TTD: సాధారణ భక్తులకు ప్రాధాన్యత - టీటీడీ కీలక నిర్ణయాలు..!!

Tirumala: తిరుమలలో రద్దీ పెరుగుతోంది. శ్రీవారి దర్శనానికి 24 గంటల సమయం పడుతోంది. క్యూ కాంప్లెక్లులు నిండిపోయాయి. వేసవి సెలవులతో పాటుగా వారాంతపు రద్దీ ఎక్కువగా ఉండటంలో సామాన్య భక్తులకు ప్రాధాన్యత ఇస్తూ టీటీడీ కీలక నిర్ణయాలను అమలు చేస్తోంది. శ్రీవారి సేవలు..వీఐపీ బ్రేక్ దర్శనాల విషయంలో మార్పులు చేసింది. శుక్ర,శని,ఆదివారాలలో సుప్రభాత సేవా టిక్కేట్లను సిఫార్సు లేఖలు పై జారి చేసే విధానాన్ని రద్దు చేస్తూ టీటీడీ నిర్ణయం తీసుకుంది.

కొండ పైన భక్తుల రద్దీ : వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులతో కొండపై ఉన్న కంపార్ట్‌మెంట్లలో 29 కంపార్ట్‌మెంట్లు నిండిపోయాయి. టోకెన్లు లేని భక్తులకు 24 గంటల్లో సర్వదర్శనం కలుగుతుందని టీటీడీ అధికారులు వివరించారు. స్వామివారిని 74,995 మంది భక్తులు దర్శించుకోగా 39,663 మంది తలనీలాలు సమర్పించారు. భక్తులు సమర్పించిన కానుకల ద్వారా శ్రీవారి హుండీకి రూ. 3.60 కోట్లు ఆదాయం వచ్చినట్లు అధికారులు చెప్పారు. ఇదే సమయంలో సామాన్య భక్తులకు ప్రాధాన్యత ఇస్తూ జూన్ 30వ తేదీ వరకు స్వామివారి సేవలు, విఐపి దర్శనాల్లో స్వల్ప మార్పులు చేసారు. ప్రస్తుతం రద్దీ ఎక్కువగా ఉన్న సమయంలో ఆచరణాత్మకంగా ఈ నిర్ణయాలు టీటీడీ అమలు చేసింది.

 ttddevoters-

టీటీడీ కీలక నిర్ణయాలు : శుక్రవారం ( ఈ రోజు) ఉదయం అభిషేకాన్ని టీటీడీ ఉదయం 6.30 గంటలకే పూర్తి చేసింది. ఈవో ధర్మారెడ్డి స్వామి వారికి సుప్రభాతం నుంచి అభిషేక సేవ నిర్వహణ వరకు ప్రతీ నిమిషం సేవలు..భక్తులకు అందుతున్న దర్శనాల గురించి స్వయంగా పర్యవేక్షణ చేసారు. వారంతంలో శుక్రవారం నుంచి ఆదివారం వరకు సుప్రభాత సేవా టికెట్ల కోసం సిఫార్సు లేఖపైన జారీ చేసే విధానం తాత్కాలికంగా రద్దు చేస్తూ టీటీడీ నిర్ణయం తీసుకుంది. స్వామివారికి అలంకరణ పూర్తి చేసిన అనంతరం ఉదయం 8:30 గంటలకే టీటీడీ సామాన్య భక్తులుకు దర్శనం ప్రారంభించింది. వీఐపీ బ్రేక్ దర్శనాలకు సిఫార్సు లేఖలను స్వీకరించటం లేదు. స్వయంగా వచ్చే వీఐపీలకు మాత్రమే బ్రేక్ దర్శనం కల్పిస్తున్నారు.

రద్దీ తగ్గే వరకు అమలు : సుప్రభాత సేవకు అమల్లో ఉన్న విచక్ష్ణ కోటాను రద్దు చేసారు. దీని కారణంగా దాదాపు 20 నిమిషాల వరకు సమయం ఆదా అవుతున్నట్లు గుర్తించారు. గురువారం తిరుప్పావడ సేవ ఏకాంతంగా నిర్వహించనున్నారు. దీని ద్వారా సుమారు 30 నిమిషాల వరకు సమయం ఆదా కానుంది. వీఐపీ బ్రేక్ దర్శనాలు వారాంతంలో మూడు రోజులు రద్దు చేయటం ద్వారా మూడు గంటల వరకు సమయం ఆదా కావటం తో పాటుగా సాధారణ భక్తులకు దర్శనం త్వరగా కలుగుతోంది. దీని ద్వారా గంటల తరబడి క్యూ లైన్లలో నిలుస్తున్న సామాన్య భక్తులకు వెసులుబాటు కలుగుతోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+