పవన్ టీ వ్యతిరేకి: రామలింగారెడ్డి, జగ్గారెడ్డిపైనా ఫైర్

మెదక్: జనసేన అధినేత, తెలుగు సినీ హీరో పవన్ కళ్యాణ్ తెలంగాణ వ్యతిరేకి అని తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) శాసనసభ్యుడు రామలింగారెడ్డి అన్నారు. మెదక్ లోకసభ స్థానంలో బిజెపి అభ్యర్థి జగ్గారెడ్డికి పవన్ కళ్యాణ్ మద్దతు ఇస్తారని ప్రచారం సాగుతున్న నేపథ్యంలో ఆయన ఈ వ్యాఖ్య చేశారు. బిజెపి అభ్యర్థి జగ్గారెడ్డిపైనా ఆయన విరుచుకుపడ్డారు.

తెలంగాణ వస్తే ముక్కు నేలకు రాస్తానని చెప్పిన జగ్గారెడ్డి ఏ మొహం పెట్టుకుని పోటీ చేస్తాడని ఆయన అడిగారు. జగ్గారెడ్డి మొదటి నుంచి తెలంగాణ ద్రోహి అని, దళిత వ్యతిరేకి అని ఆయన బుధవారం మీడియా ప్రతినిధులతో అన్నారు. దళితులు, మహిళా సంఘాలకు చెందిన వేల కోట్ల విలువ చేసే భూములను జగ్గారెడ్డి కబ్జా చేశాడని ఆయన ఆరోపించారు.

TRS MLA Ramalinga Reddy lashes out at Pawan Kalyan

తెలంగాణను అడ్డుకునేందుకు జగ్గారెడ్డి తీవ్రంగా ప్రయత్నాలు చేశారని ఆయన అన్నారు. తెలంగాణవాదులపై దాడులు చేసిన జగ్గారెడ్డికి బిజెపి టీకెట్ ఇవ్వడం సిగ్గు చేటు అని ఆయన అన్నారు. కాంగ్రెసు, బిజెపిలకు పోటీలో నిలబెట్టేందుకు సరైన అభ్యర్థులే కరువయ్యారని ఆయన అన్నారు.

మెదక్ లోకసభ ఉప ఎన్నిక తెలంగాణవాదులకు, తెలంగాణవ్యతిరేకులకు మధ్య జరుగుతున్న పోరాటమని తెలంగాణ మంత్రి హరీష్ రావు అన్నారు. మెదక్‌లో తమ తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అభ్యర్థి కొత్త ప్రభాకర్ రెడ్డి విజయం ముమ్మాటికీ ఖాయమని ఆయన అన్నారు. ద్వితీయ, తృతీయ స్థానాల్లో ఎవరుంటారో తేల్చుకోవాలని ఆయన అన్నారు. ఎన్నికల మ్యానిఫెస్టోలో చెప్పిన ప్రతి అంశాన్ని తమ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు అమలు చేస్తున్నట్లు ఆయన తెలిపారు.

బిజెపి నుంచి పోటీ చేసేందుకు ఏ ఒక్కరూ కూడా ముందుకు రాలేదని, ఏం చూసి బిజెపికి ఓటేయాలని ఆయన అన్నారు. రిజర్వ్ బ్యాంక్ అంగీకరించకపోయినా రైతు రుణాలను మాఫీ చేస్తానని కెసిఆర్ చెప్పినట్లు ఆయన గుర్తు చేశారు. తనకు మెదక్ లోకసభ టికెట్ ఇచ్చినందుకు కొత్త ప్రభాకర్ రెడ్డి కెసిఆర్‌కు ధన్యవాదాలు తెలిపారు. ప్రజలు తెరాస వైపే మొగ్గు చూపుతున్నారని ఆయన అన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+