపోకు చెందిన బస్సులు అవి. తిరుమలలో బయలుదేరే ఈ బస్సులు తిరుపతి, చిత్తూరు మీదుగా రాకపోకలు సాగిస్తోన్నాయి. టిక్కెట్లను www.apsrtconline.in ద్వారా ఆన్‌లైన్‌లో బుక్ చేసుకోవచ్చు.
తిరుమల నుండి బెంగళూరు..
తిరుమల నుండి తెల్లవారు జామున 5:00, 6:00, 7:00, 9:30, మధ్యాహ్నం 1:15, 15:45 నిమిషాలకు బయలుదేరే సప్తగిరి ఎక్స్ ప్రెస్ బస్సులు (సర్వీసు నంబర్లు: 5512, 5470, 5466, 5468, 5490, 5518) వరుసగా మధ్యాహ్నం 12:30, 1:30, 2:30, సాయంత్రం 5:00, రాత్రి 8:45, 11 గంటలకు బెంగళూరుకు చేరకుంటాయి.
బెంగళూరు నుండి తిరుమల..
బెంగళూరు నుండి ఉదయం 8:05, రాత్రి 9:05, 9:35, 11:05, 11:35, 11:45, 11:59 నిమిషాలకు బయలుదేరే సప్తగిరి ఎక్స్ ప్రెస్ బస్సులు (సర్వీసు నంబర్లు: 5505, 5501, 5497, 5463, 5469, 5465, 5461) వరుసగా మధ్యాహ్నం 3:00, మరుసటి రోజు తెల్లవారు జామున 4:00, 4:30, 6:00, 6:30, 6:50, ఉదయం 7:25 నిమిషాలకు తిరుమలకు చేరుకుంటాయి.












Click it and Unblock the Notifications