Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

తిరుమల శ్రీవారి భక్తులకు టీటీడీ ఛైర్మన్ అలర్ట్..! స్పెషల్ డ్రైవ్ ..!

ఏపీలో తిరుమల శ్రీవారికి భక్తుల్లో ఉన్న నమ్మకం అంతా ఇంతా కాదు. ఏడుకొండల వాడిని దర్శించుకుంటే సర్వ సమస్యలు తీరిపోతాయని భావించే భక్తుల నమ్మకాన్ని కొందరు దళారులు సొమ్ము చేసుకుంటున్నారు. తిరుమల దర్శనంతో పాటు రూమ్ బుకింగ్స్, ఇతర సేవల పేరిట వారిని దోచుకుంటున్నారు. ఈ నేపథ్యంలో తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు (టీటీడీ) ఛైర్మన్ బీఆర్ నాయుడు భక్తులకు ఇవాళ కీలక విజ్ఞప్తి చేసారు. ఈ మేరకు ఎక్స్ లో ఆయన పోస్టు పెట్టారు.

శ్రీవారి దర్శన టిక్కెట్లు కోసం దళారీలు, మధ్యవర్తులను నమ్మి మోసపోవద్దంటూ ఎక్స్ లో టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు పోస్ట్ పెట్టారు. మధ్యవర్తులు పెద్ద మొత్తంలో డబ్బు వసూలు చేసి భక్తులను మోసం చేసిన అనేక సందర్భాలు కూడా బయటపడ్డాయని వారికి గుర్తుచేశారు. తిరుమల తిరుపతి దేవస్థానాల అధికారిక వెబ్‌సైట్ ద్వారా మాత్రమే తమ దర్శన టిక్కెట్లను బుక్ చేసుకోవాలని భక్తులకు సూచించారు.

ttd chairman br naidu urges devotees to be cautious on middlemen key suggestions on darshan

దర్శనం లేదా వసతి కోసం ఏ మధ్యవర్తులను సంప్రదించవద్దని భక్తులందరికీ విజ్ఞప్తి చేస్తున్నట్లు బీఆర్ నాయుడు తెలిపారు.
భక్తులను మోసం చేస్తున్న దళారీలను గుర్తించి వారిపై చట్టబద్ధంగా చర్యలు తీసుకోవడానికి టీటీడీ ప్రత్యేక డ్రైవ్‌ను నడుపుతోందన్నారు. మధ్యవర్తులు, దళారీలు సంప్రదిస్తే విజిలెన్స్ మరియు పోలీసుకు ఫిర్యాదు చేయాలని భక్తులను అభ్యర్థిస్తున్నట్లు ఆయన తెలిపారు. అలాగే తిరుమలను శుభ్రంగా, సురక్షితంగా ఉంచడానికి అందరూ చేతులు కలుపుదామని టీటీడీ ఛైర్మన్ పిలుపునిచ్చారు.

ttd chairman br naidu urges devotees to be cautious on middlemen key suggestions on darshan

తిరుమల దర్శనానికి వచ్చే భక్తులు శ్రీవారికి నిలువునా సమర్పించుకుంటుండగా.. భక్తుల్ని దళారులు నిలువుగా దోచుకుంటున్నారన్న విమర్శలు ఎప్పటి నుంచో ఉన్నాయి. ప్రభుత్వాలు మారుతున్నా, టీటీడీ బోర్డులు మారుతున్నా, సభ్యులు మారుతున్నా ఈ పరిస్దితిలో మాత్రం మార్పు రావడం లేదు. ఈ నేపథ్యంలో మరోసారి టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు భక్తులకు ఈ సూచనలు చేశారు. వీటిని భక్తులు పాటిస్తే కచ్చితంగా దర్శనం లభిస్తుందని టీటీడీ వర్గాలు పేర్కొంటున్నాయి.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+