TTD: వైకుంఠ ఏకాదశి టికెట్లు జారీ ఇలా, వాట్సప్ లోనూ రిజిస్ట్రేషన్ - స్థానికులకు ప్రత్యేకం..!!

Tirumala: వైకుంఠ ఏకాదశి నిర్వహణ పైన టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది. డిసెంబర్ చివరి రెండు రోజులు వైకుంఠ ఏకాదశి.. ద్వాదశి కాగా, తరువాతి రోజున న్యూ ఇయర్ కావటంతో పెద్ద సంఖ్య లో భక్తులు తరల వస్తారని అంచనా వేస్తున్నారు. దీంతో.. టికెట్ల జారీ పైన కీలక నిర్ణయాలు తీసుకుంది. రేపు (గురువారం) నుంచి రిజిస్ట్రేషన్ ప్రారంభం కానుంది. వాట్సప్ ద్వారా రిజిస్ట్రేషన్ కు అవకాశం కల్పించింది. స్థానికులకు ప్రత్యేక కేటాయింపులు చేసారు.

తిరుమలలో ఈ సారి వైకుంఠ ఏకాదశి ఎలాంటి ఇబ్బందులు లేకుండా పూర్తి చేసేందుకు టీటీడీ చర్యలు చేపట్టింది. డిసెంబర్ 30 నుండి జనవరి 8 వరకు తిరుమలలో వైకుంఠ ద్వార దర్శనం కొనసాగించాలని నిర్ణయించింది. అందులో భాగంగా మొదటి మూడు రోజులకు ఎలక్ట్రానిక్ డిప్ ద్వారా దర్శన టోకెన్ల జారీ చేయనుంది. చివరి 7 రోజుల్లో వైకుంఠం క్యూ కాంప్లెక్స్ -2 ద్వారా భక్తులకు సర్వదర్శనం కల్పించనుంది. మొదటి మూడు రోజుల్లో ఎస్ఈడీ , శ్రీవాణి దర్శనాలు రద్దు చేసిన టిటిడి.. స్థానికులకు ప్రత్యేక అప్లికేషన్ ద్వారా టికెట్ల బుకింగ్ కు అవకాశం కల్పించాల ని డిసైడ్ అయింది, కాగ, వైకుంఠ ద్వార దర్శన రోజుల్లో తిరుపతిలో ఎస్ఎస్డీ టోకెన్ల జారీ నిలిపి వేతకు నిర్ణయం తీసుకుంది. ప్రోటోకాల్ ప్రముఖులకు మినహా వీఐపీ దర్శనాలు, ఇతర ప్రత్యేక దర్శనాలు, ఆర్జిత సేవలు రద్దు చేసింది.

ttd-decided-dates-and-timings-for-issue-of-tickets-for-vaikunta-dwara-darshanam

ఇక.. ఆన్ లైన్ అప్లికేష‌న్ ద్వారా దాతలకు దర్శన బుకింగ్ కు అవకాశం కల్పించింది. ఇందులో భాగంగా సామాన్య భక్తులకు పెద్దపీట వేస్తూ పలు నిర్ణయాలు తీసుకుంది. ఎల‌క్ట్రానిక్‌ డిప్ ద్వారా దర్శన టోకెన్లను టీటీడీ జారీ చేయనుంది. మొదటి మూడు రోజులు వైకుంఠ ద్వార దర్శనాలకు అంటే డిసెంబర్ 30, 31, జనవరి 1 తేదీలకు ఎల‌క్ట్రానిక్ డిప్ ద్వారా సర్వ దర్శన టోకెన్లను ఆన్ లైన్ లో కేటాయించనుంది. కుటుంబ స‌భ్యులంద‌రికీ అందుబాటులో ఉండే విధంగా 1+3 విధానంలో టోకెన్లు జారీచేయనుంది. రేపు (గురువారం) నుంచి నవంబర్ 27 నుండి డిసెంబర్ 1వ తేది వరకు ఎల‌క్ట్రానిక్ డిప్ నమోదుకు టీటీడీ అవకాశం కల్పించింది. మొదటి మూడు రోజులకు వైకుంఠ ద్వారా దర్శనాలకు నవంబర్ 27వరకు ఉదయం 10 గంటల నుండి డిసెంబర్ 1 సాయంత్రం 5 గంటల వరకు https://ttdevasthanams.ap.gov.in/, మొబైల్ యాప్ https://apps.apple.com/in/app/ttdevasthanams/, వాట్సాప్ లో ఏపీ గవర్నమెంట్ బాట్ లో టీటీడీ ఆలయాల విభాగంలో ఎల‌క్ట్రానిక్‌ డిప్ కు వివరాలు నమోదు చేసుకోవాల్సి ఉంటుంది.

కాగా, డిసెంబర్ 2న మధ్యాహ్నం 2 గంటలకు ఎల‌క్ట్రానిక్‌ డిప్ వివరాలు భక్తులకు అందించాలని నిర్ణయించారు. ఇక వాట్సాప్ బాట్ లో నమోదు చేసుకునే విధానం అందుబాటులోకి తెచ్చింది. వాట్సాప్ బాట్ ద్వారా ఎల‌క్ట్రానిక్‌ డిప్ రిజిస్ట్రేష‌న్ న‌మోదు చేసుకునే భ‌క్తులు ఏపీ గ‌వ‌ర్న‌మెంట్ స‌ర్వీసెస్ నెం. 9552300009 కు ముందుగా గోవిందా లేదా హాయ్ అని మెసేజ్ చేయాలి. అనంత‌రం ఇంగ్లీష్‌, తెలుగు భాష‌ల‌ను సెల‌క్ట్ చేసుకోవాలి. ఇంగ్లీష్ కోసం EN, తెలుగు కోసం TE అని రిప్లై ఇవ్వాలి. అనంత‌రం ఎంచుకున్న భాష‌లో స‌ర్వీసెస్ విండో క‌నిపిస్తుంది. ఆ స‌ర్వీసెస్ విండోను ఓపెన్ చేసుకుని టీటీడీ టెంపుల్ స‌ర్వీసెస్ ను ఎంపిక చేసుకోవాలి. త‌ర్వాత టీటీడీ టెంపుల్ స‌ర్వీసెస్‌ ఓపెన్ చేయ‌గానే వైకుంఠ ద్వార ద‌ర్శ‌నం (డిప్‌) రిజిస్ట్రేష‌న్ అనే ఆప్ష‌న్ వ‌స్తుంది. ఇక్క‌డ ఇంగ్లీష్‌, తెలుగు, త‌మిళ్‌, క‌న్న‌డ‌, హిందీ భాష‌లను ఎంపిక చేసుకుని క‌న్ఫ‌ర్మ్ చేయాలి. త‌ర్వాత చిరునామా, పిన్ కోడ్ న‌మోదు చేయాల్సి ఉంటుంది. త‌ర్వాత భ‌క్తుల ఆధార్ కార్డులో ఉన్న విధంగా పేరు, వ‌య‌స్సు, జెండర్, ఆధార్ నంబ‌ర్, మొబైల్ నంబ‌ర్‌ న‌మోదు చేయాలి. ఆ త‌ర్వాత వివ‌రాల‌ను స‌రి చూసుకుని సబ్మిట్ చేయాల్సి ఉంటుంది.

జనవరి 6, 7, 8 మూడు రోజులు స్థానికులకు దర్శనం కల్పించనుంది.. జనవరి 6, 7, 8 మూడు రోజులపాటు స్థానికులకు స్థానికుల కోటా కింద దర్శనం కల్పించనుంది. ప్రత్యేక అప్లికేషన్ ద్వారా దర్శన టోకెన్లు జారీ చేయబోతోంది. రోజుకు 5వేల టోకెన్లు స్థానికులకు కేటాయించనున్న టీటీడీ ఇందులో తిరుపతి, చంద్రగిరి, రేణిగుంట స్థానికులకు రోజుకు 4500 టోకెన్లు కేటాయించగా, తిరుమల స్థానికులకు రోజుకు 500 టోకెన్లను కేటాయించింది. ఈ టోకెన్లు డిసెంబర్ 10 నుంచి ఆన్ లైన్ లో విడుదల చేయబోతున్న టిటిడి ఒక్కో వ్యక్తి 1+3 విధానంలో టోకెన్లు బుకింగ్ చేసుకోవచ్చని పేర్కొంది. ఇక స్వయంగా వచ్చే ప్రోటోకాల్ ప్రముఖులకు మాత్రమే వీఐపీ దర్శనం కల్పించబోతున్నట్లు టిటిడి స్పష్టం చేసింది. వైకుంఠ ద్వార దర్శనాల నేపథ్యంలో డిసెంబర్ 30 నుండి జనవరి 8 వరకు స్వయంగా వచ్చే ప్రోటోకాల్ ప్రముఖులకు మాత్రమే వీఐపీ బ్రేక్ దర్శనాలు కల్పించనుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+