వైకుంఠ ఏకాదశి వేళ శ్రీవారి సేవకులుగా అవకాశం వీరికే, మార్గదర్శకాలు..!!

తిరుమలలో రద్దీ సాధారణంగా ఉంది. తిరుమలలో బ్రహ్మోత్సవాలు వైభవంగా నిర్వహించారు. భక్తుల రద్దీకి అనుగుణంగా టీటీడీ చర్యలు తీసుకుంటోంది. ఇదే సమయంలో శ్రీవారి సేవకులుగా వైద్యుల కు సైతం టీటీడీ తాజాగా అవకాశం కల్పిస్తోంది. కాగా.. వైకుంఠ ఏకాదశి సమయంలో పది రోజుల పాటు వైకుంఠ ద్వార దర్శనం కల్పించాలని టీటీడీ భావిస్తోంది. ఈ సమయంలో శ్రీవారి సేవకులుగా అవకాశం పొందాలనుకునే వారి కోసం కీలక నిర్ణయాలు అమలు చేస్తోంది.

తిరుమలలో వైకుంఠ ఏకాదశికి ప్రత్యేకత ఉంది. పెద్ద సంఖ్యలో భక్తులు శ్రీవారి దర్శనానికి తరలి వస్తారు. ఈ సమయంలో శ్రీవారి సేవకుల విషయంలో కీలక నిర్ణయాలకు సిద్దం అయినట్లు తెలుస్తోంది. ఈసారి సేవకు హాజరయ్యే వాలంటీర్లు తప్పనిసరిగా ఏడు రోజుల పాటు సేలు అందించాల్సి ఉంటుంది. డిసెంబర్ 20న వైకుంఠ ఏకాదశి పర్వదినం. ఆ రోజు నుంచి డిసెంబర్ 29 వరకు భక్తులకు వైకుంఠ ద్వార దర్శనం అందుబాటులో ఉండనుంది. ఈ సమయంలో తిరుమలకు పెద్ద సంఖ్యలో భక్తులు వచ్చే అవకాశం ఉండటంతో సేవా కార్యక్రమాల నిర్వహణలో టీటీడీ ప్రత్యేక ఏర్పాట్ల పైన ఫోకస్ చేసింది. వైకుంఠ ఏకాదశి శ్రీవారి సేవ కోటా అక్టోబర్ 28, 2026 ఉదయం 11:00 గంటలకు విడుదల అవుతుంది (5 విడతలుగా, ఒక్కో విడత 7 రోజుల చొప్పున - డిసెంబర్ 16-22, 17-23, 22-28, 23-29, 24-30 మధ్య కాలానికి) విడుదల చేయనున్నారు.

ఏకగ్రీవాలు, మున్సిపల్ ఎన్నికల కొనసాగింపు పై కొత్త టెన్షన్ - కీలక పరిణామాలు, నేడే నిర్ణయం..!?
ఏకగ్రీవాలు, మున్సిపల్ ఎన్నికల కొనసాగింపు పై కొత్త టెన్షన్ - కీలక పరిణామాలు, నేడే నిర్ణయం..!?
ttd-introduces-new-rules-for-srivari-sevaks-during-vaikuntha-ekadashi-here-the-deails

శ్రీవారి సేవకులుగా రిజిస్ట్రేషన్

అదే విధంగా జనరల్ శ్రీవారి సేవ, నవనీత సేవ, పరకామణి సేవ కోటా: అక్టోబర్ 28, 2026 మధ్యాహ్నం 12:00 గంటలకు విడుదల చేయాలని నిర్ణయించారు. డిసెంబర్ 16, 17, 22, 23, 24 తేదీల్లో ప్రారంభమయ్యే స్లాట్లను ఎంపిక చేసుకునే అవకాశం ఉంటుందని పేర్కొన్నారు. సేవకు ఎంపికైన వారు తమకు కేటాయించిన తేదీ ప్రకారం సంబంధిత సేవా సదన్‌లో రిపోర్ట్ చేయాలి. మహిళా వాలంటీర్లు సేవా సదన్-1లో, పురుష వాలంటీర్లు సేవా సదన్-2లో హాజరుకావాలి. తిరుపతిలో సేవా స్లాట్ బుక్ చేసుకున్నవారు అక్కడి విష్ణు నివాసంలో రిపోర్ట్ చేయాలి. వైకుంఠ ఏకాదశి ప్రత్యేక సేవకు దరఖాస్తు చేసుకునే వారి వయస్సు 18 నుంచి 50 ఏళ్ల మధ్య ఉండాలి. గ్రూప్‌గా బుకింగ్ చేసుకునే వారిలో ప్రతి ఒక్కరూ ఈ వయోపరిమితికి లోబడి ఉండాలి. గ్రూపులో 50 ఏళ్లు దాటిన వ్యక్తి ఉంటే, ఆ సభ్యుడిని తొలగించి అర్హత కలిగిన మరో సభ్యుడిని చేర్చిన తర్వాతే బుకింగ్ చేసుకోవాలని సూచిస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+