పవన్‌పై అనుమానం, చిరును ఎదుర్కోలేరు: టిఎస్సార్

పవన్ కళ్యాణ్‌కు ఏమాత్రం రాజకీయ అనుభవం లేదన్నారు. త్వరలో జరగనున్న సార్వత్రిక ఎన్నికలలో ఆ పార్టీ ప్రభావం ఏమాత్రం ఉండదని స్పష్టం చేశారు. రాష్ట్ర విభజనకు బిజెపి మద్దతిచ్చిందని, అలాంటి పార్టీకి పవన్ ఎలా మద్దతు ప్రకటిస్తారన్నారు. ఇది అనుమానాలకు తావిస్తోందన్నారు.
ఏనాడు కనీసం సభలు, సమాజ సేవా కార్యక్రమాలకు హాజరు కాని పవన్ పార్టీ పెట్టడం ఆశ్చర్యంగా, విడ్డూరంగా ఉందన్నారు. కాంగ్రెసు పార్టీలో చిరంజీవి ఓ ఫోర్స్ అన్నారు. ఆయనను ఎదుర్కొనే సత్తా ఎవరికీ లేదన్నారు.
బాపట్లకే: మోదుగుల
రానున్న సార్వత్రిక ఎన్నికలలో తాను బాపట్ల నియోజకవర్గం నుండి పోటీ చేస్తానని తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత మోదుగుల వేణుగోపాల్ రెడ్డి ప్రకటించారు. మోదుగుల గత ఎన్నికల్లో నర్సారావు పేట నుండి ఎంపీగా గెలుపొందారు.
ఆ స్థానంలో ఇప్పుడు వైయస్సార్ కాంగ్రెసు పార్టీ తరఫున మోదుగుల బావ పోటీ చేయనున్నారు. దీంతో మోదుగుల మొదట బావ పైన పోటీ చేసేందుకు నిరాకరించారు. ఇటీవల మళ్లీ బావ అయినా ఫర్వాలేదు పోటీ చేస్తాననడంతో గందరగోళం ఏర్పడింది. ఇప్పుడు బాపట్ల నుండి మోదుగుల సై అనడంతో సమస్య సద్దుమణిగింది.












Click it and Unblock the Notifications