తిరుమలలో అయిదేళ్ల తర్వాత..
Tirumala: ప్రఖ్యాత పుణ్యక్షేత్రం తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. వారాంతం కావడం వల్ల క్రిక్కిరిసిపోయింది. 80 వేల మందికి పైగా భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. శనివారం స్వామివారిని దర్శించుకున్న భక్తుల సంఖ్య 80 వేల దాటింది. మొత్తం 80,560 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు. వారిలో 35,195 మంది తలనీలాలను సమర్పించారు. ఆ ఒక్కరోజే హుండీ ద్వారా 3.22 కోట్ల రూపాయల ఆదాయం తిరుమల తిరుపతి దేవస్థానానికి అందింది.
వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లో కంపార్ట్ మెంట్టు అన్నీ భక్తులతో నిండిపోయాయి. శిలాతోరణం వరకు క్యూలైన్ ఏర్పడింది. టోకెన్ లేని సర్వదర్శనం భక్తులకు స్వామి వారి దర్శనానికి 24 నుండి 26 గంటల సమయం పట్టింది. కంపార్ట్ మెంట్లు, క్యూలైన్లల్లో ఉన్న భక్తులకు టీటీడీ సిబ్బంది, శ్రీవారి సేవకులు అన్నప్రసాదాలను పంపిణీ చేశారు.

కాగా పవిత్ర కార్తీకమాసాన్ని పురస్కరించుకుని ఆదివారం తిరుమలలో కార్తీక వనభోజన మహోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. పార్వేట మండపంలో కన్నులపండువగా ముగిసిందీ కార్యక్రమం. కార్తీక వనభోజనంలో భాగంగా శ్రీమలయప్ప స్వామివారిని బంగారుతిరుచ్చిపై వేంచేపు చేసి వాహన మండపానికి తీసుకువచ్చారు. ఉదయం 8.30 గంటలకు సమర్పణ అనంతరం మలయప్పస్వామి వారిని చిన్న గజవాహనంపై వాహనమండపం నుండి పార్వేట మండపానికి ఊరేగింపుగా తీసుకువచ్చారు.
అదే విధంగా అందంగా అలంకరించి మరో పల్లకిపై ఉభయనాంచారులను రంగనాయక మండపం నుండి పార్వేట మండపానికి ఊరేగింపుగా తీసుకు వచ్చారు. అనంతరం ఉదయం 11 నుండి 12 గంటల వరకు శ్రీ భూ సమేత శ్రీ మలయప్పస్వామివారికి స్నపన తిరుమంజనం వైభవంగా నిర్వహించారు. స్వామి- అమ్మవార్లను అభిషేకరించారు. వేదమంత్రోచ్ఛారణల మధ్య కార్తీక వనభోజన కార్యక్రమాన్ని చేపట్టారు. వందలాది మంది భక్తులు ఇందులో పాల్గొన్నారు.
వనభోజన మహోత్సవాన్ని శ్రీ తాళ్ళపాక అన్నమాచార్యులవారి పెద్దకుమారుడైన శ్రీ పెద తిరుమలాచార్యులవారు 16వ శతాబ్దంలో నిర్వహించినట్లు చారిత్రక ఆధారాలు ఉన్నాయి. ఆ తర్వాత కాలక్రమేణా ఈ ఉత్సవం ఆగిపోయింది. సుమారు 500 సంవత్సరాల తర్వాత దీన్ని టీటీడీ 2010లో పునరుద్ధరించింది. ఆంక్షలు, భారీ వర్షాల కారణంగా మళ్లీ 2020లో ఆగిపోయింది. అప్పటి నుండి కార్తీక మాసంలో వర్షాల కారణంగా పార్వేట మండపంలో కార్తీక వన భోజనాలు జరుగలేదు.
అయిదేళ్ల తర్వాత పార్వేట మండపంలో వన భోజన మహోత్సవం నిర్వహించడంతో వేలాదిగా భక్తులు ఉత్సాహంగా పాల్గొని భగవంతుని సమక్షంలో సహపంక్తి భోజనం చేశారు. ఈ సందర్భంగా టీటీడీ హిందూ ధర్మప్రచారపరిషత్, అన్నమాచార్య ప్రాజెక్టుల తరపున వివిధ భక్తి సంగీత కార్యక్రమాలు, హరికథలు ఏర్పాటు చేశారు. తిరుమల శ్రీవారి ఆలయంలో నిర్వహించే ఆర్జిత సేవలైన కల్యాణోత్సవం, ఊంజల్‌సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకార సేవలు రద్దయ్యాయి.
-
పాలకోసం ఏడుస్తుందని పసిదాన్ని చంపేసిన తల్లి.. తిరుపతి జిల్లాలో దారుణం -
ఇకపై నెలకు రెండు సిలిండర్లే..కొత్త బుకింగ్ రూల్స్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం












Click it and Unblock the Notifications