TTD: బ్రేక్ దర్శనాల పై టీటీడీ కీలక నిర్ణయం..!!

Tirumala: టీటీడీ వరుసగా పలు నిర్ణయాలు తీసుకుంటోంది. నూతన ఈవో శ్యామల రావు భక్తుల సౌకర్యాల పెంపు పై ఫోకస్ చేసారు. అధికారులకు సూచనలు చేస్తున్నారు. తాజాగా, శ్రీవారి పోటులో లడ్డూ ప్రసాదాలు తయారు చేసే పోటు కార్మికుల విధుల గురించి సుదీర్ఘంగా అధ్యయనం చేశారు. ఇక..జూలై 9వ తేదీన మంగళవారం కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం నిర్వహిస్తారు. ఈ నేపథ్యంలో బ్రేక్ దర్శనాల పై టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది.

బ్రేక్ దర్శనాలు రద్దు
తిరుమల శ్రీవారి ఆలయంలో జూలై 16న సాలకట్ల ఆణివార ఆస్థానం పర్వదినాన్ని పురస్కరించుకుని జూలై 9వ తేదీన మంగళవారం కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో జూలై 9 మరియు 16న బ్రేక్ దర్శనాలను టీటీడీ రద్దు చేసింది. ఈ కారణంగా జూలై 8 మరియు 15వ తేదీల్లో సిఫారసు లేఖలు స్వీకరించరని టీటీడీ వెల్లడించింది. ఆణివార ఆస్థానం సందర్భంగా ఆలయంలో కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం నిర్వహించడం ఆనవాయితీ.

TTD has cancelled VIP Break Darshan on July 9 and 16 respectively

9న కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం
సాధారణంగా సంవత్సరంలో నాలుగుసార్లు కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనాన్ని నిర్వహిస్తారు. ఉగాది, ఆణివార ఆస్థానం, బ్రహ్మోత్సవం, వైకుంఠ ఏకాదశి పర్వదినాల ముందు మంగళవారం ఆలయ శుద్ధి కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. ఇందులో భాగంగా ఉదయం 6 గంటలకు ప్రారంభమయ్యే తిరుమంజనం కార్యక్రమం సుమారు 5 గంటలపాటు కొనసాగనుంది. తిరుమంజనం కార్యక్రమం అనంతరం స్వామివారి మూలవిరాట్టుకు ఆలయ అర్చకులు ఆగమోక్తంగా పూజాది కార్యక్రమాలు నిర్వహిస్తారు.

లడ్డూ ప్రసాదాలు తయారు పరిశీలన
అనంతరం మధ్యాహ్నం 12 గంటల నుండి భక్తులను స్వామివారి దర్శనానికి అనుమతిస్తారు. తిరుమంజనం కారణంగా మంగళవారంనాడు నిర్వహించే అష్టదళపాదపద్మారాధన సేవను టీటీడీ రద్దు చేసింది.ఈవో శ్యామలరావు శ్రీవారి పోటులో లడ్డూ ప్రసాదాలు తయారు చేసే పోటు కార్మికుల విధుల గురించి సుదీర్ఘంగా అధ్యయనం చేశారు. ఇందులో భాగంగా, బూందీ తయారీ, చక్కర కలపడం, జీడిపప్పును బూందీలో కలపడం, లడ్డును తయారుచేసి, లడ్డు కౌంటర్లోకి పంపడం, లడ్డు ప్రసాదం పంపిణీ తదితర అంశాలపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా సంబంధిత అధికారులు ఈవోకు వివరించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+