తిరుమలకు ఆ వాహనాలకు ఇక నో ఎంట్రీ, TTD కీలక నిర్ణయం..!!
తిరుమలలో రద్దీ పెరిగింది. వరుస సెలవుల వేళ భక్తులు పెద్ద సంఖ్యలో తిరుమలకు తరలి వస్తున్నారు. పెరుగుతున్న భక్తుల రద్దీకి అనుగుణంగా టీటీడీ చర్యలు చేపట్టింది. రేపు (ఆదివారం) వీఐపీ బ్రేక్ దర్శనాలను టీటీడీ రద్దు చేసింది. టోకెన్లు సైతం జారీ ప్రారంభించిన వెంటనే పూర్తవుతున్నాయి. ఇక.. తిరుమల కు వచ్చే భక్తులకు టీటీడీ కీలక అప్డేట్ ఇచ్చింది. యాప్‌ల ద్వారా బుక్ చేసుకునే బైక్ రైడ్స్‌ను తిరుమలకు అనుమతించకూడదని నిర్ణయించింది.
తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి దర్శనానికి వెళ్లే భక్తులకు అలర్ట్. భక్తుల భద్రతను దృష్టిలో ఉంచుకుని తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై రాపిడో, ఓలా, ఉబర్ వంటి యాప్‌ల ద్వారా బుక్ చేసుకునే బైక్ రైడ్స్‌ను తిరుమలకు అనుమతించకూడ దని నిర్ణయించింది. ఈ మేరకు అలిపిరి తనిఖీ కేంద్రం వద్ద బైక్ రైడ్స్‌కు అనుమతి లేదంటూ పోస్టర్లు ఏర్పాటు చేసింది.

గత నెల 26వ తేదీన హైదరాబాద్‌కు చెందిన సునీల్ శ్రీవారి దర్శనం ముగించుకుని తిరుపతి ఎయిర్‌పోర్టుకు రాపిడో బైక్‌ను బుక్ చేసుకున్నారు. ఎయిర్‌పోర్టుకు వెళ్లే క్రమంలో తిరుమల మొదటిఘాట్‌రోడ్డులోని 26వ మలుపు వద్ద వేగంగా క్యాష్‌బారియన్‌ను ఢీకొనడంతో రాపిడో బైకర్ అక్కడికక్కడే మృతి చెందగా, సునీల్ తీవ్రంగా గాయపడ్డారు. ఈ విషయాన్ని టీటీడీ తీవ్రంగా పరిగణించింది.
దీంతో.. తిరుమల, ఘాట్‌రోడ్లలో రాపిడో, ఉబర్, ఓలా బైక్ రైడ్‌లను నిషేధించాలని నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగానే అలిపిరి తనిఖీ కేంద్రంలో 'నాట్ ఎలౌడ్' అనే పోస్టర్లను ఏర్పాటు చేశారు. 'తిరుమల ఘాట్ రోడ్లలో కేవలం వ్యక్తిగత ద్విచక్రవాహనాలకు మాత్రమే ప్రయాణించే అవకాశం ఉంది. రాపిడో, ఓలా, ఉబర్ తదితర యాప్‌ల ద్వారా బుక్ చేసుకున్న ద్విచక్రవాహనాలు తిరుమలకు అనుమతించబడవు' అంటూ పేర్కొంది.
అలాగే ఈ యాప్‌ల ద్వారా వచ్చే ద్విచక్రవాహనాలపై ప్రత్యేక నిఘా ఉంచాలని తనిఖీ సిబ్బందికి ఆదేశాలు జారీ చేశారు. ఇక, ఇలాంటి యాప్‌లలో తిరుమలకు రైడ్ ఆప్షన్ కనిపించకుండా ఉండేలా సంబంధిత సంస్థలను సంప్రదించేలా టీటీడీ ఆలోచన చేస్తోంది. కాగా.. కొండపైకి వెళ్లాలని భావించే భక్తులు ఎట్టి పరిస్థితుల్లోనూ యాప్ ఆధారిత బైక్ ట్యాక్సీలను బుక్ చేసుకోవద్దని టీటీడీ వర్గాలు వెల్లడించాయి. భక్తుల భద్రత కోసమే ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు స్పష్టం చేస్తున్నారు.














Click it and Unblock the Notifications
