సుష్మ మద్దతు నిజమే కానీ, తెరాసది జీరో: టిపై జైరాం

హైదరాబాద్: తెలంగాణ బిల్లుకు లోకసభలో భారతీయ జనతా పార్టీ తరఫున సుష్మా స్వరాజ్ మద్దతిచ్చారని, ఇది నిజమని కానీ, రాజ్యసభలో అరుణ్ జైట్లీ, వెంకయ్య నాయుడు వంటి నేతలు మాత్రం అడ్డుకునే ప్రయత్నం చేశారని కేంద్రమంత్రి జైరామ్ రమేష్ సోమవారం అన్నారు.

తెలంగాణ ఇచ్చింది కాంగ్రెసు పార్టీయే అన్నారు. తెలంగాణ క్రెడిట్ కాంగ్రెసు పార్టీకే దక్కుతుందన్నారు. తెలంగాణ బిల్లు రూపకల్పనలో తెలంగాణ రాష్ట్ర సమితి పాత్ర జీరో అని జైరాం చెప్పారు. తెలంగాణలో కాంగ్రెసు పార్టీయే అధికారంలోకి వస్తుందని ఆయన చెప్పారు.

TRS role zero in Telangana: Jairam

కాంగ్రెసు పార్టీతోనే సుస్థిర ప్రభుత్వం సాధ్యమన్నారు. సుస్థిర ప్రభుత్వం, సామాజిక న్యాయం, మత సామరస్యం కాంగ్రెసు పార్టీ వల్లే సాధ్యమన్నారు. సామాజిక న్యాయం అంటే దొరల రాజ్యం కాదని తెరాసను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. తెరాస ఒంటరిగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేదన్నారు. కాంగ్రెసుదే గెలుపు అన్నారు.

సుష్మ తెలంగాణ బిల్లును సపోర్ట్ చేశారని, ఇది నిజమని కానీ, అద్వానీ, జైట్లీ, వెంకయ్య నాయుడులు సుముఖంగా లేరన్నారు. రాజ్యసభలో అడ్డుకునే ప్రయత్నాలు చేశారన్నారు. తెరాస రోల్ మాత్రం జీరో అన్నారు. లోకసభ, రాజ్యసభ ద్వారా తెలంగాణ వచ్చిందని, కాబట్టి క్రెడిట్ కాంగ్రెసుదే అన్నారు. తెరాస దొరల రాష్ట్ర సమితి పార్టీ అని ఎద్దేవా చేశారు. దొరల తెలంగాణ కావాలనుకునే వారు తెరాసకు ఓటేస్తారన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+