చావే మాకు శరణ్యం.. జీడితోటలలో ఉరికి సిద్ధమైన గిరిజన మహిళలు; షాకింగ్ వీడియో!!
వారంతా గిరిజన మహిళలు. ఉరవకొండ ప్రాంతంలో భూములను సాగు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. జీడి మామిడి తోటల సాగు ద్వారా జీవనోపాధి పొందుతున్న మహిళలకు ఇప్పుడు ఎక్కడ లేని కష్టం వచ్చి పడింది. కొందరు గ్రానైట్ కంపెనీ నిర్వాహకుల కళ్ళు ఈ జీడి మామిడి తోటలపై పడ్డాయి. దీంతో జీడిమామిడి సాగు చేస్తున్న గిరిజన మహిళలు వినూత్న రీతిలో తమ నిరసనను తెలియజేసి తమ సమస్యలు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.
జీడి మామిడి తోటలో చెట్టు కొమ్మలకు ఉరికి సిద్ధమైన మహిళల ఆవేదన
ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖ జిల్లా ఉరవకొండలోని జీడి మామిడి తోట వద్ద ఆందోళనకర దృశ్యం అందరినీ ఆలోచించేలా చేసింది. చెట్టు కొమ్మలకు చీరలు కట్టుకున్న గిరిజన మహిళలు తమ మెడకు తాత్కాలిక ఉరిని బిగించుకుని తమ సమస్యను చెప్పుకున్నారు. మా విన్నపాన్ని వినకుంటే మాకు చావే శరణ్యం అంటూ ఓ వీడియోలో వారు తమ ఆవేదనను వ్యక్తం చేశారు. ఇంతకీ ఉరవకొండ మహిళలు జీడి మామిడి చెట్ల కొమ్మలకు చీరతో ఉరికి సిద్ధమై తమ ఆవేదనను తెలియజేయడం వెనుక కారణం ఏమిటి అంటే

జీడి మామిడి తోటలను తొలగించి గ్రానైట్ కంపెనీకి కట్టబెడుతున్నారని ఆందోళన
విశాఖ జిల్లా మాడుగుల రెవెన్యూ పరిధిలోని ఉరవకొండలో జీడి మామిడి తోటలను తొలగించి గ్రానైట్ కంపెనీకి కట్టబెడుతున్నారంటూ మహిళలు ఆరోపణలు చేశారు. తాము జీడి మామిడి తోటలపై ఆధారపడి జీవిస్తున్నామని, డి పట్టా భూములను ప్రభుత్వమే ఇచ్చిందని వారు చెబుతున్నారు. అయితే స్థానిక ఎమ్మెల్యే, తహసీల్దార్ గిరిజనులపై వివక్ష చూపడంతో ఈ భూములు అన్యాక్రాంతం అవుతున్నాయని వారు ఆరోపిస్తున్నారు. తమకు జీవనాధారమైన జీడి తోటలను తొలగిస్తే, తాము మృత్యువును కౌగిలించుకోవడం తప్ప వేరే మార్గం లేదని వారు చెప్తున్నారు.

అడ్డుకుంటే కేసులు పెడుతున్నారన్న గిరిజన మహిళలు .. విచారణకు డిమాండ్
తాము ఏ గ్రానైట్ కంపెనీ నుంచి డబ్బులు తీసుకోలేదు.. కొందరు వ్యక్తులు మా భూములను అక్రమంగా గ్రానైట్ కంపెనీ కి కట్టబెట్టారంటూ వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మా వద్ద భూ యాజమాన్య హక్కు పత్రాలు లేవని ఈ కారణంగా జీడి మామిడి తోటలను నాశనం చేయడం కోసం, రోడ్లు వేయడం కోసం సదరు అక్రమార్కులు జెసిబి లను తెచ్చారని ఆరోపిస్తున్నారు. మా తోట గుండా రోడ్లు వేయాలని చూస్తున్న మైనింగ్ కంపెనీని అడ్డుకుంటే మాడుగుల మండల రెవెన్యూ అధికారి మాపై తప్పుడు కేసులు బనాయిస్తున్నారని, దీనిపై జాయింట్ కలెక్టర్ విచారణ జరిపించాలని మహిళలు కోరుతున్నారు.
-
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం -
‘దీదీ’ రాజీనామా.. ఎన్నికల వేళ మమత సంచలన నిర్ణయం! -
ఏపీలో తెలంగాణ సీఎం.. లోకేష్ బంపర్ ఆఫర్ -
అంతా అయిపోయింది- డొనాల్డ్ ట్రంప్ -
Red Alert: వడగళ్ల వాన, రాబోయే రెండు గంటల్లో భారీ వర్షం












Click it and Unblock the Notifications