TTD: తిరుమలలో పచ్చదనం కాపాడాలి, టీటీడీ సంచలన నిర్ణయం
తిరుమలలో శ్రీవారి బ్రహ్మోత్సవాలు రంగరంగ వైభవంగా నిర్వహించాలని టీటీడీ నిర్ణయించింది. ఆంధ్రప్రదేశ్ లో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తరువాత తిరుమలలో మొదటిసారి శ్రీవారి బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి. తిరుమలలో శ్రీవారి బ్రహ్మోత్సవాలు చూడటానికి వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బంది ఎదురుకాకుండా చూసుకోవాలని, ఆ బాధ్యత టీటీడీ చూసుకోవాలని సీఎం చంద్రబాబు నాయుడు ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారని తెలిసింది. ఇప్పుడు టీటీడీ యాజమాన్యం పలు నిర్ణయాలు తీసుకుంటున్నది.
తిరుమలలో భక్తులకు మరింత ఆహ్లాదకర ఆధ్యాత్మిక వాతావరణాన్ని కల్పించేందుకు పచ్చదనాన్ని పెంపొందించాలని టీటీడీ ఈవో శ్యామల రావు పిలుపునిచ్చారు.టీటీడీ అటవీ విభాగం ఆధ్వర్యంలో జరిగిన వన మహోత్సవంలో టీటీడీఈవో శ్యామలరావు, టీటీడీ అదనపు ఈవో సీహెచ్ వెంకయ్య చౌదరితో కలిసి శుక్రవారం నాడు తిరుమల శ్రీ పద్మావతి విశ్రాంతి భవనం ప్రాంగణంలో మాను సంపంగి స్థల వృక్షం నాటారు.

ఈ సందర్భంగా టీటీడీ ఈవో శ్యామలరావు మీడియాతో మాట్లాడుతూ, టీటీడీ అటవీ విభాగం పరిధిలో రెండు వేలు, రిజర్వ్ ఫారెస్ట్ ఏరియాలో 12 వేల మొక్కలు నాటనున్నట్లు తెలిపారు. తిరుమలలో సీడ్ బౌల్ కాన్సెప్ట్ ద్వారా ఆధునిక సాంకేతికతను ఉపయోగించి మొక్కలు నాటే కార్యక్రమాన్ని శాశ్వతంగా నిర్వహించనున్నట్లు టీటీడీ ఈవో శ్యామలరావు చెప్పారు. టీటీడీ ఆయుర్వేద కళాశాల, ఆయుర్వేద ఆసుపత్రి ఉన్నందున ఈ సంస్థలకు అవసరమైన ఔషధ మొక్కలను ప్రత్యేకంగా తిరుమలలోని కాటేజీల సమీపంలో అభివృద్ధి చేస్తాం అని టీటీడీ ఈవో శ్యామలరావు తెలిపారు.
టీటీడీ అటవీ విభాగం ఆధ్వర్యంలో తిరుమలలోని వివిధ ప్రదేశాలలో వందలాది మాను సంపంగి, చందనం, సీతా అశోక మొక్కలను నాటారు.తిరుమలలో మోక్కలను కాపాడటానికి శ్రీవారి భక్తులు కూడా సహకరించాలని టీటీడీ మనవి చేసింది. మోక్కలను భక్తులు జాగ్రత్తగా చూసుకోవాలని, అప్పుడు ఆమొక్కలు పెరిగి పెద్దవి అవుతాయని పలువురు టీటీడీ అధికారులు అభిప్రాయం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో టీటీడీ డిప్యూటీ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ శ్రీనివాసులు, డిప్యూటీ ఈవోలు భాస్కర్, శ్రీమతి ఆశాజ్యోతి, హెల్త్ ఆఫీసర్ మధుసూధన్ ప్రసాద్ తో పాటు అటవీశాఖ అధికారులు పాల్గొన్నారు.












Click it and Unblock the Notifications