తిరుమలలో 250 రోజులకు పైగా..: కీలక ప్రకటన చేసిన టీటీడీ ఛైర్మన్ !!

బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర అల్పపీడన ప్రభావం వల్ల ఏపీలో భారీ వర్షాలు పడుతున్నాయి. శ్రీకాకుళం నుంచి చిత్తూరు జిల్లా వరకు విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. బంగాళాఖాతంలో కేంద్రీకృతమైన తీవ్ర అల్పపీడనం ఈ మధ్యాహ్ననికి నైరుతి, పశ్చిమమధ్య బంగాళాఖాతంలో వాయుగుండంగా బలపడింది. ఫలితంగా వచ్చే అయిదు రోజులపాటు రాష్ట్రంలో విస్తృతంగా పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉంది.

ఈ భారీ వర్షాలు శ్రీవారి భక్తుల చింత తీర్చాయి. తిరుమలలో మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలతో అయిదుప్రధాన జలాశయాలు పూర్తిస్థాయి నీటి మట్టాన్ని అందుకున్నాయి. జలకళను సంతరించుకున్నాయి. తిరుమలకు పాపవినాశనం, ఆకాశగంగ, గోగర్భం, కుమారధార, పసుపుధార జలాశయాలు ప్రధాన నీటి వనరులు. భారీ వర్షాల వల్ల వరదనీరు జలాశయాల్లోకి చేరుకుంటోంది. ప్ర‌స్తుత నీటి నిల్వ‌లు తిరుమ‌ల‌కు 250 రోజుల మంచినీటి అవ‌స‌రాల‌కు స‌రిపోతాయి.

TTD Chairman offered Ganga Harathi in Tirumala

గోగర్భం డ్యామ్ పూర్తిగా నిండిపోవడంతో ఒక గేటును తెరిచి నీటిని దిగువకు విడుదల చేస్తోన్నారు టీటీడీ అధికారులు. రిజర్వాయర్లల్లో నీటి నిల్వ‌లు పూర్తిస్థాయికి చేరుకోవ‌డంతో టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు ప్రత్యేక పూజ‌లు గంగమ్మకు ప్రత్యేక పూజలు చేశారు. పాపవినాశనం రిజర్వాయర్ వ‌ద్ద ఈ ఉదయం గంగ హార‌తి స‌మ‌ర్పించారు. ఆ సమయంలో ఆయన వెంట టీటీడీలోని వివిధ విభాగాధిపతులు ఉన్నారు.

అనంతరం బీఆర్ నాయుడు విలేకరులతో మాట్లాడారు. తిరుమలలోని జలాశయాలు 95 శాతం నిండిపోవడం శుభ పరిణామమని, 250 రోజులకు పైగా భక్తుల నీటి అవసరాలుకు తగినంత నీళ్లు రిజర్వాయర్లల్లో వచ్చి చేరాయని చెప్పారు. పాపవినాశనం, గోగర్భం డ్యామ్ లు పూర్తిగా నిండిపోవడంతో గేట్లు తెరిచి నీటిని దిగువకు విడుదల చేస్తున్నామని తెలిపారు. భక్తుల అవసరం కోసం తిరుమలలో ప్రతిరోజూ 50 లక్షల గ్యాలన్ల నీరు అవసరమవుతుండగా తిరుపతిలోని కళ్యాణి డ్యామ్ నుండి 25 లక్షల గ్యాలన్లు, తిరుమలలోని డ్యామ్ ల నుండి 25 లక్షల గ్యాలెన్ల నీటిని వినియోగిస్తున్నామని వివరించారు.

తిరుమలలో 250 రోజుల నీటి అవసరాలకు సరిపడే నీటి నిల్వలు అందుబాటులో ఉన్నాయని చెప్పారు. డ్యామ్ లను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ నీటి అవసరాలను సక్రమంగా నిర్వహిస్తున్న ఇంజనీరింగ్ శాఖను ఈ సందర్భంగా ఆయన అభినందించారు. టీటీడీ చరిత్రలో రికార్డుస్థాయిలో మొదటిసారి ఈ ఏడాది భారీ విరాళాలు అందాయని బీఆర్ నాయుడు అన్నారు. గత 11 నెలల్లో టీటీడీ ట్రస్టులకు రూ.918 కోట్లు విరాళాలు అందినట్లు చెప్పారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+