మాకివి ఇవ్వాలి: నివేదికలో జివోఎంకు తెరాస డిమాండ్

Etela Rajender
హైదరాబాద్: విభజనపై తెలంగాణ రాష్ట్ర సమితి మంత్రుల బృందానికి(జివోఎం)కు ఆదివారం నివేదికను ఫ్యాక్స్ చేసింది. అందులో పలు అంశాలను పేర్కొంది. హైదరాబాదు శాంతిభద్రతలు తెలంగాణ ప్రాంతానికే ఇవ్వాలని, సింగరేణిని తెలంగాణకు కేటాయించాలని, ఎపి భవన్ తెలంగాణదేనని పేర్కొన్నారు.

మంజూరైన రైల్వే లైన్లను పూర్తి చేయాలని, 1956కు ముందున్న స్థిర, చరాస్థులను తెలంగాణకే ఇవ్వాలని కోరారు. సమైక్య రాష్ట్రంలో తెలంగాణ ప్రాంతమే నష్టపోయిందని కాబట్టి తమ ప్రాంతానికి 4.5 లక్షల కోట్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు. 371 డిని కొనసాగించాలని సూచించారు.

రావాల్సినవే డిమాండ్ చేశాం: ఈటెల

చట్ట ప్రకారం తెలంగాణ ప్రాంతానికి రావాల్సిన వాటినే తాము డిమాండ్ చేశామని తెరాస ఎల్పీ ఈటెల రాజేందర్ అన్నారు. తెరాస తరఫున సమగ్ర నివేదిక ఇచ్చామన్నారు. అరవై ఏళఅలుగా తెలంగాణ ప్రాంతం దోపిడీకి గురైందన్నారు. కాబట్టి తమ ప్రాంతానికే నష్టపరిహారం ఇవ్వాలన్నారు.

వచ్చే పార్లమెంటు శీతాకాల సమావేశాల్లోనే తెలంగాణ బిల్లును పెట్టాలని డిమాండ్ చేశారు. నీళ్లు, నిధులు దోపిడీ ద్వారా తెలంగాణకు రూ.4.1 లక్షల కోట్ల నష్టం వాటిల్లిందన్నారు. అందుకే తాము 4.5 లక్షల కోట్లను ప్రత్యేక ప్యాకేజీగా డిమాండ్ చేశామన్నారు.

రేపు టి మంత్రులతో బొత్స భేటీ

తెలంగాణ ప్రాంత మంత్రులు, నేతలతో పిసిసి చీఫ్ బొత్స సత్యనారాయణ సోమవారం ఉదయం పదకొండు గంటలకు భేటీ కానున్నారు. రాష్ట్ర విభజన అంశం, జివోఎంపై వారు చర్చించనున్నారు. మరోవైపు సీమాంధ్ర నేతలతో సాయంత్రం నాలుగున్నర గంటలకు ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డితో భేటీ కానున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+