Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

చిక్కుల్లో జగన్ సర్కార్- హైకోర్టుకు గంగవరం వాటాల వ్యవహారం-9 వేల కోట్ల వాటాలు 645 కోట్లకేనా ?

ఓవైపు కేంద్ర ప్రభుత్వం చేపట్టిన విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూన్న జగన్ సర్కార్.. మరోవైపు తమ చేతుల్లో ఉన్న గంగవరం పోర్టును అదానీ గ్రూప్ కు అమ్మేసింది. గంగవరం పోర్టులో ప్రభుత్వ వాటాను అదానీ గ్రూప్ కు బదిలీ చేసేసింది. దీంతో ఈ ప్రైవేటీకరణ వ్యవహారం కూడా విశాఖను కుదిపేస్తోంది. ఇప్పటికే అదానీ గ్రూప్ కు జగన్ సర్కార్ రహస్య సాయం చేస్తోందంటూ మేథాపులు, నిపుణులు విమర్శిస్తుండగా.. తాజాగా ఈ వ్యవహారంపై హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. దీనిపై ప్రభుత్వం హైకోర్టుకు ఇచ్చిన వివరణ ఆసక్తికరంగా ఉంది.

 అదానీ చేతికి గంగవరం పోర్టు

అదానీ చేతికి గంగవరం పోర్టు

విశాఖ జిల్లాలోని గంగవరం పోర్టును ఈ ఏడాది డీవీఎస్ రాజు కుటుంబ సభ్యుల నుంచి అదానీ పోర్ట్స్ సంస్ధ చేజిక్కించుకుంది. ఇందులో డీవీఎస్ రాజు కుటుంబ సభ్యుల వాటాతో పాటు మిగతా వాటాల్ని కూడా స్వాధీనం చేసుకుంటూ వచ్చిన అదానీ గ్రూప్ చివరిగా ప్రభుత్వ వాటా కూడా తీసేసుకోవడంతో ఏకంగా 95 శాతం వాటా దారు అయిపోయింది. అంటే ఈ పోర్టు ప్రైవేటీకరణలో ఉన్నంతకాలం అక్కడ అదానీ గ్రూప్ చెప్పిందే వేదం అన్నమాట. దీంతో ఈ వ్యవహారం ఇప్పుడు విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణతో సమానంగా కుదిపేస్తోంది.

 ప్రభుత్వ వాటా విక్రయం

ప్రభుత్వ వాటా విక్రయం

అదానీ పోర్ట్స్ సంస్ధ గంగవరం పోర్టును చేజిక్కించుకునే క్రమంలో డీవీఎస్ రాజు కుటుంబ సభ్యులకు ఉన్న వాటాతో పాటు మరికొన్ని స్వల్ప వాటాల్ని తీసుకుంటే సరిపోతుంది. 51 శాతం వాటాదారుగా పోర్టు అదానీ గ్రూప్ చేతికి వెళుతుంది. కానీ అదానీ గ్రూప్ అంతటితో ఆగకుండా మిగతా వాటాలపైనా కన్నేసింది. రేపు పోర్టులో తాము తీసుకునే నిర్ణయాలకు ఎదురు ఉండకూడదనే ఆలోచనలతో మిగతా వాటాల్ని కూడా కొనుగోలు చేసింది ఇందులో ఏపీ ప్రభుత్వానికి ఉన్న 10.4 శాతం వాటా కూడా ఉంది. దీంతో ఇప్పుడు ఈ వ్యవహారం జగన్ సర్కార్ మెడకు చుట్టుకోబోతోంది.

 చిక్కుల్లో జగన్ సర్కార్

చిక్కుల్లో జగన్ సర్కార్

గంగవరం పోర్టు హక్కుదారులైన డీవీఎస్ రాజు కుటుంబంతో పాటు మిగతా వాటాదారులు తమ వాటాల్ని అదానీ గ్రూప్ కు అమ్మేసుకోవడంలో పెద్దగా ఇబ్బందులు లేవు. కానీ ప్రభుత్వం గతంలో పోర్టుకు భూములిచ్చిన నేపథ్యంలో తమకు వచ్చిన 10.4 శాతం వాటాను అదానీ గ్రూప్ కు విక్రయించడంపైనే సమస్య అంతా తలెత్తింది. ప్రభుత్వం ఉదారంగా ప్రైవేటీకరణకు సహకరించేందుకే తమ వాటాను సైతం అదానీ గ్రూప్ కు కట్టబెట్టిందన్న వాదన వినిపిస్తోంది. దీంతో అసలు అదానీ గ్రూప్ గంగవరం పోర్టు వాటాల కొనుగోలు వ్యవహారంలో జగన్ సర్కార్ పాత్ర కూడా తెరపైకి వస్తోంది.

 స్టీల్ ప్లాంట్ కోసమే పోర్టుపై కన్ను ?

స్టీల్ ప్లాంట్ కోసమే పోర్టుపై కన్ను ?

ఎప్పుడైతే విశాఖ స్టీల్ ప్లాంట్ ను కేంద్రం ప్రైవేటీకరణ చేయబోతోందనే సమాచారం బయటికి వచ్చిందో అప్పుడే అదానీ గ్రూప్ గంగవరం పోర్టుపై కన్నేసింది. ఒక్కొక్కటిగా వాటాల కొనుగోలు చేసుకుంటూ వెళ్లింది. చివరికి ప్రభుత్వ వాటాను కూడా చేజిక్కించుకునే స్ధాయికి వెళ్లింది. గంగవరం పోర్టులో పూర్తి ఆధిపత్యం చెలాయించే క్రమంలో ప్రభుత్వ పాత్రను నామమాత్రం చేసేందుకే అదానీ గ్రూప్ ఈ నిర్ణయం తీసుకుందన్న ప్రచారం జరుగుతోంది. అయితే ఇందుకు ప్రభుత్వం ఎలా సహకరించిందన్న ప్రశ్నలూ తలెత్తుతున్నాయి. ఈ మొత్తం వ్యవహారానికి స్టీల్ ప్లాంట్ కేంద్ర బిందువుగా మారుతోంది. భవిష్యత్తులో స్టీల్ ప్లాంట్ తాము చేజిక్కించుకున్నా, లేకపోతే ఇతరుల చేతికి వెళ్లినా అక్కడి నుంచి సరకు రవాణా గంగవరం పోర్టు నుంచే జరగాల్సి ఉంటుంది. అందుకే ఈ పోర్టును ముందస్తుగా కొనుగోలు చేసిందా అన్న అనుమానాలు మాజీ ఐఏఎస్ అధికారి ఈఏఎస్ శర్మ నుంచి వ్యక్తమయ్యాయి.

 జగన్ సర్కార్ పై హైకోర్టులో పిల్

జగన్ సర్కార్ పై హైకోర్టులో పిల్

గంగవరం పోర్టులో తమకున్న 10.4 శాతం వాటాను జగన్ సర్కార్ ప్రైవేటీకరణలో భాగంగా అదానీ గ్రూప్ కు అమ్మేసుకుందన్న వాదన నేపథ్యంలో ఈ మొత్తం వ్యవహారంపై హైకోర్టులో తాజాగా పిల్ దాఖలైంది. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఏకే గోస్వామి, జస్టిస్ ఎన్.జయసూర్యతో కూడిన ధర్మాసనం ఈ వ్యాజ్యంపై విచారణ చేపట్టింది. గంగవరం, కృష్ణపట్నం పోర్టుల విషయంలో లోపాలపై లోకాయుక్తతో దర్యాప్తు జరిపించాలని, ప్రొప్రైటీ ఆడిట్‌ నిర్వహించేలా కంప్ట్రోలర్‌ అండ్‌ ఆడిటర్‌ జనరల్‌ (కాగ్‌)ను ఆదేశించాలని కోరుతూ ప్రకాశం జిల్లా గిద్దలూరు మండలం తంబాళ్లపల్లికి చెందిన డాక్టర్‌ సత్య భూపాల్‌రెడ్డి, గిద్దలూరుకు చెందిన బొంత పూర్ణచంద్రారెడ్డి హైకోర్టులో ప్రజాహిత వ్యాజ్యం దాఖలు చేశారు. దీనిపై హైకోర్టు విచారణ జరిపింది.

 అధికారుపై నెట్టేసిన జగన్ సర్కార్

అధికారుపై నెట్టేసిన జగన్ సర్కార్

గంగవరం పోర్టులో వాటాల విక్రయంపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ దాఖలైన పిల్ పై స్పందించిన ఏపీ ప్రభుత్వం ప్రాధమిక విచారణలోనే అధికారులపై నెపం నెట్టేసింది. ఉన్నతాధికారుల కమిటీ ఇచ్చిన నివేదిక ఆధారంగా గంగవరం పోర్టులో వాటాల విక్రయానికి ప్రభుత్వం నిర్ణయించిందని ఏజీ శ్రీరాం సుబ్రమణ్యం హైకోర్టుకు తెలిపారు. అయితే వాటా విక్రయంపై పూర్తి వివరాలు సమర్పించేందుకు సమయం కావాలని కోరారు. దీనికి అంగీకరించిన ధర్మాసనం విచారణను ఈ నెల 20కి వాయిదా వేసింది. అదే సమయంలో కృష్ణపట్నం పోర్టు వాటాల విక్రయాన్ని కూడా గంగవరం పోర్టు విక్రయంతో కలపడాన్ని జగన్ సర్కార్ హైకోర్టులో వ్యతిరేకించింది.

Recommended Video

    Vijayawada లో Sonu Sood కి ఊహించని క్రేజ్.. Amaravati రైతులకి మాటిచ్చిన సోనూ || Oneindia Telugu
     రూ.9 వేల కోట్ల వాటాలు రూ.645 కోట్లకా ?

    రూ.9 వేల కోట్ల వాటాలు రూ.645 కోట్లకా ?

    ఈ సందర్భంగా పిటిషనర్ల తరఫు న్యాయవాది గూడపాటి వెంకటేశ్వరరావు వాదనలు వినిపిస్తూ.. ప్రభుత్వ వాటా విక్రయ వ్యవహారమంతా గోప్యంగా జరిగిందన్నారు. అదానీ పోర్ట్స్‌కు రాష్ట్ర ప్రభుత్వ వాటా విక్రయించేందుకు ఐఏఎస్‌ అధికారితో కమిటీ వేశారన్నారు. ఆ కమిటీ నివేదికను ప్రభుత్వం బహిర్గతం చేయలేదన్నారు. ఏపీ ప్రభుత్వ 10.40 శాతం వాటా విక్రయానికి ఆమోదం లభించినట్లు 'ఏపీ మారిటైమ్‌ బోర్డు' తమకు తెలిపిందని అదానీ పోర్ట్స్‌ అండ్‌ స్పెషల్‌ ఎకనామిక్‌ జోన్‌ లిమిటెడ్‌ (ఏపీఎస్‌ఈజెడ్‌).. బాంబే స్టాక్‌ ఎక్స్ఛేంజీ, నేషనల్‌ స్టాక్‌ ఎక్స్ఛేంజీలకు సమాచారం ఇచ్చిందన్నారు. దీంతో ఈ వ్యవహారం బయటకు వచ్చిందన్నారు. ఈ వ్యవహారం ఆమోదానికి సంబంధించిన లేఖలు, జీవోలు ప్రజలకు అందుబాటులో లేవన్నారు. పోర్టుల్లో ప్రభుత్వ వాటా అదానీ సంస్థకు విక్రయ వ్యవహారంలో రాష్ట్ర ప్రభుత్వం, అధికారుల పాత్రపై లోకాయుక్తతో దర్యాప్తు జరిపించాలని కోరారు. గంగవరం, కృష్ణపట్నం పోర్టుల విషయంలో సమగ్ర ప్రాజెక్టు నివేదికలు, ఒప్పందాలు, జీవోల నోట్‌ఫైళ్లను పరిశీలించాలని కోరారు. ప్రొప్రైటీ ఆడిట్‌ నిర్వహించేలా కాగ్‌ను ఆదేశించాలన్నారు. రూ.9 వేల కోట్ల విలువైన ప్రభుత్వ వాటాను అదానీ సంస్థ కేవలం రూ.645 కోట్లుకు దక్కించుకునేందుకు ముందుకొచ్చిందన్నారు. విక్రయ ప్రక్రియకు సంబంధించి గతంలో జారీ చేసిన మూడు జీవోల అమలుపై స్టే ఇవ్వాలని కోరారు. కృష్ణపట్నం పోర్టు వాటా విక్రయంలోనూ పారదర్శకత లేదన్నారు. గంగవరం, కృష్ణపట్నం పోర్టుల కార్యకలాపాలు సాఫీగా నిర్వహించేందుకు విశాఖపట్నం పోర్ట్‌ ట్రస్ట్‌కు తాత్కాలికంగా బాధ్యతలు అప్పగించాలన్నారు.

    More From
    Prev
    Next
    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+