Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

రికార్డు స్థాయిలో తిరుమల శ్రీవారి "బ్రహ్మోత్సవాలు" హుండీ ఆదాయం.. ఎంతంటే !

తిరుమలలో శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు ఈసారి ఘనంగా, ఎలాంటి ఇబ్బంది లేకుండా విజయవంతంగా పూర్తయ్యాయని టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు ప్రకటించారు. ఈ మేరకు ఆయన మాట్లాడుతూ.. టీటీడీ చరిత్రలో ఇంతటి సౌకర్యవంతంగా, క్రమబద్ధంగా భక్తులకు దర్శనాలు కల్పించడం ఇదే మొదటిసారి అని తెలిపారు.

బ్రహ్మోత్సవాల సందర్భంగా టీటీడీ అందించిన వసతులు, రవాణా, అన్నప్రసాదం, లడ్డూ పంపిణీ, క్యూలైన్ మేనేజ్‌మెంట్ సహా వైద్య సదుపాయాల పట్ల భక్తులు పూర్తి సంతృప్తి వ్యక్తం చేశారని ఆయన వివరించారు. భక్తులు ఎటువంటి ఇబ్బందులు ఎదుర్కోకుండా, ప్రతి సదుపాయాన్ని సమయానికి అందించగలిగామని పేర్కొన్నారు.

ttd-chairman-comments-on-hundi-income-received-during-the-brahmotsavams

రికార్డు స్థాయిలో హుండీ ఆదాయం..

బ్రహ్మోత్సవాల సందర్భంగా హుండీ ద్వారా వచ్చిన ఆదాయం రికార్డు స్థాయిలో ఉందని బీఆర్ నాయుడు వెల్లడించారు. మొత్తం 25.12 కోట్ల రూపాయలు కానుకల రూపంలో సమకూరగా, ఇది ఇటీవల సంవత్సరాల్లో గణనీయమైన ఆదాయంగా నిలిచిందని ఆయన పేర్కొన్నారు.

దర్శనాల సంఖ్య..

ఎనిమిది రోజుల పాటు సాగిన ఈ మహోత్సవాలలో దాదాపు 5.8 లక్షల మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారని స్పష్టం చేశారు. అధిక రద్దీని పరిగణనలోకి తీసుకొని ప్రత్యేక భద్రతా చర్యలు చేపట్టడం వల్ల భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగలేదని ఆయన తెలిపారు. అలానే ఈ ఉత్సవాల సమయంలో 28 లక్షలకు పైగా లడ్డూలు భక్తులకు అందించబడ్డాయని ప్రకటించారు. 26 లక్షల మందికి పైగా భక్తులకు అన్నప్రసాదాలు పంపిణీ చేశామని.. చిన్నారులు, వృద్ధులు, దివ్యాంగ భక్తుల కోసం ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేసి అందరికీ సౌకర్యవంతంగా అన్నప్రసాదం అందించగలిగామన్నారు.

తలనీలాలు, మొక్కులు..

ఇక మొత్తం 2.42 లక్షల మంది భక్తులు తమ తలనీలాలు సమర్పించి శ్రీవారికి మొక్కులు చెల్లించుకున్నాని నాయుడు తెలిపారు. ఈసారి ఆన్‌లైన్ బుకింగ్ సదుపాయం కారణంగా భక్తులు ముందుగానే రిజిస్ట్రేషన్ చేసుకొని తలనీలాలను సమర్పించడం సులభమైందన్నారు. రవాణా విషయానికి వస్తే, ఆర్టీసీ ప్రత్యేక ఏర్పాట్లు చేసిందని.. తిరుపతి నుంచి తిరుమలకు 4.40 లక్షల మంది భక్తులు ప్రయాణించగా, తిరుమల నుంచి తిరుపతికి 5.22 లక్షల మంది ప్రయాణించారన్నారు.

ఉత్సవాల సమయంలో భక్తుల భద్రత కోసం పోలీసులు, వాలంటీర్లు, టీటీడీ సిబ్బంది సమన్వయంతో పనిచేశారని కొనియాడారు. సీసీటీవీ కెమెరాలు, ప్రత్యేక కంట్రోల్ రూమ్‌లు ఏర్పాటు చేసి 24 గంటల పర్యవేక్షణ చేపట్టడం ద్వారా ఎటువంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా నిరోధించగలిగామని సంతోషం వ్యక్తం చేశారు.

ఉత్సవాల విజయానికి వందలాది వాలంటీర్లు, అన్నప్రసాదం సిబ్బంది, వైద్య బృందం, ఆర్టీసీ డ్రైవర్లు, పోలీసులు కలిసి సమన్వయంతో కృషి చేశారని బీఆర్ నాయుడు పేర్కొన్నారు. ఈ మహోత్సవాన్ని విజయవంతం చేయడంలో సహకరించిన ప్రతి ఒక్కరికీ ఆయన ధన్యవాదాలు తెలిపారు. భవిష్యత్తులోనూ ఇలాగే మరింత ఆధునిక సదుపాయాలతో కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+