తిరుమల ఘాట్ రోడ్డులో ప్రమాదం-ప్రయాణికులకు టీటీడీ అలర్ట్..!

తిరుమలలో ఇవాళ మరో అపశృతి చోటు చేసుకుంది. ఘాట్ రోడ్డులో భక్తులను తీసుకుని వెళ్తున్న ఆర్టీసీ బస్సు ప్రమాదానికి గురైంది. తిరుమల రెండో ఘాట్ రోడ్డు వద్ద బస్సు అదుపు తప్పి డివైడర్ ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో పలువురు భక్తులకు గాయాలయ్యాయి. క్రాష్ బారియర్ గట్టిగా ఉండటంతో బస్సు రోడ్డుపై నిలిచింది.లేదంటే లోయలో పడి పెను ప్రమాదం జరిగి ఉండేదని భక్తులు చెప్తున్నారు. గాయపడిన వారిని సమీప ఆస్పత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు.

తిరుమల ఘాట్ రోడ్డుపై ప్రమాదం కారణంగా బస్సు రోడ్డుకి అడ్డంగా నిలిచిపోవడంతో కిలో మీటర్ మేర వాహనాలు నిలిచిపోయాయి. దీనితో భక్తుల వాహనాలు ఎక్కడికక్కడ స్తంభించిపోయాయి. సమాచారం అందుకున్న టీటీడీ అధికారులు సంఘటనా స్థలానికి చేరుకుని, క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. అనంతరం అడ్డంగా ఉన్న బస్సును తొలగిస్తున్నారు.
ఈ నేపథ్యంలో ఘాట్ రోడ్డుపై ప్రయాణించే వారికి టీటీడీ అలర్ట్ జారీ చేసింది.

ttd issues fog alert to passengers travelling on Tirumala ghat road in wake of bus accident

తిరుమల ఘాట్ రోడ్ లో దట్టమైన పొగమంచు ఉన్నందున వాహన దారులు జాగ్రత్తగా ప్రయాణించాలని టీటీడీ కోరుతోంది.
తిరుమలకు వెళ్లే రెండవ ఘాట్ లో దట్టమైన పొగమంచు కారణంగా ఎదురుగా ఉన్న వాహనాలు సరిగ్గా కనపడక ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని తెలిపింది. కనుక వాహనదారులు దయచేసి ఘాట్ రోడ్డు లో ప్రయాణించే సమయంలో అప్రమత్తంగా ఉండాలని కోరుతోంది. మరోవైపు ఇవాళ లడ్డూ తయారీ కేంద్రంలో అగ్ని ప్రమాదంపై స్పందించిన టీటీడీ... పొగను అదుపు చేసేందుకు సిబ్బంది ప్రయత్నిస్తున్నట్లు వెల్లడించింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+