TTD: బ్రహ్మోత్సవాలు, శ్రీవారికి సర్వం సిద్దం చేసిన టీటీడీ

కలియుగ దైవం శ్రీ వేంకటేశ్వర స్వామి కొలువు తీరిన తిరుమలలో బ్రహ్మోత్సవాలు రంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. శనివారం శ్రీవారికి చక్రస్నానం నిర్వహించడానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. తిరుమలలో శ్రీవారి బ్రహ్మోత్సవాలు అంటేనే భారతదేశంతో పాటు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న హిందువులు ఆ బ్రహ్మోత్సవాలను చూడటానికి పొటీ పడుతుంటారు.

తిరుమల బ్రహ్మోత్సవాల సందర్భంగా టీటీడీ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ప్రతి సంవత్సరం దసరా సందర్భంగా శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు ఎంత రంగరంగ వైభవంగా నిర్వహిస్తారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ సంవత్సరం శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలకు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. తిరుమల శ్రీవారి లడ్డూలో కల్తీ నెయ్యి వాడాలని ఆరోపణలు వచ్చిన సందర్భంగా జరుగుతున్న బ్రహ్మోత్సవాలలో శ్రీవారి భక్తులకు ఇలాంటి ఇబ్బందులు లేకుండా ఎవరు ఎలాంటి ఆరోపణలు చేయకుండా టీటీడీ అధికారులు అనేక జాగ్రత్తలు తీసుకున్నారు.

TTD EO said that all arrangements have been made for Chakrasnanam in Tirumala

ఇలాంటి సమయంలో శ్రీవారి బ్రహ్మోత్సవాలలో ఏదైనా సమస్యలు వస్తే లేనిపోని ఇబ్బందులు వస్తాయని అనుకున్న టీటీడీ అధికారులు భావించారు. దళారుల విషయంలో కూడా తిరుమల తిరుపతి దేవస్థానం కఠినమైన నిర్ణయాలు తీసుకుంది. శ్రీవారి బ్రహ్మోత్సవాలకు స్పెషల్ దర్శనం, సుదర్శనం టోకన్లు ఉన్న భక్తులను మాత్రమే తిరుమల ఏడుకొండల మీదకు అనుమతించారు.

శ్రీవారి లడ్డూలు ఎన్ని కావాలంటే అన్ని భక్తులు తీసుకుంటున్నారు. అయితే గతంలో లాగా శ్రీవారి లడ్డులో నాణ్యత కి ఇప్పటికీ చాలా తేడా ఉంది శ్రీవారి భక్తుల అంటున్నారు. తిరుమలలో ప్రస్తుతం లడ్డూలు తీసుకుంటున్న భక్తులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. తిరుమలలో శ్రీవారి లడ్డూలు ఇప్పుడు రుచి, నాణ్యతతో పాటు అన్ని రకాలుగా చాలా బాగున్నాయని శ్రీవారి భక్తుల అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

తిరుమలలో బ్రహ్మోత్సవాల్లో భాగంగా చక్ర స్నానానికి అవసరమైన అన్ని ఏర్పా ఏర్పాట్లు నిర్వహించామని టీటీడీ ఈవో శ్యామల రావు తెలిపారు. శుక్రవారం మీడియాతో మాట్లాడిన శ్యామలరావు బ్రహ్మోత్సవాలకు వచ్చిన భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లు చేశామని, శ్రీవారి చక్ర స్నానం నిర్వహించడానికి అన్ని ఏర్పాట్లు చేశామని టీటీడీ ఈవో శ్యామలరావు తెలిపారు. సుమారు 40,000 మంది సిబ్బందితో తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలు రంగరంగ వైభోగం వైభవంగా నిర్వహించామని, ఎక్కడా ఎలాంటి ఇబ్బంది లేకుండా చూసుకున్నామని టీటీడీ ఈవో శ్యామలరావు తెలిపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+