లక్కీ నెంబర్: కెసిఆర్ కాన్వాయ్‌కి నాలుగు ఆరులు
హైదరాబాద్: భారతదేశం 29వ రాష్ట్రం తెలంగాణకు కాబోయే ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావుకు ఆదివారం కాన్వాయ్‌ని ఏర్పాటు చేశారు. ఈ కాన్వాయ్‌లో టయోటా ప్రాడో, నాలుగు టయోటా ఫార్చ్యూన్లు ఉన్నాయి. వాటి నెంబర్ ఎపి 09 కె 6666.
ఆరు కెసిఆర్ లక్కీ నెంబర్ కావడంతో వాటికి నాలుగు ఆరు ఉన్న రిజిస్టేషన్ నెంబర్‌ను కేటాయించారు. గవర్నర్ నరసింహన్‌ను కలవడానికి కెసిఆర్ ఆదివారంనాడు ఆ కాన్వాయ్‌లోనే వెళ్లారు. హైదరాబాదులోని బంజారాహిల్స్ నందినగర్‌లో గల ఇంటి నుంచి ఆయన ఆ కాన్వాయ్‌లో వెళ్లారు.

టయోటా ప్రాడో ధర దాదాపు రూ.1.5 కోట్లు ఉంటుంది. దానికి బుల్లెట్ ప్రూఫ్ అమర్చడానికి మరో 50 లక్షల రూపాయలు వ్యయం చేశారు.
ఆదివారంనాడు గవర్నర్ నరసింహన్‌ను కలిసిన కెసిఆర్ సోమవారంనాడు మరోసారి కలిశారు. ఆయన వరుసగా గవర్నర్‌తో భేటీ కావడం ఆసక్తికరంగా మారింది.












Click it and Unblock the Notifications