బ్రహ్మాండనాయకుని బ్రహ్మోత్సవం - ధ్వజారోహణం, ప్రత్యేకతలు..!!
Tirumala: శ్రీవారి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ జరిగింది. నేటి నుంచి 12వ తేదీ వరకు బ్రహ్మోత్సవాలు జరగనన్నాయి. బ్రహ్మోత్సవాల వేళ ప్రతీ రోజు ఉదయం, సాయంత్రం సమయాల్లో వాహన సేవ జరగనుంది. బ్రహ్మోత్సవాలకు ప్రత్యేక ఏర్పాట్లు చేసారు. ముఖ్యమంత్రి చంద్రబాబు దంపతులు ఈ రోజు స్వావి వారికి పట్టు వస్త్రాలు సమర్పించనున్నారు.
అంకురార్పణ
శ్రీవారి బ్రహ్మోత్సవాలకు సాయంత్రం శాస్త్రోక్తంగా అంకురార్పణ చేపట్టారు. ఇందులో భాగంగా శ్రీవారి తరపున సేనాధిపతి అయిన శ్రీ విష్వక్సేనులవారు ఆలయ నాలుగు మాడ వీధుల్లో ఊరేగింపుగా వెళ్లి బ్రహ్మోత్సవాల ఏర్పాట్లను పర్యవేక్షించారు. అనంతరం అంకురార్పణ కార్యక్రమాల్లో భాగంగా ఆలయంలోని యాగశాలలో భూమాతకు ప్రత్యేక పూజలు నిర్వహించి పుట్టమన్నులో నవధాన్యాలను నాటారు. వైఖానస ఆగమోక్తంగా అంకురార్పణ ఘట్టం నిర్వహించారు.

ధ్వజారోహణ
బ్రహ్మోత్సవాల్లో ఉదయం వాహనసేవ 8 నుండి 10 గంటల వరకు, రాత్రి వాహనసేవ 7 నుండి 9 గంటల వరకు జరుగుతుంది. గరుడవాహనసేవ సాయంత్రం 6.30 నుండి రాత్రి 11 గంటల వరకు జరుగుతుంది. ఆలయ నాలుగు మాడ వీధులలో భక్తులను ఆకట్టుకునేలా రంగవల్లులు తీర్చిదిద్దారు. గ్యాలరీలలో వేచివుండే భక్తుల సౌకర్యార్థం తాగునీరు, మరుగుదొడ్లు అందుబాటులో ఉంచారు. నేడు(అక్టోబర్ 4) సాయంత్రం 5.45 నుండి 6 గంటల మధ్య మీన లగ్నంలో శాస్త్రోక్తంగా ధ్వజారోహణం నిర్వహిస్తారు. బ్రహ్మోత్సవాలు ధ్వజారోహణంతో ప్రారంభమవుతాయి.
వాహన సేవ
శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ మలయప్పస్వామివారి సమక్షంలో వేదగానాల మధ్య మంగళవాద్యాలు మోగుతుండగా అర్చకస్వాములు బంగారు ధ్వజస్తంభంపై గరుడధ్వజాన్ని ఎగురవేస్తారు. ఈ కార్యక్రమం ద్వారా సకల దేవతలను, అష్టదిక్పాలకులను బ్రహ్మోత్సవాలకు ఆహ్వానిస్తారు. ఆ తరువాత రాత్రి 9 నుండి 11 గంటల వరకు పెద్దశేషవాహన సేవ జరుగుతుంది. మొదటిరోజు రాత్రి శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్పస్వామివారు ఏడుతలల స్వర్ణ శేషవాహనంపై(పెద్ద శేషవాహనం) తిరుమాడ వీధులలో భక్తులను అనుగ్రహిస్తారు.
తిరుమలకు చంద్రబాబు
ముఖ్యమంత్రి చంద్రబాబు నేడు (శుక్రవారం) తిరుమలకు రానున్నారు. బ్రహ్మోత్సవాల సందర్భంగా సతీ సమేతంగా శ్రీవారికి పుట్టు వస్త్రాలను చంద్రబాబు సమర్పించునున్నారు. సాయంత్రం 4 గంటలకు విజయవాడ నుంచి సీఎం బయలుదేరనున్నారు. రాత్రి 9 గంటలకు శ్రీవారి బ్రహ్మోత్సవాల సందర్భంగా సతీసమేతంగా పట్టు వస్త్రాలు సమర్పిస్తారు. రాత్రికి తిరుమలలోనే బస చేయనున్నారు. అనంతరం 5వ తేదీ ఉదయం 8 గంటలకు వకుళమాత కేంద్రీకృత వంటశాలను ప్రారంభించనున్నారు. 9 గంటలకు తిరిగి రేణిగుంట నుంచి హైదరాబాద్‌కు సీఎం చంద్రబాబు వెళ్లనున్నారు.












Click it and Unblock the Notifications