తిరుమలకు ప్లాన్ చేసుకున్నారా, భక్తులకు TTD కీలక సూచన..!!

Tirumala: తిరుమలకు వచ్చే భక్తులకు టీటీడీ కీలక సూచన చేసింది. తిరుమలలో రద్దీ సాధారణంగా ఉంది. సంక్రాంతి సెలవులు ప్రారంభం కానుండటంతో భక్తుల రద్దీ క్రమేణా పెరిగే అవకాశం ఉందని టీటీడీ భావిస్తోంది. ఈ నెల 25న రథసప్తమి కారణంగా పలు సేవలు రద్దు చేసారు. ఇక.. శ్రీవారి మెట్టు మార్గంలో మరోసారి చిరుత కనిపించింది. భక్తులు ఆందోళన చెందకుండా టీటీడీ కీలక సూచనలు చేసింది. అదనపు సిబ్బందిని మొహరించింది.

తిరుమలలో రద్దీ సంక్రాంతి సెలవుల వేళ మరింత పెరిగే అవకాశం ఉందని టీటీడీ అంచనా వేస్తోంది. ఇక.. ఈ నెల 25న రథసప్తమి నిర్వహించనుంది. ఈ సమయంలో టీటీడీ పలు నిర్ణయాలు తీసుకుంది. అందులో భాగంగా కల్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకార సేవలను టిటిడి రద్దు చేసింది. ఎన్.ఆర్.ఐలు, చంటి బిడ్డల తల్లిదండ్రులు, సీనియర్ సిటిజన్లు, వికలాంగుల ప్రివిలేజ్ దర్శనాలను కూడా రద్దు చేసింది. తిరుపతిలో జ‌న‌వ‌రి 24 నుండి 26వ తేది వరకు స్లాటెడ్ సర్వదర్శనం టోకెన్లు జారీ రద్దు చేసింది. ప్రోటోకాల్ ప్రముఖులకు మినహా విఐపి బ్రేక్ దర్శనాలు రద్దు చేసిన టీటీడీ బ్రేక్ దర్శనాలకు సంబంధించి జ‌న‌వ‌రి 24న‌ ఎలాంటి సిఫార్సు లేఖలు స్వీకరించటం లేదని స్పష్టం చేసింది.

ttd-big-alert-for-pilgrims-amid-leopard-spotted-at-srivari-meetu-route

ఇక, శ్రీవారి మెట్టుమార్గంలో చిరుత పులి సంచారం కలకలం రేపింది. 400వ మెట్టు వద్ద చిరుత సంచారాన్ని భక్తులు గుర్తించారు. దీంతో అప్రమత్తమైన టీటీడీ సిబ్బంది చిరుతను గుర్తించే పని మొదలు పెట్టారు. ఒక మహిళ చిరుతను ప్రత్యక్షంగా చూసినట్లు తెలిపి వెంటనే టీటీడీ అధికారులకు సమాచారం ఇచ్చింది. సమాచారం అందుకున్న వెంటనే అటవీ శాఖ అధికారులు అక్కడకి చేరుకుని పాదముద్రలను పరిశీలించారు. పరిశీలన తర్వాత అక్కడ చిరుత సంచారం ఉన్నట్లు ధ్రువీకరించారు.

తిరుమల మార్గంలో భక్తులను 100 నుంచి 150 మంది చొప్పున గుంపులుగా మాత్రమే అనుమతిస్తున్నారు. భక్తులు చిన్నపిల్లలను జాగ్రత్తగా పట్టుకొని వెళ్లాలని, వెళ్లేటప్పుడు అప్రమత్తంగా ఉండాలని అధికారుల సూచించారు. సమూహాలుగా మాత్రమే వెళ్లాలని, ఒంటరిగా మెట్లు ఎక్కొద్దని సూచించారు. సిబ్బందితో సమన్వయం చేసుకుంటూ మెట్ల మార్గం ద్వారా తిరుమల చేరుకోవాలని తెలిపారు. చిరుతను గుర్తించి పట్టుకునేందుకు అటవీ అధికారులు ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+