నడక మార్గంలో తిరుమల చేరే భక్తులకు TTD బిగ్ అప్డేట్ - కొత్త టైమింగ్స్..!!

తిరుమలలో బ్రహ్మోత్సవాలకు సర్వం సిద్దం అవుతోంది. బ్రహ్మోత్సవాలు- సెలవులు కావటం తో పెద్ద సంఖ్యలో భక్తులు తరలి వస్తారని అంచనా వేస్తున్నారు. రద్దీకి అనుగుణంగా టీటీడీ చర్య లు చేపడుతోంది. ఇదే సమయంలో తిరుమలకు కాలిబాటన చేరే భక్తులకు భద్రతపై టిటిడి అటవీశాఖ ప్రత్యేక దృష్టి పెట్టింది. గాలిగోపురం నుంచి లక్ష్మీనరసింహస్వామి ఆలయం వరకు చిరుతల సంచారం అధికంగా ఉన్నట్లు గుర్తించిన అధికారులు భక్తులకు కీలక సూచనలు చేస్తూ నే.. నడక మార్గంలో అనుమతుల పైన కొత్త వేళలు ప్రకటించారు.

తిరుమల భక్తుల కోసం TTD కొత్త యాప్ - సకల సమాచారం..!!
తిరుమల భక్తుల కోసం TTD కొత్త యాప్ - సకల సమాచారం..!!

అలిపిరి మార్గంలో అధిక సంఖ్యలో చిరుతలు సంచరిస్తున్నాయి. గాలిగోపురం (ఏడోమైలు) నుంచి శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయం వరకు చిరుతల సంచారం ఎక్కువగా ఉన్నట్లు అధికారులు గుర్తించారు. దీంతో, భక్తులకు ఎలాంటి ముప్పు వాటిల్లకుండా రక్షణ చర్యలు చేపట్టారు. ముందు జాగ్రత్తగా నడకదారికి ఎడమవైపున 25 మీటర్ల మేర పొదలు, గడ్డి ఇతర వ్యర్థాలను తొలగించారు. భద్రతా కారణాల దృష్ట్యా పదేళ్లలోపు చిన్నపిల్లలను మధ్యాహ్నం 3 గంటల వరకే నడక మార్గంలో అనుమతిస్తున్నారు. పిల్లలను ఎట్టి పరిస్థితుల్లోనూ ఒంటరిగా వదలొద్దని తల్లిదండ్రులకు మైకుల ద్వారా అవగాహన కల్పిస్తున్నారు. పగటిపూట సైతం భక్తులను గుంపులుగా కొండపైకి పంపుతున్నారు.

తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్లే భక్తులకు బిగ్ అలర్ట్, అనూహ్య రద్దీ వేళ..!!
తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్లే భక్తులకు బిగ్ అలర్ట్, అనూహ్య రద్దీ వేళ..!!
TTD Alert for Alipiri Footpath Pilgrims as Leopard Movement Raises Concern here the details

అదే విధంగా భక్తులకు రక్షణగా టీటీడీ, అటవీశాఖ భద్రతా సిబ్బంది ఉంటున్నారు. సాధారణంగా రాత్రి 9 గంటల తర్వాత నడకదారిలో భక్తులను అనుమతించరు. చిరుతల సంచారం దృష్ట్యా సాయంత్రం ఆరు గంటలకల్లా నడక మార్గాన్ని మూసివేయాలని అటవీశాఖ టీటీడీకి ప్రతిపాదనలు పంపింది. శ్రీవారి దర్శనానికి రోజూ వేలమంది భక్తులు వస్తుంటారు. వ్యూ లైన్స్ రెండు కిలోమీటర్ల పొడవునా క్లియర్ చేశారు. వన్యప్రాణుల కదలికను గుర్తించేందుకు రంగంలోకి రోబో డాగ్ లను సిద్ధం చేశారు. పదేళ్లు లోపు పిల్లలకు మధ్యాహ్నం మూడు గంటల లోపే నడక మార్గంలో అనుమతి ఇచ్చారు. గతంలో చోటు చేసుకున్న ఘటనలతో టీటీడీ అప్రమత్తం అయింది. ఎలాంటి సమస్య లేకుండా ముందస్తు చర్యల్లో భాగంగా ఈ నిర్ణయాలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+