జవాబు చెప్పండి: టి కాంగ్రెస్‌పై టిఆర్ఎస్ 'ప్రజా ఛార్జీషీట్'

హైదరాబాద్: తెలంగాణ ప్రాంత కాంగ్రెసు నేతలు తమ పార్టీ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర రావు సవాలుపై స్పందించకుండా ఆయనపై ఆరోపణలు, వ్యక్తిగత విమర్శలకు దిగడం సరికాదని, వారు మొదట తమ ప్రజా ఛార్జీషీటుకు సమాధానాలు చెప్పాలని తెలంగాణ రాష్ట్ర సమితి సిద్దిపేట శాసన సభ్యుడు హరీష్ రావు అన్నారు. తెలంగాణ కాంగ్రెసు నేతలకు పది ప్రశ్నలు వేస్తున్నామని, ఇది తెలంగాణ ప్రజల ఛార్జీషీటు అని, వీటిపై నోరు విప్పాలని డిమాండ్ చేశారు.

కెసిఆర్ అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పకుండా గాయి చేసి.. గందరగోళం సృష్టిస్తే కుదరదని హెచ్చరించారు. మొన్నటిదాకా సీమాంధ్ర నాయకులు ఇలాగే గాయి చేసి వెళ్లిపోయారని ఎద్దేవా చేశారు. అడ్డగోలు వాదనతో ప్రజలను పక్కదోవ పట్టించాలని చూస్తున్నారని, చేసిందంతా చేసి ఇంకా జనాన్ని మభ్యపెడ్తున్నారా? అని మండి పడ్డారు. వారు తమ తప్పులు కప్పిపుచ్చుకోవటానికి కెసిఆర్‌ను విమర్శిస్తూ దిగజారుడు, దివాళాకోరు రాజకీయాలకు పాల్పడుతున్నారని ధ్వజమెత్తారు.

Harish Rao

చార్జిషీట్ రూపంలో వారిపై అభియోగాలనూ నమోదు చేస్తున్నామని, వారి ద్రోహాన్ని ప్రజా కోర్టులో పెడ్తామని ప్రకటించారు. కేంద్రమంత్రి జైరాం రమేషా.. దిగ్విజయ్‌సింగా.. మీరా.. ఎవరైనా సరే.. తెలంగాణ సమాజం తరఫున పది ప్రశ్నలు అడుగుతున్నాం.. సొల్లు పురాణం ఆపి సమాధానం చెప్పాలన్నారు. ఈ ప్రశ్నలకు మీరేమంటారని ప్రశ్నించారు....

1. ఉద్యోగులకు ఆప్షన్లు ఉండొద్దని కెసిఆర్ చెప్పారు. తెలంగాణ వచ్చాక కూడా ఆంధ్ర ఉద్యోగులను కొనమసాగించడంపై మీ వైఖరేంటి? 2. డిజైన్ మార్చకుండా పోలవరం ప్రాజెక్టును నిర్మించటాన్ని అంగీకరించబోం. ప్రాజెక్టుపై మీ వైఖరేంటి? 3. సచివాలయంలోని సీమాంధ్ర ఉద్యోగులు తెలంగాణ రాష్ట్రం ఏర్పాడ్డాక హైదరాబాద్‌లో ఉండొచ్చు. వారు ఆంధ్రప్రదేశ్ సచివాలయంలోనే పని చేయాలి. మీరు దేనిని సమర్థిస్తారు?

4. భద్రాచలంలోని ఏడు మండలాలను సీమాంధ్రలో కలపటాన్ని వ్యతిరేకిస్తున్నాం. రేపు మేం అధికారంలోకి వచ్చాక ఆ మండలాలు తెలంగాణ రాష్ట్రంలోనే ఉండేలా చర్యలు తీసుకుంటాం. ఏడు మండలాలను సీమాంధ్రలో కలపడాన్ని మీరు సమర్థిస్తారా? 5. పింఛన్ల చెల్లింపు, ఉద్యోగుల విభజన స్థానికత ఆధారంగానే జరగాలి. దీనిపై మీ వైఖరేంటి? 6. తెలంగాణకు ప్రత్యేక హోదా కల్పించకపోవటాన్ని వ్యతిరేకిస్తున్నాం. ఆ హోదాను సాధిస్తాం. ప్రత్యేక హోదా కోసం మీరు పోరాటం చేస్తారా?

7. ఉన్నత విద్యా సంస్థల్లో ఉమ్మడి ప్రవేశాలు వద్దు. ఏ రాష్ట్రంలోని విద్యార్థులు అక్కడే ప్రవేశాలు పొందాలి. దీనికి మీరేమంటారు? 8. సమైక్య రాష్ట్రాన్ని 41 ఏళ్లు కాంగ్రెస్ పాలించింది. ఈ సమయంలోనే తెలంగాణ వెనకబడింది. గడిచిన పదేళ్లు కూడా మీదే పాలన. అది గొప్పగా ఉందని.. మాకే ఓటేయాలంటూ ఎన్నికల్లో రెఫరెండమ్ కోరే దమ్ము, ధైర్యం ఉన్నాయా? 9. తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న వారినే గెలిపించాలనే నినాదంతో ఎన్నికలకు వెళ్లగలరా? 10. 13 ఏళ్లుగా తెలంగాణ కోసం పోరాడిన కెసిఆర్ నాయకత్వాన్ని సమర్థించవద్దని, మంత్రులుగా మీ పనితీరు చూసి ఓటేయాలని అడగగలరా?

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+