ట్యాపింగ్‌తో ప్రభుత్వాలే కూలాయి, బాబును అంటే ఊరుకోం: యనమల

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వ్యక్తిత్వ హననానికి పాల్పడిందని, ట్యాపింగ్‌తో ప్రభుత్వాలే కూలాయని ఏపీ ఆర్థిక శాఖ మంత్రి యనమల రామకృష్ణుడు మంగళవారం అన్నారు. ఏపీ కేబినెట్ సమావేశం సుమారు ఐదు గంటల పాటు సాగింది. అనంతరం చంద్రబాబు ఢిల్లీకి పయనమయ్యారు.

అనంతరం యనమల కేబినెట్ విశేషాలను మీడియాకు వివరించారు. ట్యాపింగ్‌కు పాల్పడ్డ అధికారులను వదలవద్దని కేబినెట్ నిర్ణయించిందని చెప్పారు. సెక్షన్ 8 కచ్చితంగా అమలు చేయాలని తాము కేంద్రాన్ని కోరుతామని చెప్పారు. ఫోన్ ట్యాపింగ్ పైన తెలంగాణ సర్కారుపై చర్యలు తీసుకోవాలని నిర్ణయించామన్నారు.

చట్టపరమైన చర్యలు తీసుకుంటామని చెప్పారు. ట్యాపింగ్ వ్యవహారంపై గవర్నర్ చర్యలు తీసుకోవాలని కోరుతున్నామన్నారు. ఈ అంశంపై ముఖ్యమంత్రి చంద్రబాబు రేపు ప్రధాని మోడీ, కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్‌కు చెబుతారన్నారు.

Trying to dent Chandrababu image, We don't tolerate: Yanamala

సెక్షన్ 8తో పాటు మరిన్ని అంశాల పైన కేబినెట్లో చర్చించామన్నారు. ఫోన్ ట్యాపింగ్‌తో గతంలో ప్రభుత్వాలే కూలాయని చెప్పారు. దీనిపై తాము న్యాయపరమైన పోరాటం చేస్తామని చెప్పారు. సెక్షన్ 8 పైన రేపు కేంద్రానికి అభిప్రాయాలు చెబుతామన్నారు.

విభజన చట్టంలో అమలు కావాల్సిన మరికొన్ని అంశాలపై కేంద్రంతో మాట్లాడుతామని చెప్పారు. సెక్షన్ 8 కచ్చితంగా అమలు చేయాలని కోరుతామన్నారు. రాష్ట్రానికి నష్టం జరిగే అంశాలను సవరణ చేయాలన్నారు. ఫోన్ ట్యాపింగ్ వ్యక్తిగత స్వేచ్ఛకు భంగం కలిగించేదన్నారు.

ఇది రాజ్యాంగ విరుద్ధమైన చర్య అని చెప్పారు. వ్యక్తిగత స్వేచ్ఛకు సంబంధించన అంశమని చెప్పారు. రాజ్యాంగానికి వ్యతిరేకంగా ఫోన్ ట్యాపింగ్ చేశారన్నారు. కావాలనే పీసీ యాక్టు కింద కేసు పెట్టారన్నారు. కావాలని చంద్రబాబు ప్రతిష్ట దెబ్బతీయాలనుకుంటే చూస్తూ ఊరుకోమన్నారు.

ఫోన్ ట్యాపింగ్ పైన గవర్నర్‌‍కు చెబుతూనే కేంద్రానికి నివేదిస్తామని చెప్పారు. చంద్రబాబు టేపులు అంటూ ఆడియో టేప్ విడుదల చేసింది వారేనని, ఆ తర్వాత తాము ట్యాప్ చేయలేదని కూడా వారే చెబుతున్నారని, వారు ట్యాప్ చేశారని చెబుతున్నందునే తాము చర్యలను కోరుతున్నామన్నారు.

ప్రభుత్వం, ఏసీబీ కలిసి...

ఆ వీడియోలు ఎవరు విడుదల చేశారో తెలియాలన్నారు. తొలుత ఏ చానళ్లో వచ్చిందో అందరికీ తెలుసన్నారు. ఆ ఛానల్ ఎవరిదో కూడా తెలుసన్నారు. దీనిని బట్టి ప్రభుత్వం తీరు అర్థమవుతోందన్నారు. ఇరు రాష్ట్రాలను గవర్నర్ సమానంగా చూడాలన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+