శ్రీవారి సేవకుల పై టీటీడీ కీలక నిర్ణయం, ఇక వారికీ అవకాశం..!!

TTD: తిరుమలలో రద్దీ కొనసాగుతోంది. టోకేన్ లేని భక్తుల సర్వదర్శనానికి 18 గంటల సమయం పడుతోంది. శిలా తోరణం వరకు భక్తుల క్యూ లైన్లు కొనసాగుతున్నాయి. నిన్న శ్రీవారిని దర్శించుకున్న 80,350 మంది భక్తులు.. నిన్న తలనీలాలు సమర్పించిన 36,597 మంది భక్తులు.. నిన్న శ్రీవారి హుండీ ఆదాయం రూ.3.27 కోట్లు ఆదాయం వచ్చింది. కాగా.. శ్రీవారి సేవల విషయంలో టీటీడీ కీలక నిర్ణయాలు తీసుకుంటోంది.

వేసవిలో తిరుమలలో రద్దీ పెరుగుతోంది. పెరుగుతున్న రద్దీకి అనుగుణంగా టీటీడీ చర్యలు తీసు కొంటోంది. వీఐపీ బ్రేక్ దర్శనాల సిఫారసు లేఖలు నిలిపివేయాలని డిసైడ్ అయింది. శ్రీవారి సేవ కార్యకలాపాలపై టీటీడీ అదనపు ఈవో సమీక్ష చేసారు శ్రీవారి సేవకులకు సేవల కేటాయింపు, భక్తులకు సేవలు అందించే విధానంపై ముందస్తు శిక్షణ, సంబంధిత‌ విభాగాల సిబ్బంది సేవకులతో నడుచుకోవాల్సిన విధానం, సేవకుల నుండి ఫిర్యాదులు అందితే తక్షణ పరిష్కారం వంటి అంశాలపై సమావేశంలో సమీక్షించారు. శ్రీ‌వారి సేవ‌కుల నుండి అత్యుత్తమ సేవ‌ల‌ను భ‌క్తుల‌కు అందించ‌డంలో భాగంగా సేవ అనంత‌రం సంబంధిత సేవ‌కుల అభిప్రాయాల‌ను, అనుభ‌వాల‌ను ప‌రిగ‌ణ‌లోకి తీసుకుని ఏమైనా స‌మ‌స్య‌లు ఉంటే అక్క‌డిక‌క్క‌డే ప‌రిష్క‌రించేలా చ‌ర్య‌లు చేప‌ట్టాల‌ని ఆదేశించారు. సేవకుల పనితీరును సమర్థత ఆధారంగా రేటింగ్ చేసే విధానం పార‌ద‌ర్శ‌కంగా అమలు చేయనున్నారు.

గన్నవరం విమానాశ్రయంలోనూ శ్రీవారి దర్శన టికెట్ల జారీ, టీటీడీ కీలక నిర్ణయం..!!
గన్నవరం విమానాశ్రయంలోనూ శ్రీవారి దర్శన టికెట్ల జారీ, టీటీడీ కీలక నిర్ణయం..!!
ttd-aeo-venkaiah-chowdary-instructions-issued-to-utilization-of-retired-senior-officers-for-srivari

శ్రీవారి సేవ పర్యవేక్షులుగా రిటైర్ద్ అధికారులు

సేవకుల ఫిర్యాదుల పరిష్కారం కోసం కేంద్రీకృత గ్రీవెన్స్ సెల్ ఏర్పాటు చేసి ప్రత్యేక ఫిర్యాదు నంబర్ ద్వారా తక్షణ పరిష్కార వ్యవస్థ తీసుకురావాలని నిర్ణ‌యించారు. సంబంధిత‌ విభాగాలు సేవకులకు బాధ్యతలపై స్పష్టత ఇవ్వాలని, శ్రీ‌వారి సేవ‌కుల సేవలను సమర్థవంతంగా వినియోగించుకోవాలని సూచించారు. సత్సంగ కార్యక్రమాల్లో ప్రముఖ సంగీత విద్వాంసులు, ఆధ్యాత్మిక వక్తలను ఆహ్వానించి సేవాభావం, క్రమశిక్షణ పెంపొందించేలా శిక్షణ ఇచ్చేందుకు చర్య‌లు చేపట్టాలని నిర్దేశించారు. తిరుమలలో రద్దీ ప్రాంతాల్లో ఆచరణ నియమాలు, నైతిక, ఆధ్యాత్మిక విలువలను తెలియజేసే సూచిక బోర్డులు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. భక్తులు, సేవకులు, ఉద్యోగుల మానసిక ప్రశాంతత కోసం హీలింగ్ సెంటర్ ఏర్పాటుకు చ‌ర్య‌లు తీసుకోవాలని నిర్దేశించారు. రిటైర్డ్ సీనియర్ అధికారులను శ్రీవారి సేవ పర్యవేక్షకులుగా వినియోగించే అంశంపై తగు చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులకు సూచన చేసారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+