విజయవాడలో ప్రయివేటు బస్సుకు తప్పిన పెను ప్రమాదం, కిటికీ నుంచి దూకేశారు
విజయవాడ: 40 మంది ప్రయాణీకులతో ప్రయాణిస్తున్న ఓ ట్రావెల్ బస్సుకు ఆదివారం పెను ప్రమాదం తప్పింది. విశాఖపట్నం నుంచి హైదరాబాద్ వస్తున్న ఉమర్ కాళేశ్వరి ట్రావెల్స్‌కు చెందిన బస్సు విజయవాడ సీతన్నపేట గేటు సెంటర్ వద్ద ఆటోను ఢీకొట్టింది.
అనంతరం అదుపుతప్పి సమీపంలో ఉన్న వంతెన రెయిలింగ్‌ను ఢీకొని ఆగిపోయింది. బస్సు డ్రైవర్ చాకచక్యంతో వ్యవహరించడంతో బస్సు కాలువలో పడలేదు. ఈ ప్రమాదంలో టాటా ఏస్ డ్రైవర్‌కు తీవ్ర గాయాలయ్యాయి.

బస్సు ఒక్కసారిగా కుదుపులకు లోనుకావడంతో నిద్రలో ఉన్న ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు. కొందరు చీకట్లో భారీ ప్రమాదం జరిగిందనుకుని బస్సు కిటికీల నుంచి బయటకు దూకేశారు. పోలీసులు బస్సు డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్నారు.












Click it and Unblock the Notifications