TTD: అలిపిరిలోనే వసతి, శ్రీవారి సేవా విధానంలో ఇక - టీటీడీ బోర్డు నిర్ణయాలు..!!
Tirumala: టీటీడీ పాలక మండలి సమావేశంలో పలు కీలక నిర్ణయాలకు ఆమోదం తెలిపారు. శ్రీ వారి భక్తులకు సేవలను మరింతగా పటిష్ఠం చేయటం పైన చర్చించారు. భక్తులకు వసతి పెంపు తో పాటుగా సీఎం ఆదేశాల మేరకు శ్రీవారి సేవా విధానంలో మార్పుల దిశగా కసరత్తు చేస్తున్నారు. అలిపిరి వద్ద మౌలిక వసతులతో పాటుగా.. వసతి గురించి సమావేశంలో చర్చ జరిగింది. పెరుగు తున్న భక్తుల రద్దీకి అనుగుణంగా వైకుంఠం క్యూ కాంప్లెక్స్ -3 నిర్మాణం పై బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది.
టీటీడీ బోర్డు సమావేశంలో పలు కీలక అంశాల పైన చర్చ జరిగింది. పాలక మండలి సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను మీడియాకు టీటీడీ ఈవో శ్యామలరావు వెల్లడించారు. వైకుంఠం క్యూ కాం ప్లెక్స్ -3 నిర్మాణంపై చర్చించామని చెప్పారు. ఈ నిర్మాణం పైన కమిటీ ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ఆ కమిటీ నివేదిక మేరకు ఈ నిర్మాణంపై నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. అదే విధంగా.. సామాన్య భక్తులకు అదనంగా వసతి సదుపాయం అధ్యయనంపై చర్చించారు. అలిపిరి వద్ద మౌలిక సదుపాయాల కల్పనకు ఓ కమిటీని నియమించనున్నట్లు తెలిపారు. 600 మంది వేద పారాయణదారులకు నిరుద్యోగ భృతి ఇవ్వడానికి ఆమోదించారు.

శిలాతోరణం, చక్రతీర్ధం అభివృద్ధి చేయాలని నిర్ణయం తీసుకున్నామని ఈవో శ్యాలమ రావు పేర్కొ న్నారు. దేశవ్యాప్తంగా ఆలయాల నిర్మాణ అధ్యాయానానికి ఓ కమిటీ వేయనున్నట్లు వివరించారు. శ్రీవారి సేవను విశ్వవ్యాప్తం చేసే విధంగా కో ఆర్డినేటర్ల నియామకానికి ఆమోదం తెలిపారు. సైబర్ సెక్యూరిటీ ల్యాబ్ ఏర్పాటుకు ఆమోదించారు. కల్యాణకట్టల వద్ద పారిశుద్ధ్యం పెంపునకు, తిరుమ లలో పరిపాలన భవనాన్ని నిర్మించాలని నిర్ణయం తీసుకున్నారు. పాత భవనాలని తొలగించి వాటి స్థానంలో నూతన భవన నిర్మాణాాలకు ఆమోదించారు. ఒంటిమిట్ట ఆలయంలో త్వరలోనే అన్నదానం ప్రారంభించనున్నారు. రూ. 4.7 కోట్లతో అన్నదానం కోసం నూతన భవన నిర్మాణాని కి నిధులు కేటాయించాలని నిర్ణయం తీసుకున్నారు. శ్రీవాణి ట్రస్టు ద్వారా ఏపీలోని పలు దేవాలయాల వద్ద భజన మండలాల నిర్మాణానికి ఆమోదం తెలిపారు.
తిరుమలలో పరిపాలన సౌలభ్యం కోసం అన్ని విభాగాలు ఒకచోట కేంద్రీకృతమయ్యేలా నూతన పరిపాలన భవనం నిర్మాణానికి ఆమోదం. అదేవిధంగా తిరుమలలో పాత బడిన హెచ్వీడీసీలోని ఆరు బ్లాకులు, బాలాజీ విశ్రాంతి గృహం, ఆంప్రో గెస్ట్ హౌస్, అన్నపూర్ణ క్యాంటీన్, కళ్యాణి సత్రాలను ఐఐటీ నిపుణుల సూచన మేరకు తొలగించాలని నిర్ణయం తీసుకున్నారు. ఏపీ హైకోర్టు తీర్పు మేరకు టీటీడీలో కాంట్రాక్ట్ డ్రైవర్లుగా పని చేస్తున్న 142 మందిని క్రమబద్ధీకరించేందుకు ఆమోదిస్తూ ప్రభుత్వ ఆమోదానికి పంపాలని నిర్ణయించారు. వివిధ దేశాల్లో శ్రీవారి ఆలయాల నిర్మాణానికి నిపుణుల కమిటీ నివేదిక సమర్పించింది. దీనిపై టీటీడీ ఒక సబ్ కమిటీ ఏర్పాటు చేసి సదరు కమిటీ ఇచ్చే నివేదిక ప్రకారం తదుపరి చర్యలు తీసుకోవాలని నిర్ణయం తీసుకున్నారు.
-
లడ్డూ వ్యవహారం లో సుప్రీం తాజా ఆదేశాలు..!! -
అలిపిరి లగేజీ కౌంటర్ లో ఈఓ చేసిన తనిఖీల్లో.. !! -
భారీగా నిధులు విడుదల చేసిన టీటీడీ -
తిరుమల క్యూలైన్ లల్లో కఠిన నిబంధన -
తిరుమల వెళ్లే భక్తులకు గమనిక -
ముఖానికే కాదు అక్కడ కూడా మేకప్ వేసుకోవాలన్నారు..! -
"ఆయన్ను తట్టుకోలేక నరకం చూశా.. 16 సినిమాలు తిరస్కరించా" -
పెళ్లైన హీరోతో ఎఫైర్ వల్ల సినిమాల్లో బ్యాన్.. ఎవరా డ్రీమ్ గర్ల్ ?? -
అంచనాలను తలకిందులు చేస్తోన్న బంగారం ధరలు -
ఉగాది నుంచి వృషభరాశి, మేషరాశి వారి జాతక ఫలం -
Work From Home ఇచ్చేశారు. ప్రభుత్వం, ఐటీ దిగ్గజాల కీలక ప్రకటన! -
ICC T20I ర్యాంకింగ్స్: దూసుకొచ్చిన సంజూ, ఇషాన్ - అభిషేక్ ఏ స్థానంలో..!!












Click it and Unblock the Notifications