టిలో 3 జెడ్పీలు తెరాస వశం, కాంగ్రెస్, టిడిపిలకి ఒక్కోటి
హైదరాబాద్: సీమాంధ్రలో తెలుగుదేశం, తెలంగాణలో తెలంగాణ రాష్ట్ర సమితి ఎక్కువ జెడ్పీలను కైవసం చేసుకుంది. వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాలుగు, తెలంగాణలో కాంగ్రెసు పార్టీ ఒక్క జెడ్పీని గెలుచుకుంది. అనూహ్యంగా ఖమ్మం జెడ్పీని తెలుగుదేశం పార్టీ కైవసం చేసుకుంది.
తెలంగాణలో తెలంగాణ రాష్ట్ర సమితి 3 (అదిలాబాద్, కరీంనగర్, నిజామాబాద్), కాంగ్రెసు పార్టీ 1 (నల్గొండ), తెలుగుదేశం పార్టీ 1 (ఖమ్మం) జెడ్పీని కైవసం చేసుకున్నాయి. నాలుగు జిల్లాల్లో ఎవరికీ మెజార్టీ రాలేదు. అయితే కొన్నింట కాంగ్రెసు, మరికొన్నింట తెరాస ఆధిక్యంలో ఉంది.
అదిలాబాద్(52)లో తెరాస 39, కాంగ్రెస్ 9, టిడిపి 2, కరీంనగర్(57)లో తెరాస 41, కాంగ్రెస్ 14, టిడిపి 1, బిజెపి 1, నిజామాబాద్(36)లో తెరాస 24, కాంగ్రెస్ 12, ఖమ్మం(46) టిడిపి 22, కాంగ్రెస్ 10, వైయస్సార్ కాంగ్రెస్ 6, నల్గొండ(59)లో కాంగ్రెస్ 43, తెరాస 13, టిడిపి 2 జెడ్పీటీసీలను కైవసం చేసుకున్నాయి.

మెదక్, మహబూబ్ నగర్, రంగారెడ్డి, వరంగల్ జిల్లాల్లో ఎవరికీ మెజార్టీ రాలేదు. అయితే వరంగల్(50)లో కాంగ్రెస్ 24, తెరాస 18, టిడిపి 6, మెదక్(46)లో కాంగ్రెస్ 21, తెరాస 21, టిడిపి 4, రంగారెడ్డి(33)లో కాంగ్రెస్ 15, తెరాస 12, టిడిపి 6, మహబూబ్ నగర్(64)లో కాంగ్రెస్ 29, తెరాస 23, టిడిపి 9 జెడ్పీటీసీలను కైవసం చేసుకుంది.
ఇప్పటి వరకు తెలంగాణలో కాంగ్రెసు 2311 ఎంపీటీసీలు, 177 జెడ్పీటీసీలను, తెరాస 1884 ఎంపీటీసీలను, 191 జెడ్పీటీసీలను, టిడిపి 1040 ఎంపీటీసీలను, 52 జెడ్పీటీసీలను గెలుచుకుంది. సీమాంధ్రలో టిడిపి 5017 ఎంపీటీసీలను, 362 జెడ్పీటీసీలను, వైయస్సార్ కాంగ్రెసు 3977 ఎంపీటీసీలను, 254 జెడ్పీటీసీలను గెలుచుకుంది.
-
కటౌట్ కు తగ్గ పర్ఫెక్ట్ ఫిల్మ్- టైటిల్ గూస్ బంప్స్: విజువల్ వండర్ -
అన్నా - చెల్లి కాస్తా.. భార్యాభర్తలు అయ్యారుగా ??? -
ఏపీలో ఇంటర్ ఫలితాల విడుదలపై బోర్డు తాజా నిర్ణయం, మార్కుల్లో ఈ సారి కొత్తగా..!! -
IPL 2026: కొంపముంచిన బుడ్డోడు.. రాజస్థాన్‌ను చిత్తు చేసిన SRH! -
రాజ్యసభకు టీడీపీ, బీజేపీ నుంచి ఊహించని అభ్యర్దులు- జనసేన నుంచి ఆయనే..!! -
అండగా నిలిచిన భారత్ కు థ్యాంక్స్: ఇరాన్ సంచలన ప్రకటన -
మూడేళ్లకోసారి వచ్చినా.. పెట్టిన 150 రూపాయలకు న్యాయం చేస్తావ్ అన్నా.. -
ఒంటి పూట బడుల వేళల్లో మార్పు, ఇక నుంచి..!? -
నిర్మాతలకు స్టార్ హీరోయిన్ బంపరాఫర్! -
10th Class Results అప్పుడే..! పది ఫలితాలపై కీలక ప్రకటన -
West Bengal Survey: బీజేపీ అంతర్గత సర్వేలో షాకింగ్- ఎన్ని సీట్లో తెలుసా ? -
రేషన్ సరఫరా లో కీలక మార్పులు, తాజా మార్గదర్శకాలు..!!












Click it and Unblock the Notifications