TTD: భక్తుల రద్దీ నిర్వహణలో ఇస్రో సేవలు - బ్రేక్ దర్శనాలపై బోర్డు కీలక నిర్ణయం..!!
Tirumala: బ్రహ్మోత్సవాల వేళ టీటీడీ పాలక మండలి పలు నిర్ణయాలకు ఆమోద ముద్ర వేసింది. భక్తుల రద్దీకి అనుగుణంగా ఏర్పాట్ల పైన సమీక్షించారు. టీటీడీ ప్రతిష్ఠ దెబ్బ తీసేలా ఎవరైనా మాటలాడితే క్రిమినల్ కేసులు నమోదు చేయాలని నిర్ణయించారు. తొలి సారి బ్రహ్మోత్సవాల వేళ ఇస్రో సేవలను వినియోగించుకోనున్నారు. అదే విధంగా బ్రహ్మోత్సవాలు జరిగే రోజుల్లో వీఐపీ బ్రేక్ దర్శనం రద్దు చేసారు. ఇక.. వెయ్యి దళిత వాడల్లో ఆలయాల నిర్మాణం పైన బోర్డు ఆమోదం తెలిపింది.
టీటీడీ పాలక మండలి సమావేశంలో పలు అంశాల పైన చర్చ జరిగింది. టీటీడీ ఈవోగా రెండోసారి బాధ్యతలు చేపట్టి బోర్డు సమావేశానికి హాజరైన ఈవో అనిల్ కుమార్ సింఘాల్ కు టిటిడి పాలక మండలి అభినందించింది. టీటీడీ ఈవోగా రెండవసారి అవకాశం ఇచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబుకి ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ముఖ్యమంత్రి సూచనలను తీసుకుని, భక్తులకు మరింత మెరుగైన సేవలు అందించడానికి కృషి చేస్తానని ఈవో తెలిపారు. తిరుమల శ్రీవారి ఆలయంలో మంగళవారం కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం ఘనంగా జరిగింది. ఆలయ అర్చకులు, అధికారులు, సిబ్బంది ఆలయ శుద్ధి కార్యక్రమంలో పాల్గొన్నారు.

ఆలయంలోని ఆనందనిలయం మొదలుకొని బంగారువాకిలి వరకు, శ్రీవారి ఆలయం లోపల ఉప దేవాలయాలు, ప్రసాదాల పోటు, ఆలయ ప్రాంగణం, గోడలు, పైకప్పుతోపాటు పూజాసామగ్రిని శుద్ధి చేసినట్టు తెలిపారు. ఇక, పాలక మండలి సమావేశంలో బెల్గాంలోని ఏడు ఎకరాల స్థలంలో ఆలయం నిర్మించాలని నిర్ణయించారు. ఈ నెల 19న జిల్లా యంత్రాంగం తో సమావేశమై బ్రహ్మోత్సవాల నిర్వహణ పైన చర్చిస్తామని ఈవో వెల్లడించారు.
టీటీడీ పైన ఎవరైనా అసత్య ప్రచారం చేస్తే క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని ఛైర్మన్ హెచ్చరించారు. దళితవాడలో వెయ్యి ఆలయాల నిర్మాణానికి పాలక మండలి నిర్ణయించింది. గుంటూరులో ఆలయం కోసం 7.2 కోట్లు కేటాయించారు. ఒక్కో అసెంబ్లీ పరిధిలో ఆరు ఆలయాలు నిర్మించేలా ప్రణాళికలపైన చర్చ జరిగింది. బ్రహ్మోత్సవాలు జరిగే పది రోజులు బ్రేక్ దర్శనాల కోసం సిఫారసు లేఖలను రద్దు చేసారు.

తొలి సారిగా బ్రహ్మోత్సవాల వేళ ఇస్రో సహకారంతో క్రౌడ్ మేనేజిమెంట్ కు నిర్ణయించారు. భక్తుల సౌకర్యార్ధం 8 లక్షల అదనపు లడ్డూల తయారీకి నిర్ణయం తీసుకున్నారు. 28న గరుడసేవకు మూడు లక్షల మంది వస్తారని అంచనా వేసారు. బ్రహ్మోత్సవాల చిత్రీ కరణకు ముంబాయి సంస్థ ముందుకు వచ్చిందని..ఉచితంగా చేస్తున్నారని ఛైర్మన్ చెప్పారు.
24 నుంచి అక్టోబర్ 2 వరకు బ్రహ్మోత్సవాలు జరుగుతాయని వివరించారు. 24న మీనలగ్నంలో ధ్వజారోహణ ద్వారా బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్నాయి. 24న సీఎం దంపతులు పట్టు వస్త్రాల సమర్పణ ఉంటుందని చెప్పారు. చిన్న పిల్లలు తప్పిపోకుండా జియో ట్యాటింగ్ చేస్తున్నామని.. భక్తులకు ఎలాంటి అసౌకర్యం లేకుండా చర్యలు తీసుకుంటామని వెల్లడించారు.
-
శ్రీవారి దర్శనం , వసతి కోసం వేచి చూస్తున్న భక్తులకు TTD గుడ్ న్యూస్, ఇలా సులభంగా..!! -
అలిపిరితో పాటు తిరుమలలో -
AP Inter Results: ఏపీలో ఇంటర్ ఫలితాల ముహూర్తం ఫిక్స్, అఫీషియల్..!! -
వారి గ్రీన్ కార్డులు అవుట్ -
కెరీర్ లోనే ఫస్ట్ ప్లాఫ్.. ఎలా తట్టుకుంటున్నావ్ అన్నా..!! -
US Visa: స్లాట్లు ఓపెన్. కానీ ప్రయాణం సేఫ్ కాదు! -
పాకిస్థాన్ కు ఎగిరి గంతేసే వార్త.. ఒకేసారి రూ. 41,500 కోట్లు సాయం అందింది..!! -
బెంగళూరుకు వందేభారత్ స్లీపర్, రైల్వే మంత్రి ప్రకటన- రూట్, హాల్టింగ్..!! -
మ్యాచ్ గెలిచినా.. ఆనందం లేకపాయె -
దళపతితో చేతులు కలిపిన దీదీ, ఇండియా కూటమిలో ప్రకంపనలు -
జన్మ నక్షత్రం మృగశిర, ఆరుద్ర ఉన్నవారి మే నెల జాతక ఫలం -
ఎంత సీఎం అయినా.. !!












Click it and Unblock the Notifications