కియోస్క్ కౌంటర్ల ద్వారా శ్రీవారి లడ్డూ ప్రసాదం?
Vontimitta: శ్రీరామనవమిని పురస్కరించుకుని కడప జిల్లా ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామివారి ఆలయం బ్రహ్మోత్సవాలు వైభవంగా ఆరంభం అయ్యాయి. ఈ నెల 14వ తేదీ వరకు కొనసాగనున్నాయి. ఈ శ్రీరామనవమి బ్రహ్మోత్సవాలను టీటీడీ అధికారులు అంగరంగ వైభవంగా నిర్వహిస్తోన్నారు. ప్రతీరోజు కోదండరాములవారు వేర్వేరు అవతారాలతో భక్తులకు దర్శనం ఇస్తోన్నారు.
బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఈ నెల 11వ తేదీన నిర్వహించబోయే శ్రీసీతారాముల కల్యాణోత్సవం నాడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఒంటిమిట్టకు రానున్నారు. సాయంత్రం 6 గంటలకు స్వామివారికి పట్టువస్త్రాలను సమర్పించనున్నారు. కల్యాణోత్సవానికి భారీ సంఖ్యలో భక్తులు తరలిరానున్నందున ముమ్మర ఏర్పాట్లను చేపట్టారు.

తిరుమల తిరుపతి దేవస్థానం కార్యనిర్వహణాధికారి జే శ్యామలరావు స్వయంగా ఈ ఏర్పాట్లను పరిశీలించారు. జిల్లా కలెక్టర్ చెరుకూరి శ్రీధర్, ఎస్పీ అశోక్ కుమార్.. ఇతర అధికారులతో కలిసి క్షేత్రస్థాయిలో పనులను పర్యవేక్షించారు. అనంతరం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు.
ప్రతి గ్యాలరీలో భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా పారామెడికల్, టిటిడి ఉద్యోగులు, పోలీసు, శ్రీవారి సేవకులు ఉండేలా చర్యలు చేపట్టామని, కల్యాణ వేదిక ప్రవేశ ప్రారంభంలో తలంబ్రాలు పంపిణీ కోసం తొలిసారిగా ప్రత్యేకంగా 28 కుయెస్క్ ఏర్పాటు చేశామని తెలిపారు.
కళ్యాణోత్సవానికి విచ్చేసే ప్రతి భక్తుడికి ముత్యాల తలంబ్రాలు, శ్రీవారి లడ్డూ ప్రసాదం, కంకణం, అన్నప్రసాదాలు అందించేలా పటిష్ట ఏర్పాట్లు పూర్తి చేస్తోన్నామని వివరించారు. ఆలయ ప్రాంగణంలో నడిచే భక్తులకు ఎండ వేడి ఉపశమనం లభించడానికి ఆలయ నాలుగు మాడ వీధులలో వైట్ పెయింట్ వేశామని శ్యామలరావు పేర్కొన్నారు. సీతారాముల కల్యాణోత్సవాన్ని వీక్షించడానికి వీలుగా అత్యాధునిక టెక్నాలజీతో 21 ఎల్ఈడీ స్క్రీన్లను ఏర్పాటు చేశామని తెలిపారు.
భద్రత చర్యల్లో భాగంగా టీటీడీ విజిలెన్స్ విభాగం నుండి 350, జిల్లా పోలీస్ యంత్రాంగం నుండి 2,500 మంది భద్రతా సిబ్బందిని మోహరింపజేసినట్లు శ్యామలరావు తెలిపారు. అదే విధంగా 130 సీసీ కెమెరాలు, 20 డ్రోన్లను వినియోగించుకోనున్నట్లు ఆయన వివరించారు.

శ్రీ కోదండరామస్వామివారి బ్రహ్మోత్సవాలకు విచ్చేసే భక్తులకు ఉదయం నుండి రాత్రి వరకు ఆలయ ప్రాంగణం, కల్యాణ వేదిక వద్ద అన్నప్రసాద వితరణ జరుగుతోందని, కల్యాణాన్ని వీక్షించేందుకు గ్యాలరీలలో వేచి ఉండే భక్తులకు సాయంత్రం నుండి పులిహోర, చక్కర పొంగలి, బిస్కెట్ ప్యాకెట్, కారాసు అందిస్తామని చెప్పారు.
కడప నుండి ఒంటిమిట్ట వరకు 85 బస్సులను ప్రత్యేకంగా నడిపించనున్నట్లు శ్యామలరావు వివరించారు. ఆయా బస్సులు మొత్తం 425 ట్రిప్పులు తిరుగుతాయని చెప్పారు. అలాగే రాజంపేట నుండి ఒంటిమిట్ట వరకు 40 బస్సులతో మొత్తం 625 ట్రిప్పుల ద్వారా భక్తులకు రవాణా సౌకర్యం కల్పిస్తున్నామని అన్నారు.
-
ప్రపంచంలో సంతోషకరమైన దేశం ఇదే.. మారిన లెక్కలు.. -
వృషభరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, మకర రాశులకు ఏప్రిల్ 19 నుంచి మాలవ్య రాజయోగం -
కేంద్రీయ విద్యాలయాల్లో అడ్మిషన్ల జాతర! వెంటనే అప్లై చేయండి -
వైసీపీలోకి రీ ఎంట్రీ పై తేల్చేసిన బాలినేని, ఆయన నాయకుడు మాత్రమే కాదు..!! -
చర్లపల్లి నుంచి ఏపీ మీదుగా కొత్త అమృత్ భారత్-హాల్ట్ లు ఇవే, ఆ రోజు నుంచే..! -
LPG కొరత తీవ్రం-కేంద్రం ప్రకటన-వినియోగదారులకు కీలక సూచనలు..! -
రైతు భరోసా నిధుల విడుదల వేళ మరో ట్విస్ట్, కీలక మార్పులు..!! -
మనసు మార్చుకున్న బాలినేని, నెక్స్ట్ ఇక...!? -
పల్నాడు, సింహాద్రి ప్రయాణీకులకు రైల్వే గుడ్ న్యూస్, ఇక నుంచి..!! -
ఇంటర్ ఫలితాల ముహూర్తం ఖరారు : వేసవి సెలవుల పై తాజా ఉత్తర్వులు..!! -
పడింది దెబ్బ: మోత మోగిన పెట్రోల్ ధరలు- లీటర్ కు ఎంత పెరిగిందంటే? -
3000 ఏళ్ల సంప్రదాయం.. యుద్ధం మధ్యే నూతన సంవత్సరం












Click it and Unblock the Notifications