తిరుమలలో ఇకపై ప్రతీ మంగళవారం- TTD కీలక నిర్ణయం, భక్తుల ఫిర్యాదుతో..!!

తిరుమలలో రద్దీ కొనసాగుతోంది. క్రిష్ణ తేజ వసతి సముదాయం వరకు క్యూ లైన్లు కొనసాగుతు న్నాయి. ఈ నెల 28న తిరుమలలో శ్రావణ పౌర్ణమి వేళ గరుడ వాహన సేవ నిర్వహించనున్నారు. అదే విధంగా ఈ ఏడాది రెండు సార్లు బ్రహ్మోత్సవాల నిర్వహణకు సిద్దం అవుతున్నారు. వచ్చే నెల జరిగే శ్రీవారి బ్రహ్మోత్సవాల కోసం టీటీడీ కొత్త నిర్ణయాలు తీసుకుంటోంది. అందులో భాగం గా ప్రతీ మంగళవారం తిరుమలలో కొత్తగా ఒక ఉద్యమం తరహాలో నిర్ణయం అమలుకు సిద్దం అయ్యారు.

తిరుమలలో బ్రహ్మోత్సవాల నిర్వహణకు టీటీడీ సమాయత్తం అవుతోంది. శ్రీవారి బ్రహ్మోత్సవాల ను పురస్కరించుకొని భక్తులకు పరిశుభ్రమైన వాతావరణం, నాణ్యమైన ఆహారం అందించేందుకు టీటీడీ ముందస్తు చర్యలు చేపట్టింది. తిరుమలలోని ఫాస్ట్‌ఫుడ్‌ సెంటర్ల పరిసరాలను పరిశుభ్రంగా ఉంచేందుకు ఇకపై ప్రతి మంగళవారం "క్లీనింగ్ డే" ప్రత్యేకంగా నిర్వహించాలని నిర్ణయించింది.
ఇటీవల ఫాస్ట్‌ఫుడ్‌ సెంటర్ల పరిసరాల్లో అపరిశుభ్రత నెలకొంటోందని భక్తుల నుంచి ఫిర్యాదులు అందుతున్న నేపథ్యంలో అధికారులు ఈ విధానాన్ని అమలు చేస్తున్నారు. వారం రోజుల పాటు వ్యాపార కార్యకలాపాలు నిర్వహించే దుకాణాల పరిసరాల్లో పేరుకుపోయే వ్యర్థాలు, మురికి తదితరాలను తొలగించి పరిశుభ్రంగా ఉంచేందుకు ప్రతి మంగళవారం ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఫాస్ట్‌ఫుడ్‌ సెంటర్లను మూసివేసి సంపూర్ణంగా శుభ్రం చేసుకోవాలని నిర్వాహకులకు సూచించారు.

 మోదీ కేబినెట్ లోకి మరో టీడీపీ ఎంపీ, ఆయనకే ఫిక్స్ - తెలంగాణ నుంచి ఆ ఇద్దరూ..!?
మోదీ కేబినెట్ లోకి మరో టీడీపీ ఎంపీ, ఆయనకే ఫిక్స్ - తెలంగాణ నుంచి ఆ ఇద్దరూ..!?
tirumala-gears-up-for-srivari-brahmotsavams-with-weekly-cleaning-day-initiative-here-the-details

బ్రహ్మోత్సవాలకు తిరుమలలో ఏర్పాట్లు

తిరుమల శ్రీవారి ఆలయంలో శ్రావణమాసంలో ప్రతి ఏటా మూడురోజులపాటు నిర్వహించబడే పవిత్రోత్సవాలు పవిత్ర పూర్ణాహుతితో ఘనంగా ముగిశాయి. తొలి రెండు రోజుల్లాగానే యాగశాలలో ఋత్వికులు హోమాలను నిర్వహించారు. తరువాత ఉదయం 9 నుండి 11 గంటల నడుమ ఉత్సవమూర్తులకు వరుసగా గోక్షీరము, పెరుగు, తేనె, కొబ్బరి నీళ్ళు, పసుపుతో అభిషేకించి చివరగా చందన పూతను పూశారు. ధూపదీప హారతులు నివేదించారు. దీనితో స్నపన తిరుమంజన కార్యక్రమం శాస్త్రోక్తంగా ముగిసింది. కాగా మధ్యాహ్నం 1 గంటకు విశేష సమర్పణ, 4 గంటలకు ఉత్సవమూర్తుల ఊరేగింపు కార్యక్రమాలు వైభవంగా జరిగాయి. ఇక రాత్రి 7 గంటలకు పూర్ణాహుతి కార్యక్రమాన్ని అర్చకులు శాస్త్రోక్తంగా నిర్వహించారు. అనంతరం శ్రీమలయ్పప్పస్వామివారు శ్రీదేవి, భూదేవిలతో కూడి విమాన ప్రదక్షిణంగా వెళ్ళి ఆలయ ప్రవేశం చేయడంతో పవిత్రోత్సవాలు పరిసమాప్తమయ్యాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+